యిర్మీయా (Jeremiah)
Chapter 1
1. బెన్యామీనుదేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై, హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు
2. ఆమోను కుమారుడైన యోషీయా యూదాకు రాజై యుండగా అతని యేలుబడి పదుమూడవ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్ష మాయెను.
3. మరియు యోషీయా కుమారుడగు యెహో యాకీము యూదాకు రాజైయుండగాను, యోషీయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై యుండగాను, అతని యేలుబడి పదునొకండవ సంవత్సరాంతమువరకును, అనగా ఆ సంవత్సరమున అయిదవ నెలలో యెరూషలేము చెరదీసికొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగు చుండెను.
4. యెహోవావాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
5. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.
6. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా
7. యెహోవా నాకీలాగు సెలవిచ్చెనునేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్ప వలెను.
8. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే యెహోవా వాక్కు.
9. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరుముట్టి యీలాగు సెలవిచ్చెనుఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను.
10. పెల్లగించుటకును విరుగగొట్టుటకును, నశింపజేయుటకును పడద్రోయుటకును, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్య ములమీదను నిన్ను నియమించియున్నాను.
11. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకుబాదముచెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా
12. యెహోవానీవు బాగుగా కనిపెట్టితివి; నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతుర పడుచున్నాననెను.
13. రెండవమారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైనీకేమి కనబడుచున్నదని సెలవియ్యగా నేనుమసలుచున్న బాన నాకు కనబడుచున్నది; దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగియున్నదంటిని.
14. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెనుఉత్తర దిక్కునుండి కీడు బయలుదేరి యీ దేశనివాసులందరిమీదికి వచ్చును.
15. ఇదిగో నేను ఉత్తరదిక్కున నున్న రాజ్యముల సర్వవంశస్థు లను పిలిచెదను, వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను, యెరూషలేము చుట్టునున్న ప్రాకారము లన్నిటికి ఎదురుగాను, యూదాపట్టణములన్నిటికి ఎదురు గాను తమ సింహాసనములను స్థాపింతురు.
16. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపము వేసి, తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుట యను తమ చెడుతనమంతటినిబట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును.
17. కాబట్టి నీవు నడుముకట్టు కొని నిలువబడి నేను నీకాజ్ఞాపించునదంతయు వారికి ప్రకటనచేయుము; భయపడకుము లేదా నేను వారి యెదుట నీకు భయము పుట్టింతును.
18. యూదా రాజుల యొద్దకు గాని ప్రధానులయొద్దకు గాని యాజకులయొద్దకు గాని దేశనివాసులయొద్దకు గాని, యీ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను, ప్రాకారముగల పట్టణముగాను ఇనుపస్తంభముగాను ఇత్తడి గోడలు గాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించియున్నాను.
19. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొంద జాలరు; ఇదే యెహోవా వాక్కు.
Chapter 2
1. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
2. నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చునదేమనగానీవు అరణ్యములోను, విత్తనములు వేయదగనిదేశములోను, నన్ను వెంబడించుచు నీ ¸°వనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను.
3. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠితజనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయెను, అతని లయ పరచువారందరు శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభ వించును; ఇదే యెహోవా వాక్కు.
4. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివార లారా, మీరందరు యెహోవా వాక్కు వినుడి.
5. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగి పోయిరి?
6. ఐగుప్తుదేశములోనుండి మమ్మును రప్పించిన యెహోవా యెక్కడ నున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు, గోతులుగల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా యెక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు.
7. దాని ఫలములను శ్రేష్ఠపదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి, నా దేశమును అపవిత్రపరచి నా స్యాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి.
8. యెహోవా యెక్కడ ఉన్నాడని యాజకులడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలును నామీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు నిష్‌ప్రయోజనమైనవాటిని అనుసరింతురు
9. కావున నేనికమీదట మీతోను మీ పిల్లల పిల్లలతోను వ్యాజ్యెమాడెదను; ఇది యెహోవా వాక్కు.
10. కీత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలిసికొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా?
11. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేనిదానికై తమ మహిమను మార్చుకొనిరి.
12. ఆకాశమా, దీనిబట్టి విస్మయ పడుము, కంపించుము, బొత్తిగా పాడై పొమ్ము; ఇదే యెహోవా వాక్కు.
13. నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి యున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.
14. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా? యింటపుట్టిన దాసుడా? కాడు గదా; అతడేల దోపుడుసొమ్మాయెను?
15. కొదమ సింహములు వానిపైని బొబ్బలు పెట్టెను గర్జించెను, అవి అతని దేశము పాడుచేసెను, అతని పట్టణములు నివాసులులేక పాడా యెను.
16. నోపు, తహపనేసు అను పట్టణములవారు నీ నెత్తిని బద్దలు చేసిరి.
17. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గ ములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే యీ బాధ కలుగజేసికొంటివి గదా.
18. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పనియున్నది? యూఫ్రటీసునది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పనియున్నది.
19. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయ భక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగు నని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా సెల విచ్చుచున్నాడు.
20. పూర్వ కాలమునుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసితినినేను సేవచేయ నని చెప్పుచున్నావు; ఎత్తయిన ప్రతి కొండమీదను పచ్చని ప్రతి చెట్టుక్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు.
21. శ్రేష్ఠమైన ద్రాక్షావల్లివంటి దానిగా నేను నిన్ను నాటి తిని; కేవలము నిక్కమైన విత్తనమువలని చెట్టు వంటిదానిగా నిన్ను నాటితిని; నాకు జాతిహీనపు ద్రాక్షావల్లివలె నీ వెట్లు భ్రష్టసంతాన మైతివి?
22. నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది; ఇది ప్రభువగు యెహోవా వాక్కు.
23. నేను అపవిత్రత నొందినదానను కాను, బయలు దేవతల ననుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లనుకొందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసినదాని తెలిసికొనుము, నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల ఒంటెవు,
24. అరణ్యమునకు అల వాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురతవలన గాలి పీల్చును, కలిసికొనునప్పుడు దాని త్రిప్పగల వాడెవడు? దాని వెదకు గాడిదలలో ఏదియు అలసి యుండదు, దాని మాసములో అది కనబడును.
25. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పిగొన కుండునట్లు జాగ్రత్తపడుము అని నేను చెప్పినను నీవుఆ మాట వ్యర్థము, వినను, అన్యులను మోహించితిని, వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు.
26. దొరికిన దొంగ సిగ్గుపడునట్లు ఇశ్రాయేలుకుటుంబము వారు సిగ్గుపడుదురునీవు మా తండ్రివని మ్రానుతోనునీవే నన్ను పుట్టించితివని రాతితోను చెప్పుచు, వారును వారి రాజులును వారి అధిపతులును వారి యాజకులును వారి ప్రవక్తలును అవమానము నొందుదురు.
27. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి; అయినను ఆపత్కాలములోలేచి మమ్మును రక్షింపుమని వారు మనవి చేయుదురు.
28. నీకు నీవు చేసికొనిన దేవతలు ఎక్కడ నున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించు నేమో; యూదా, నీ పట్టణములెన్నో నీ దేవతలన్నియే గదా.
29. మీరందరు నామీద తిరుగుబాటు చేసినవారు, నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు.
30. నేను మీ పిల్లలను హతముచేయుట వ్యర్థమే; వారు శిక్షకు లోబడరు; నాశనవాంఛగల సింహమువలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించు చున్నది.
31. ఈ తరమువార లారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడినేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా? గాఢాంధకార దేశమువలెనైతినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడువార మైతివిు; ఇకను నీయొద్దకు రామని నా ప్రజలేల చెప్పు చున్నారు?
32. కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లికుమారి తన ఒడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు.
33. కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు; అందువలన నీ కార్యములు చేయుటకు చెడుస్త్రీలకు నేర్పితివి గదా.
34. మరియు నిర్ధోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగులమీద కనబడుచున్నది; కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటిమీదను కనబడు చున్నది.
35. అయినను నీవునేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నామీదనుండి తొలగిపోయెనని చెప్పు కొనుచున్నావు. ఇదిగోపాపము చేయలేదని నీవు చెప్పిన దానిబట్టి నీతో నాకు వ్యాజ్యెము కలిగినది.
36. నీ మార్గము మార్చు కొనుటకు నీవేల ఇటు అటు తిరుగులాడుచున్నావు? నీవు అష్షూరును ఆధారము చేసికొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసికొని సిగ్గుపడెదవు.
37. చేతులు నెత్తిని బెట్టు కొని ఆ జనమునొద్దనుండి బయలు వెళ్లెదవు; యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు. వాటివలన నీకు క్షేమము కలుగదు.
Chapter 3
1. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతనియొద్దనుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమెయొద్దకు తిరిగిచేరునా? ఆలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును గదా; అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నాయొద్దకు తిరిగిరమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
2. చెట్లులేని కొండప్రదేశమువైపు నీ కన్నులెత్తి చూడుము; నీతో ఒకడు శయనింపని స్థలమెక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబిదేశస్థుడు కాచియుండునట్లుగా నీవు వారికొరకు త్రోవలలో కూర్చుండియున్నావు; నీ వ్యభి చారములచేతను నీ దుష్కార్యములచేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు.
3. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి యున్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యమువంటి ధైర్యము గలదు, సిగ్గు పడనొల్ల కున్నావు.
4. అయినను ఇప్పుడు నీవునా తండ్రీ, చిన్నప్పటినుండి నాకు చెలికాడవు నీవే యని నాకు మొఱ్ఱపెట్టుచుండవా?
5. ఆయన నిత్యము కోపించునా? నిరంతరము కోపము చూపునా? అని నీవనుకొనినను నీవు చేయదలచిన దుష్కార్యములు చేయుచునే యున్నావు.
6. మరియు రాజైన యోషీయా దినములలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెనుద్రోహినియగు ఇశ్రాయేలు చేయుకార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండమీదికిని పచ్చని ప్రతి చెట్టు క్రిందికిని పోవుచు అక్కడ వ్యభిచారము చేయుచున్నది.
7. ఆమె యీ క్రియలన్నిటిని చేసినను, ఆమెను నాయొద్దకు తిరిగి రమ్మని నేను సెలవియ్యగా ఆమె తిరిగిరాలేదు. మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరియైన యూదా దాని చూచెను.
8. ద్రోహినియగు ఇశ్రాయేలు వ్యభి చారముచేసిన హేతువుచేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగపత్రిక ఇయ్యగా, విశ్వాసఘాతకు రాలగు ఆమె సహోదరియైన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచు వచ్చు చున్నది.
9. రాళ్లతోను మొద్దులతోను వ్యభిచారము చేసెను; ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచెను.
10. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకు రాలగు ఆమె సహోదరియైన యూదా పైవేషమునకే గాని తన పూర్ణహృదయముతో నాయొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
11. కాగా విశ్వాసఘాతకురాలగు యూదాకంటె ద్రోహినియగు ఇశ్రాయేలు తాను నిర్దోషినియని ఋజువుపరచుకొని యున్నది.
12. నీవు వెళ్లి ఉత్తరదిక్కున ఈ మాటలు ప్రక టింపుముద్రోహినివగు ఇశ్రాయేలూ, తిరిగిరమ్ము; ఇదే యెహోవా వాక్కు. మీమీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడు కోపించువాడను కాను; ఇదే యెహోవా వాక్కు.
13. నీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటు చేయుచు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము; ఇదే యెహోవా వాక్కు.
14. భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను.
15. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు.
16. మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులుయెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు, అది వారి మనస్సు లోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసికొనరు, అది పోయి నందుకు చింతపడరు, ఇకమీదట దాని చేయరాదు; ఇదే యెహోవా వాక్కు.
17. ఆ కాలమునయెహోవాయొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు; జనము లన్నియు తమ దుష్టమనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమునుబట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు.
18. ఆ దిన ములలో యూదావంశస్థులును ఇశ్రాయేలు వంశస్థులును కలిసి ఉత్తరదేశములోనుండి ప్రయాణమై, మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు.
19. నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని, రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చెద ననుకొని యుంటిని. నీవునా తండ్రీ అని నాకు మొఱ్ఱపెట్టి నన్ను మానవనుకొంటిని గదా?
20. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాస ఘాతకులైతిరి; ఇదే యెహోవా వాక్కు.
21. ఆలకించుడి, చెట్లులేని మెట్టలమీద ఒక స్వరము వినబడుచున్నది; ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహో వాను మరచినదానిని బట్టి ఇశ్రాయేలీయులు చేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి.
22. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి;మీ అవిశ్వాసమును నేను బాగుచేసెదను; నీవే మాదేవుడ వైనయెహోవావు, నీయొద్దకే మేము వచ్చు చున్నాము,
23. నిశ్చయముగా కొండలమీద జరిగినది మోస కరము, పర్వతములమీద చేసిన ఘోష నిష్‌ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవావలన ఇశ్రాయేలు నకు రక్షణ కలుగును.
24. అయినను మా బాల్యమునుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొఱ్ఱలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మింగివేయుచున్నది.
25. సిగ్గునొందినవారమై సాగిలపడుదము రండి, మనము కనబడకుండ అవమానము మనలను మరుగుచేయును గాక; మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులును మన బాల్యమునుండి నేటివరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసినవారము.
Chapter 4
1. ఇదే యెహోవా వాక్కుఇశ్రాయేలూ, నీవు తిరిగి రానుద్దేశించినయెడల నా యొద్దకే రావలెను, నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధినుండి తొలగించి
2. సత్యమునుబట్టియు న్యాయమును బట్టియు నీతినిబట్టియు యెహోవా జీవముతోడని ప్రమా ణముచేసినయెడల జనములు ఆయనయందు తమకు ఆశీర్వా దము కలుగుననుకొందురు, ఆయనయందే అతిశయపడు దురు.
3. యూదావారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుముళ్లపొద లలో విత్తనములు చల్లక మీ బీడుపొలమును దున్నుడి.
4. అవిధేయులై యుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి యెవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి.
5. యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలే ములో చాటించుడి, దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి, ఎట్లనగాప్రాకారముగల పట్టణ ములలోనికి పోవునట్లుగా పోగై రండి.
6. సీయోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి; పారిపోయి తప్పించుకొను టకు ఆలస్యము చేయకుడని చెప్పుడి; యెహోవానగు నేను ఉత్తరదిక్కునుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను,
7. పొదలలో నుండి సింహము బయలుదేరియున్నది; జనముల వినాశ కుడు బయలుదేరియున్నాడు, నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి యున్నాడు, నీ పట్టణములు పాడై నిర్జనముగానుండును.
8. ఇందుకై గోనెపట్ట కట్టుకొనుడి; రోదనము చేయుడి, కేకలు వేయుడి, యెహోవా కోపాగ్ని మనమీదికి రాకుండ మానిపోలేదు;
9. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున రాజును అధిపతులును ఉన్మత్తులగుదురు యాజకులు విభ్రాంతి నొందుదురు, ప్రవక్తలు విస్మయ మొందుదురు.
10. అప్పుడు నేనిట్లంటినికటకటా, యెహోవా ప్రభువా, ఖడ్గము హత్యచేయుచుండగా నీవుమీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి.
11. ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఈలాగు చెప్పబడును అరణ్యమందు చెట్లులేని మెట్టలమీదనుండి వడగాలి నా జనుల కుమార్తెతట్టు విసరుచున్నది; అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు.
12. అంతకంటె మిక్కుటమైన గాలి నామీద కొట్టుచున్నది. ఇప్పుడు వారిమీదికి రావలసిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా చెప్పుచున్నాడు.
13. మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు, ఆయన రథములు సుడిగాలివలె నున్నవి, ఆయన గుఱ్ఱములు గద్దలకంటె వేగముగలవి, అయ్యో, మనము దోపుడు సొమ్మయితివిు.
14. యెరూష లేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములోనుండి చెడుతనము కడిగివేసికొనుము, ఎన్నాళ్లవరకు నీ దుష్టాభి ప్రాయములు నీకు కలిగియుండును?
15. దాను ప్రదేశమున నొకడు ప్రకటన చేయుచున్నాడు, కీడు వచ్చుచున్నదని ఎఫ్రాయిము కొండలయందొకడు చాటించుచున్నాడు,
16. ముట్టడి వేయువారు దూరదేశమునుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొందుమని బిగ్గరగా అరచుచున్నారని యెరూషలేమునుగూర్చి ప్రకటనచేయుడి, జనములకు తెలియజేయుడి.
17. ఆమె నామీద తిరుగుబాటు చేసెను గనుక వారు చేనికాపరులవలె దానిచుట్టు ముట్టడివేతురు; ఇదే యెహోవా వాక్కు.
18. నీ ప్రవర్తనయు నీ క్రియ లును వీటిని నీమీదికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చేదుగానున్నది గదా, నీ హృదయము నంటుచున్నది గదా?
19. నా కడుపు, నా కడుపు, నా అంతరంగములో నా కెంతో వేదనగానున్నది; నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను; నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది గదా?
20. కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది, నా గుడారములును హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలును దోచు కొనబడియున్నవి.
21. నేను ఎన్నాళ్లు ధ్వజమును చూచు చుండవలెను బూరధ్వని నేనెన్నాళ్లు వినుచుండవలెను?
22. నా జనులు అవివేకులు వారు నన్నెరుగరు, వారు మూఢు లైన పిల్లలు వారికి తెలివిలేదు, కీడుచేయుటకు వారికి తెలియును గాని మేలు చేయుటకు వారికి బుద్ది చాలదు.
23. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; ఆకాశముతట్టు చూడగా అచ్చట వెలుగులేకపోయెను.
24. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నియు కదులుచున్నవి.
25. నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశపక్షు లన్నియు ఎగిరిపోయియుండెను.
26. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి యెడారి ఆయెను, అందులోని పట్టణములన్నియు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన యెదుట నుండకుండ పడగొట్టబడియుండెను.
27. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఈదేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను.
28. దానినిబట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మి యున్నది, అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని, నేను పశ్చాత్తాప పడుటలేదు రద్దుచేయుటలేదు.
29. రౌతులును విలు కాండ్రును చేయు ధ్వని విని పట్టణస్థులందరు పారిపోవు చున్నారు, తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు, ప్రతి పట్టణము నిర్జనమాయెను వాటిలొ నివాసులెవరును లేరు,
30. దోచుకొన బడినదానా, నీవేమి చేయుదువు? రక్త వర్ణవస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణ ములు ధరించి కాటుకచేత నీ కన్నులు పెద్దవిగా చేసి కొనుచున్నావే; నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే; నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయ జూచుచున్నారు.
31. ప్రసవవేదనపడు స్త్రీ కేకలువేయునట్లు, తొలికానుపు కనుచు వేదనపడు స్త్రీ కేకలువేయునట్లు సీయోనుకుమార్తె అయ్యో, నాకు శ్రమ, నరహంతకులపాలై నేను మూర్చిల్లుచున్నాను అని యెగరోజుచు చేతులార్చుచు కేకలువేయుట నాకు విన బడుచున్నది.
Chapter 5
1. యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలిసికొనుడి; దాని రాజవీధులలో విచారణ చేయుడి; న్యాయము జరిగించుచు నమ్మకముగానుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడినయెడల నేను దాని క్షమించుదును.
2. యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయు దురు.
3. యెహోవా, యథార్థతమీదనే గదా నీవు దృష్టి యుంచుచున్నావు? నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు; వారిని క్షీణింప జేసియున్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతికంటె తమ ముఖములను కఠినముగా చేసికొనియున్నారు, మళ్లుటకు సమ్మతింపరు.
4. నేనిట్లనుకొంటిని వీరు ఎన్నికలేనివారై యుండి యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయవిధిని ఎరుగక బుద్ధిహీనులై యున్నారు.
5. ఘనులైనవారియొద్దకు పోయెదను వారితో మాటలాడెదను, వారు యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయవిధిని ఎరిగినవారై యుందురుగదా అని నేననుకొంటిని. అయితే ఒకడును తప్పకుండ వారు కాడిని విరిచినవారుగాను కట్లను తెంపు కొనినవారుగాను ఉన్నారు.
6. వారు తిరుగుబాటుచేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యమునుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణములయొద్ద పొంచి యుండును, వాటిలోనుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును.
7. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కానివాటి తోడని ప్రమాణము చేయుదురు; నేను వారిని తృప్తిగ పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు; నేనెట్లు నిన్ను క్షమించు దును?
8. బాగుగా బలిసిన గుఱ్ఱములవలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్యవెంబడి సకి లించును
9. అట్టి కార్యములనుబట్టి నేను దండింపకుందునా? అట్టి జనముమీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు.
10. దాని ప్రాకారము లెక్కి నాశనముచేయుడి, అయినను నిశ్శేషముగా నాశనముచేయకుడి, దాని శాఖలను కొట్టి వేయుడి. అవి యెహోవావి కావు.
11. ఇశ్రాయేలు వంశస్థు లును యూదా వంశస్థులును బహుగా విశ్వాసఘాతకము చేసియున్నారు; ఇదే యెహోవా వాక్కు.
12. వారుపలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరవునైనను చూడ మనియు,
13. ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు.
14. కావున సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను; ఇదే యెహోవా వాక్కు.
15. ఇశ్రాయేలు కుటుంబమువారలారా, ఆలకించుడి, దూర ముననుండి మీ మీదికి ఒక జనమును రప్పించెదను, అది బలమైన జనము పురాతనమైన జనము; దాని భాష నీకు రానిది, ఆ జనులు పలుకుమాటలు నీకు బోధపడవు.
16. వారి అమ్ముల పొది తెరచిన సమాధి, వారందరు బలా ఢ్యులు,
17. వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు, నీ కుమా రులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు, నీ గొఱ్ఱలను నీ పశువులను నాశనముచేయు దురు, నీ ద్రాక్షచెట్ల ఫలమును నీ అంజూరపుచెట్ల ఫలమును నాశనము చేయుదురు, నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములుగల పట్టణములను వారు కత్తిచేత పాడు చేయుదురు.
18. అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషములేకుండ నశింపజేయను; ఇదే యెహోవా వాక్కు.
19. మన దేవుడైన యెహోవా దేనినిబట్టి ఇవన్నియు మాకు చేసెనని వారడుగగా నీవు వారితో ఈలాగనుముమీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్యదేవతలను కొలిచి నందుకు, మీదికాని దేశములో మీరు అన్యులను కొలిచె దరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
20. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి
21. కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకములేని మూఢులారా, ఈ మాట వినుడి.
22. సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయ పడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు.
23. ఈ జనులు తిరుగు బాటును ద్రోహమునుచేయు మనస్సుగల వారు, వారు తిరుగుబాటుచేయుచు తొలగి పోవుచున్నారు.
24. వారురండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగియుందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించు వాడు గదా; నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు.
25. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము.
26. నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచి యుండునట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకొందురు.
27. పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి యిండ్లు కపటముతో నిండియున్నవి, దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్య వంతులును అగుదురు.
28. వారు క్రొవ్వి బలిసియున్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయు చున్నారు, తండ్రిలేనివారు గెలువకుండునట్లు వారి వ్యాజ్యెమును అన్యాయముగా తీర్చుదురు, దీనుల వ్యాజ్యె మును తీర్పునకు రానియ్యరు.
29. అట్టి వాటిని చూచి నేను శిక్షింపక యుందునా? అట్టి జనులకు నేను ప్రతి దండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు.
30. ఘోరమైన భయంకరకార్యము దేశములో జరుగు చున్నది.
31. ప్రవక్తలు అబద్ధప్రవచనములు పలికెదరు, యాజ కులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు, ఆలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము; దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు?
Chapter 6
1. బెన్యామీనీయులారా, యెరూషలేములోనుండి పారి పోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బేత్ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి, కీడు ఉత్తర దిక్కునుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది.
2. సుందరియు సుకుమారియునైన సీయోను కుమార్తెను పెల్ల గించుచున్నాను.
3. గొఱ్ఱల కాపరులు తమ మందలతో ఆమెయొద్దకు వచ్చెదరు, ఆమె చుట్టు తమ గుడారములను వేయుదురు, ప్రతివాడును తన కిష్టమైనచోట మందను మేపును.
4. ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి; లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో, మనకు శ్రమ, ప్రొద్దు గ్రుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి.
5. లెండి ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదము.
6. సైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడిదిబ్బ కట్టుడి, ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడచునది గనుక శిక్ష నొందవలసి వచ్చెను.
7. ఊట తన జలమును పైకి ఉబుక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబుకచేయు చున్నది, బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది, గాయములును దెబ్బలును నిత్యము నాకు కనబడుచున్నవి.
8. యెరూషలేమా, నేను నీయొద్దనుండి తొలగింపబడకుండునట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము.
9. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడుద్రాక్షచెట్టు ఫలమును ఏరుకొనునట్లు మను ష్యులు ఏమియు మిగులకుండ ఇశ్రాయేలు శేషమును ఏరు దురు; ద్రాక్షపండ్లను ఏరువాడు చిన్న తీగెలను ఏరుటకై తన చెయ్యి మరల వేయునట్లు నీ చెయ్యివేయుము.
10. విందురని నేనెవరితో మాటలాడెదను? ఎవరికి సాక్ష్య మిచ్చెదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు.
11. కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను, దానిని అణచుకొని అణచుకొని నేను విసికియున్నాను, ఒకడు తప్పకుండ వీధిలోనున్న పసిపిల్లలమీదను ¸°వనుల గుంపుమీదను దాని కుమ్మరింపవలసి వచ్చెను, భార్యా భర్త లును వయస్సు మీరినవారును వృద్ధులును పట్టుకొనబడె దరు.
12. ఏమియు మిగులకుండ వారి యిండ్లును వారి పొల ములును వారి భార్యలును ఇతరులకు అప్పగింపబడుదురు, ఈ దేశనివాసులమీద నేను నా చెయ్యి చాపుచున్నాను; ఇదే యెహోవా వాక్కు
13. అల్పులేమి ఘనులేమి వారందరు మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరు వంచకులు.
14. సమాధానములేని సమయమునసమాధానము సమాధానమని చెప్పుచు, నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగుచేయు దురు.
15. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు; అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడి పోవువారితో వారు పడిపోవుదురు, నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెల విచ్చుచున్నాడు.
16. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమార్గ ములలో నిలిచి చూడుడి, పురాతనమార్గములనుగూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారుమేము అందులో నడుచుకొనమని చెప్పు చున్నారు.
17. మిమ్మును కాపుకాయుటకు నేను కావలివారిని ఉంచియున్నాను; ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది.
18. అయితే మేము వినమని వారను చున్నారు; అన్యజనులారా, వినుడి; సంఘమా, వారికి జరిగిన దానిని తెలిసికొనుము.
19. భూలోకమా, వినుము; ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారిమీదికి రప్పించుచున్నాను.
20. షేబనుండి వచ్చు సాంబ్రాణి నాకేల? దూరదేశమునుండి వచ్చు మధురమైన చెరుకు నాకేల? మీ దహనబలులు నాకిష్ట మైనవి కావు, మీ బలులయందు నాకు సంతోషము లేదు.
21. కావున యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్లు వేయుదును; తండ్రులేమి కుమారులేమి అందరును అవి తగిలి కూలుదురు; ఇరుగుపొరుగువారును నశించెదరు.
22. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఉత్తర దేశమునుండి యొక జనము వచ్చుచున్నది, భూదిగంత ములలోనుండి మహా జనము లేచి వచ్చుచున్నది.
23. వారు వింటిని ఈటెను వాడనేర్చినవారు, అది యొక క్రూర జనము; వారు జాలిలేనివారు, వారి స్వరము సముద్ర ఘోషవలె నున్నది, వారు గుఱ్ఱములెక్కి సవారిచేయు వారు; సీయోను కుమారీ, నీతో యుద్ధము చేయవలెనని వారు యోధులవలె వ్యూహము తీరియున్నారు.
24. దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగు చున్నవి, ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము.
25. పొలములోనికి పోకుము, మార్గములో నడువకుము, శత్రువులు కత్తిని ఝుళిపించుచున్నారు, నలు దిక్కుల భయము తగులుచున్నది.
26. నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మామీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిదె చల్లుకొనుము; ఏక కుమారుని గూర్చి దుఃఖించునట్లు దుఃఖము సలుపుము ఘోరమైన దుఃఖము సలుపుము.
27. నీవు నా జనుల మార్గమును తెలిసి కొని పరీక్షించునట్లు నిన్ను వారికి వన్నెచూచువానిగాను వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించి యున్నాను.ఒ
28. వారందరు బహు ద్రోహులు, కొండె గాండ్రు, వారు మట్టిలోహము వంటివారు, వారందరు చెరుపువారు.
29. కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టు చున్నది గాని అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది; వ్యర్థము గానే చొక్కముచేయుచు వచ్చెను. దుష్టులు చొక్క మునకు రారు.
30. యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండియని వారికి పేరు పెట్టబడును.
Chapter 7
1. యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు
2. నీవు యెహోవా మందిర ద్వారమున నిలువ బడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుముయెహోవాకు నమస్కారముచేయుటకై యీ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి.
3. సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి
4. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే; యీ మోసకరమైన మాటలు ఆధారము చేసికొనకుడి.
5. ఆలాగనక, మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొని, ప్రతివాడు తన పొరుగు వానియెడల తప్పక న్యాయము జరిగించి.
6. పరదేశులను తండ్రిలేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషిరక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండినయెడల
7. ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచు దును.
8. ఇదిగో అబద్ధపుమాటలను మీరు నమ్ముకొను చున్నారు. అవి మీకు నిష్‌ప్రయోజనములు.
9. ఇదేమి? మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు
10. అబద్ధసాక్ష్యము పలుకుచు బయలునకు ధూపమువేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే; అయినను నా నామము పెట్టబడిన యీ మందిరములో నికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదలనొందియున్నామని మీరు చెప్పుదురు; ఈ హేయక్రియలన్నియు జరిగించుటకేనా మీరు విడుదలనొందితిరి?
11. నాదని చాటబడిన యీ మంది రము మీ దృష్టికి దొంగలగుహయైనదా? ఆలోచించుడి, నేనే యీ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు.
12. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి, ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి; ఇదే యెహోవా వాక్కు.
13. నేను మీతో మాటలాడినను పెందలకడ లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండినవారై యీ క్రియలన్నిటిని చేసితిరి గనుక
14. నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామముపెట్టబడిన యీ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను ఆలాగే చేయుదును.
15. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులనందరిని నేను వెళ్లగొట్టినట్లు మిమ్మును నా సన్నిధినుండి వెళ్లగొట్టుదును.
16. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థనచేయకుము, వారికొరకు మొఱ్ఱ నైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలుకొనకుము, నేను నీ మాట వినను.
17. యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా.
18. నాకు కోపము పుట్టించునట్లు ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయవలెననియు, అన్య దేవతలకు పానార్పణ ములు పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజ బెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు.
19. నాకే కోపము పుట్టించునంతగా వారు దాని చేయుచున్నారా? తమకే అవమానము కలుగు నంతగా చేయుచున్నారు గదా, యిదే యెహోవా వాక్కు.
20. అందువలన ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఈ స్థలముమీదను నరులమీదను జంతువులమీదను పొలముల చెట్లమీదను భూమిపంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను, ఆర్పశక్యము కాకుండ అది మండును.
21. సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి.
22. నేను ఐగుప్తు దేశములోనుండి మీ పితరులను రప్పించిన దినమున దహనబలులనుగూర్చిగాని బలులనుగూర్చిగాని నేను వారితో చెప్పలేదు, అట్టి వాటినిగూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చి తిని
23. ఏదనగానా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులై యుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.
24. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచనలనుబట్టి తమ దుష్ట హృదయకాఠిన్యము ననుసరించి నడుచుచు వచ్చిరి.
25. మీ పితరులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే; నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీ యొద్దకు పంపుచు వచ్చితిని.
26. వారు నా మాట వినకయున్నారు చెవియొగ్గకయున్నారు తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనుచున్నారు; వారు తమ పితరులకంటె మరి దుష్టులైరి.
27. నీవు ఈ మాటలన్నియు వారితో చెప్పినను వారు నీ మాటలంగీకరింపరు, నీవు వారిని పిలిచినను వారు నీకుత్తర మియ్యరు
28. గనుక నీవు వారితో ఈలాగు చెప్పుమువీరు తమ దేవుడైన యెహోవా మాట విననివారు, శిక్షకు లోబడనొల్లనివారు, కాబట్టి నమ్మకము వారిలోనుండి తొలగిపోయియున్నది, అది వారి నోట నుండకుండ కొట్టి వేయబడియున్నది.
29. తనకు కోపము తెప్పించు తరమువారిని యెహోవా విసర్జించి వెళ్లగొట్టుచున్నాడు; సీయోనూ నీ తలవెండ్రు కలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయుము, చెట్లులేని మెట్టలమీద ప్రలాపవాక్య మెత్తుము.
30. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుయూదా వారు నా దృష్టికి చెడ్డక్రియలు చేయుచున్నారు, నా నామముపెట్టబడిన మందిరము అపవిత్రపడునట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచియున్నారు.
31. నేనాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు.
32. కాలము సమీపించుచున్నది; అప్పుడు అది తోఫెతు అనియైనను బెన్‌హిన్నోము లోయ అనియైనను అనబడక వధలోయ అనబడును; పాతిపెట్టు టకు స్థలము లేకపోవువరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడును; ఇదే యెహోవా వాక్కు.
33. ఈ జనుల శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహార మగును, వాటిని తోలివేయువాడు లేకపోవును.
34. ఉల్లాస ధ్వనియు ఆనందధ్వనియు పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను లేకుండచేసెదను; ఈ దేశము తప్పక పాడైపోవును.
Chapter 8
1. యెహోవా వాక్కుఆ కాలమున శత్రువులు యూదారాజుల యెముకలను అధిపతుల యెముకలను యాజకుల యెముకలను ప్రవక్తల యెముకలను యెరూష లేము నివాసుల యెముకలను సమాధుల లోనుండి వెలుపలికి తీసి
2. వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణచేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల యెదుట వాటిని పరచెదరు; అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమిమీద పెంట వలె పడియుండును.
3. అప్పుడు నేను తోలివేసిన స్థలము లన్నిటిలో మిగిలియున్న యీ చెడ్డ వంశములో శేషించిన వారందరు జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు; సైన్యముల కధిపతియగు యెహోవా వాక్కు ఇదే.
4. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుముమనుష్యులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుష్యులు తిరిగిరారా?
5. యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు? వారు మోసమును ఆశ్రయము చేసికొని తిరిగి రామని యేల చెప్పుచున్నారు?
6. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికిమాలిన మాటలు వారాడుకొనుచున్నారునేనేమి చేసితినని చెప్పితన చెడుతనమునుగూర్చి పశ్చాత్తాపపడువాడొకడును లేక పోయెను? యుద్ధమునకు చొరబడు గుఱ్ఱమువలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు.
7. ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగలకత్తిపిట్టయు ఓదెకొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు.
8. మేము జ్ఞానులమనియు, యెహోవా ధర్మశాస్త్రము మాయొద్దనున్న దనియు మీరేల అందురు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది.
9. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయమొంది చిక్కున పడియున్నారు, వారు యెహోవా వాక్యమును నిరాక రించినవారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు?
10. గనుక వారి భార్యలను అన్యుల కప్పగింతును, వారిని జయించువారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి ఘనులేమి అందరును మోసముచేసి దోచుకొనువారు; ప్రవక్తలేమి యాజకులేమి అందరును వంచకులు.
11. సమాధానము లేని సమయమునసమాధానము సమాధానము అని వారు చెప్పుచు, నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు.
12. తాము హేయమైన క్రియలు చేయు చున్నందున సిగ్గుపడవలసి వచ్చెనుగాని వారేమాత్రమును సిగ్గుపడరు; అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడిపోవువారిలో వారు పడిపోవుదురు; నేను వారిని విమర్శించుకాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు
13. ద్రాక్షచెట్టున ఫల ములు లేకుండునట్లును, అంజూరపుచెట్టున అంజూరపు పండ్లు లేకుండునట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను; వారిమీదికి వచ్చు వారిని నేనాలాగున పంపుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
14. మనమేల కూర్చుండియున్నాము? మనము పోగు బడి ప్రాకారములుగల పట్టణములలోనికి పోదము, అక్క డనే చచ్చిపోదము రండి; యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు, ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు.
15. మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మేలేమియు రాదా యెను; క్షేమముకొరకు కనిపెట్టుచున్నాముగాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు.
16. దానునుండి వచ్చువారి గుఱ్ఱముల బుసలు వినబడెను, వారి గుఱ్ఱముల సకిలింపు ధ్వనిచేత దేశమంతయు కంపించుచున్నది, వారు వచ్చి దేశ మును అందులోనున్న యావత్తును నాశనము చేయు దురు, పట్టణమును అందులో నివసించువారిని నాశ నము చేయుదురు.
17. నేను మిడునాగులను మీలోనికి పంపు చున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు; ఇదే యెహోవా వాక్కు.
18. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేనిచేత దుఃఖోపశాంతి నొందుదును?
19. యెహోవా సీయో నులో లేకపోయెనా? ఆమె రాజు ఆమెలో లేకపోయెనా? అని బహు దూరదేశమునుండి నా ప్రజల రోదనశబ్దము విన బడుచున్నది; వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపములచేతను నాకేల కోపము తెప్పించిరి?
20. కోత కాలము గతించియున్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణనొందకయే యున్నాము అని చెప్పుదురు.
21. నా జనుల వేదననుబట్టి నేను వేదనపడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోరభయము నన్ను పట్టియున్నది.
22. గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యు డును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక పోవు చున్నది?
Chapter 9
1. నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివా రాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.
2. నా జనులందరు వ్యభిచారులును ద్రోహుల సమూహమునై యున్నారు. అహహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు? నేను నా జనులను విడిచి వారియొద్దనుండి తొలగిపోవుదును.
3. విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచు దురు; దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉప యోగపరచరు. నన్ను ఎరుగక కీడువెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు; ఇదే యెహోవా వాక్కు.
4. మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా నుండవలెను; ఏ సహోదరు నినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును; ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు.
5. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధము లాడుట తమ నాలుకలకు అభ్యాసముచేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు.
6. నీ నివాసస్థలము కాపట్యము మధ్యనే యున్నది, వారు కపటులై నన్ను తెలిసికొననొల్లకున్నారు; ఇదే యెహోవా వాక్కు.
7. కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆలకింపుము, వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరగించుచున్నాను, నా జను లనుబట్టి నేను మరేమి చేయుదును?
8. వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది; ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని, నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును.
9. నేను ఈ సంగతులను తెలిసికొని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు.
10. పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును; అరణ్యములోని మేతస్థలములనుబట్టి విలా పము చేయుదును; అవి పాడాయెను. సంచారము చేయువాడెవడును లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశ పక్షులును జంతువులును పారిపోయి యున్నవి, అవి తొలగిపోయి యున్నవి.
11. యెరూషలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయు చున్నాను, యూదాపట్టణములను నివాసిలేని పాడు స్థలముగా చేయుచున్నాను.
12. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని యెవడు? దానిని వాడు తెలియజేయునట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను?ఎవడును సంచరింపకుండ ఆ దేశము ఎడారివలె ఏల కాలిపోయి పాడాయెను?
13. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడువారు నా మాట వినకయు దాని ననుసరింపకయు, నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి
14. తమ హృదయమూర్ఖతచొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలు దేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను.
15. సైన్యములకధి పతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును, విషజలము త్రాగింతును.
16. తామైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టు దును, వారిని నిర్మూలముచేయువరకు వారి వెంబడి ఖడ్గ మును పంపుదును.
17. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడుఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి.
18. మన కన్నులు కన్నీళ్లు విడుచునట్లుగాను మన కనురెప్పలనుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదనధ్వని చేయవలెను.
19. మనము వలసబోతిమే సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసివచ్చెనే అని సీయోనులో రోదనధ్వని వినబడు చున్నది.
20. స్త్రీలారా, యెహోవా మాట వినుడిమీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తె లకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.
21. వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజ మార్గములలో ¸°వనులు లేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది.
22. యెహోవా వాక్కు ఇదేనీవీమాట చెప్పుముచేలమీద పెంటపడునట్లు పంట కోయు వాని వెనుక పిడికిళ్లు పడునట్లు ఎవడును సమకూర్చ కుండ మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువా డెవడును లేకపోవును.
23. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుజ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు.
24. అతిశ యించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతి శయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
25. అన్యజనులందరును సున్నతిపొందనివారు గనుక, ఇశ్రాయేలీయులందరు హృదయ సంబంధమైన సున్నతినొందినవారుకారు గనుక, రాబోవుదినములలో సున్నతిపొందియు సున్నతిలేని వారి వలెనుండు
26. ఐగుప్తీయులను యూదావారిని ఎదోమీయు లను అమ్మోనీయులను మోయాబీయులను గడ్డపు ప్రక్క లను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరిని నేను శిక్షించెదను, ఇదే యెహోవా వాక్కు.
Chapter 10
1. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి.
2. యెహోవా సెలవిచ్చు చున్నదేమనగా అన్యజనముల ఆచారముల నభ్యసింప కుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి.
3. జన ముల ఆచారములు వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసినపని.
4. వెండి బంగారములచేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలక యుండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాని నిలుపుదురు.
5. అవి తాటిచెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు నడువనేరవు గనుక వాటిని మోయవలసివచ్చెను; వాటికి భయపడకుడి అవి హానిచేయ నేరవు మేలుచేయుట వాటివలనకాదు.
6. యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు, నీవు మహా త్మ్యము గలవాడవు, నీ శౌర్యమునుబట్టి నీ నామము ఘన మైనదాయెను.
7. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యము లన్నిటిలోను నీవంటివాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము.
8. జనులు కేవలము పశు ప్రాయులు, అవివేకులు; బొమ్మల పూజవలన వచ్చు జ్ఞానము వ్యర్థము.
9. తర్షీషునుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు ఉపాజునుండి బంగారమును తెత్తురు, అది పని వాని పనియేగదా; పోతపోయువాడు దాని చేసెను, నీల ధూమ్రవర్ణములుగల వస్త్రములు వాటికున్నవి, అవన్నియు నేర్పరులగు పనివారి పనియే.
10. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు.
11. మీరు వారితో ఈలాగు చెప్పవలెనుఆకాశమును భూమిని సృష్టింపని యీ దేవతలు భూమిమీద నుండ కుండను ఆకాశముక్రింద ఉండకుండను నశించును.
12. ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.
13. ఆయన ఆజ్ఞ నియ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును, భూమ్యంత భాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క జేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనా గారములలోనుండి గాలిని రావించును.
14. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందు చున్నాడు; అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియు లేదు.
15. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు, విమర్శకాలములో అవి నశించి పోవును,
16. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటి వాడు కాడు; ఆయన సమస్తమును నిర్మించువాడు, ఇశ్రా యేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము; సైన్య ములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు.
17. నివాసినీ, ముట్టడివేయబడుచున్న దేశము విడిచి వెళ్లు టకై నీ సామగ్రిని కూర్చుకొనుము.
18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడునేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసరివేయుచున్నాను, వారు పట్టబడవలెనని వారిని ముట్టడి వేయించుచున్నాను.
19. కటకటా, నేను గాయపడితిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది, అయితే ఈ దెబ్బ నాకు తగినదే యనుకొని నేను దాని సహించు దును.
20. నా గుడారము చినిగిపోయెను, నా త్రాళ్లన్నియు తెగిపోయెను, నా పిల్లలు నాయొద్దనుండి తొలగిపోయి యున్నారు, వారు లేకపోయిరి, ఇకమీదట నా గుడార మును వేయుటకైనను నా తెరల నెత్తుటకైనను ఎవడును లేడు.
21. కాపరులు పశుప్రాయులై యెహోవాయొద్ద విచారణచేయరు గనుక వారే వర్ధిల్లకయున్నారు, వారి మందలన్నియు చెదరిపోవుచున్నవి.
22. ఆలకించుడి, ధ్వని పుట్టుచున్నది, దాని రాక ధ్వని వినబడుచున్నది, యూదా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును, నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తరదేశమునుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది.
23. యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.
24. యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమునుబట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధిని బట్టి నన్ను శిక్షింపుము.
25. నిన్నెరుగని అన్యజనులమీదను నీ నామమునుబట్టి ప్రార్థిం పని వంశములమీదను నీ ఉగ్రతను కుమ్మరించుము; వారు యాకోబును మింగివేయుచున్నారు, నిర్మూలము చేయ వలెనని వారు అతని మింగివేయుచున్నారు, వాని నివాస మును పాడుచేయుచున్నారు.
Chapter 11

2. మీరు ఈ నిబంధనవాక్యములను వినుడి; యూదా మనుష్యులతోను యెరూషలేము నివాసులతోను నీవీలాగున మాటలాడి తెలియజేయవలెను
3. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగాఈ నిబంధన వాక్యములను విననొల్ల నివాడు శాపగ్రస్తుడగును.
4. ఐగుప్తుదేశములోనుండి, ఆ యినుప కొలిమిలోనుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తినినేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చెదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు, మీరు నా వాక్యము విని నేను మీ కాజ్ఞాపించు విధులన్నిటినిబట్టి యీ నిబంధన వాక్యముల ననుసరించినయెడల మీరు నాకు జనులైయుందురు నేను మీకు దేవుడనైయుందును.
5. అందుకుయెహోవా, ఆ ప్రకారము జరుగును గాకని నేనంటిని.
6. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగానీవు యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటిని ప్రకటింపుముమీరు ఈ నిబంధన వాక్యములను విని వాటి ననుసరించి నడుచుకొనుడి.
7. ఐగుప్తులోనుండి మీ పితరులను రప్పించిన దినము మొదలు కొని నేటివరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచు వచ్చితిని; నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచు వచ్చితిని
8. అయినను వారు తమ దుష్టహృదయములో పుట్టు మూర్ఖతచొప్పున నడుచుచు వినకపోయిరి; చెవి యొగ్గినవారు కాకపోయిరి, వారు అనుసరింపవలెనని నేను వారి కాజ్ఞాపించిన యీ నిబంధన మాటలన్నిటిననుస రించి నడువలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటి నన్నిటిని వారిమీదికి రప్పించుచున్నాను.
9. మరియు యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెనుయూదావారిలోను యెరూషలేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది.
10. ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయిన తమ పితరుల దోషచర్యలను జరుప తిరిగియున్నారు; మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు, వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులును యూదావంశస్థులును భంగము చేసియున్నారు.
11. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతాము తప్పించుకొనజాలని కీడు వారిమీదికి రప్పింపబోవు చున్నాను, వారు నాకు మొఱ్ఱపెట్టినను నేను వారి మొఱ్ఱను వినకుందును.
12. యూదాపట్టణస్థులును యెరూష లేము నివాసులును పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొఱ్ఱపెట్టెదరు గాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు.
13. యూదా, నీ పట్టణముల లెక్కచొప్పున నీకు దేవతలున్నవి గదా? యెరూషలేము నివాసులారా, బయలు దేవతకు ధూపము వేయవలెనని మీ వీధుల లెక్కచొప్పున లజ్జాకరమైన దానిపేరట బలిపీఠములను స్థాపించితిరి.
14. కావున నీవు ఈ ప్రజలనిమిత్తము ప్రార్థనచేయకుము; వారి నిమిత్తము మొఱ్ఱపెట్టకుము ప్రార్థనచేయకుము, వారు తమ కీడును బట్టి నాకు మొఱ్ఱపెట్టునప్పుడు నేను వినను.
15. దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మ్రొక్కుబళ్లచేతను ప్రతిష్ఠిత మాంసము తినుటచేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టు కొందువా? ఆలాగైతే నీవు ఉత్సహించుదువు.
16. అది చక్కని ఫలముగల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను; గొప్ప తుపాను ధ్వనితో దానిమీద మంటపెట్టగా దాని కొమ్మలు విరిగిపోవుచున్నవి.
17. ఇశ్రా యేలు వంశస్థులును యూదా వంశస్థులును బయలునకు ధూపార్పణముచేసి నాకు కోపము పుట్టించుటచేత తమంతట తామే చేసిన చెడుతనమునుబట్టి మిమ్మును నాటిన సైన్యములకధిపతియగు యెహోవా మీకు కీడుచేయ నిర్ణయించుకొని యున్నాడు.
18. దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని; ఆయన3 వారి క్రియలను నాకు కనుపర చెను.
19. అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొఱ్ఱపిల్లవలె ఉంటిని;మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి, వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రదుకువారిలో నుండకుండ వాని నిర్మూలము చేయుదము రండని వారు నామీద చేసిన దురాలోచనలను నేనెరుగకయుంటిని.
20. నీతినిబట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించు వాడు సైన్యములకధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యెభారమును నీమీదనే వేయుచున్నాను; వారికి నీవు చేయు ప్రతి దండనను నన్ను చూడనిమ్ము.
21. కావున నీవు మాచేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారినిగూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు
22. సైన్యముల కధిపతియగు యెహోవా వారినిగూర్చి సెలవిచ్చునదే మనగానేను వారిని శిక్షింపబోవుచున్నాను, వారి ¸°వనులు ఖడ్గముచేత చంపబడెదరు, వారి కుమారులును కూమార్తెలును క్షామమువలన చచ్చెదరు;
23. వారికి శేష మేమియు లేకపోవును, నేను వారిని దర్శించు సంవత్సర మున అనాతోతు కీడును వారిమీదికి రప్పింతును.
Chapter 12
1. యెహోవా, నేను నీతో వాదించునప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు; అయినను న్యాయము విధించుటనుగూర్చి నేను నీతో మాటలాడుదును; దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేల? మహా విశ్వాసఘాతకులు సుఖింపనేల?
2. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలముల నిచ్చు చున్నారు; వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు.
3. యెహోవా, నీవు నన్నెరిగియున్నావు; నన్ను చూచు చున్నావు; నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు; వధకు ఏర్పడిన గొఱ్ఱలనువలె వారిని హతముచేయుము, వధదినమునకు వారిని ప్రతిష్ఠించుము.
4. భూమి యెన్నాళ్లు దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవలెను? అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించువారి చెడుతనమువలన జంతువులును పక్షులును సమసిపోవు చున్నవి.
5. నీవు పాదచారులతో పరుగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా? నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు? నెమ్మదిగల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావుగదా? యొర్దాను ప్రవాహముగా వచ్చునప్పుడు నీవేమి చేయుదువు?
6. నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయు చున్నారు; నీ వెంబడి గేలిచేయుదురు, వారు నీతో దయగా మాటలాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు.
7. నా మందిరమును నేను విడిచియున్నాను, నా స్వాస్థ్య మును విసర్జించియున్నాను; నా ప్రాణప్రియురాలిని ఆమె శత్రువులచేతికి అప్పగించియున్నాను.
8. నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహమువంటిదాయెను; ఆమె నామీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధినైతిని.
9. నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూరపక్షి ఆయెనా? క్రూరపక్షులు దానిచుట్టు కూడు చున్నవా? రండి అడవిజంతువులన్నిటిని పోగు చేయుడి; మింగివేయుటకై అవి రావలెను.
10. కాపరులనేకులు నా ద్రాక్షతోటలను చెరిపివేసియున్నారు, నా సొత్తును త్రొక్కివేసియున్నారు; నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసియున్నారు.
11. వారు దాని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది; దానిగూర్చి చింతించువాడొకడును లేడు గనుక దేశమంతయు పాడాయెను.
12. పాడుచేయువారు అరణ్య మందలి చెట్లులేని మెట్టలన్నిటిమీదికి వచ్చుచున్నారు; దేశముయొక్క యీ కొననుండి ఆ కొనవరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది; శరీరులకు క్షేమ మేమియు లేదు.
13. జనులు గోధుమలు చల్లి ముండ్లపంట కోయుదురు; వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయెను; యెహోవా కోపాగ్నివలన కోతకు పంటలేక మీరు సిగ్గుపడుదురు.
14. నేను నాజనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరచిన స్వాస్థ్యము నాక్రమించుకొను దుష్టులగు నా పొరుగు వారినిగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునేను వారి దేశములోనుండి వారిని పెల్లగింతును; మరియు వారి మధ్యనుండి యూదావారిని పెల్లగింతును.
15. వారిని పెల్లగించిన తరువాత నేను మరల వారియెడల జాలిపడు దును; ఒక్కొకని తన స్వాస్థ్యమునకును ఒక్కొకని తన దేశమునకును వారిని రప్పింతును.
16. బయలుతోడని ప్రమా ణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవము తోడని నా నామమునుబట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజలమార్గములను జాగ్రత్తగా నేర్చుకొనిన యెడల వారు నా ప్రజలమధ్య వర్ధిల్లుదురు.
17. అయితే వారు నా మాట విననొల్లని యెడల నేను ఆ జనమును వేరుతో పెల్లగించి బొత్తిగా నాశనము చేతును; ఇదే యెహోవా వాక్కు.
Chapter 13
1. యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెనునీవు వెళ్లి అవిసెనార నడికట్టు కొని నీ నడుమున దానిని కట్టు కొనుము, నీళ్లలో దాని వేయకుము.
2. కావున యెహోవా మాటచొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని.
3. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై
4. నీవు కొని నడుమున కట్టుకొనిన నడి కట్టును తీసికొని, లేచి యూఫ్రటీసునొద్దకు పోయి అక్కడ నున్న బండబీటలో దానిని దాచిపెట్టుమనగా
5. యెహోవా నాకాజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసునొద్ద దాని దాచిపెట్టితిని.
6. అనేక దినములైన తరువాత యెహోవానీవు లేచి యూఫ్రటీసునొద్దకు పోయి, నేను అక్కడ దాచి పెట్టుమని నీకాజ్ఞాపించిన నడికట్టును అక్కడనుండి తీసి కొనుమని నాతో చెప్పగా
7. నేను యూఫ్రటీసునొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచి పెట్టినచోటనుండి దాని తీసి కొంటిని; నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి యుండెను; అది దేనికిని పనికిరానిదాయెను.
8. కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెల విచ్చెను
9. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూష లేము నివాసుల మహా గర్వమును నేను భంగపరచుదును.
10. అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిననుసరించుచు, నా మాటలు విన నొల్లక తమ హృదయకాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికిని పనికిరాని యీ నడికట్టువలె అగు దురు.
11. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థుల నందరిని యూదా వంశస్థులనందరిని, నడికట్టు నరుని నడుముకు అంటియున్నరీతిగా నన్ను అంటియుండజేసితిని గాని వారు నా మాటలు వినకపోయి యున్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
12. కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుప్రతి సిద్దెయు ద్రాక్షారసముతో నింపబడునుప్రతి సిద్దెయు ద్రాక్షా రసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనిన యెడల
13. నీవు వారితో ఈ మాట చెప్పుము యెహోవా సెలవిచ్చునదేమనగాఈ దేశనివాసుల నందరిని, దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజుల నేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివా సులనందరిని నేను మత్తులుగా చేయబోవుచున్నాను.
14. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరిని ఏక ముగా ఒకనిమీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు; వారిని కరుణింపను శిక్షింపక పోను; వారియెడల జాలిపడక నేను వారిని నశింప జేసెదను.
15. చెవి యొగ్గి వినుడి; యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి.
16. ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకము నుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీ దేవు డైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి.
17. అయినను మీరు ఆ మాట విననొల్లని యెడల మీ గర్వమునుబట్టి నేను చాటున ఏడ్చుదును; యెహోవామంద చెరపట్టబడి నందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచు నుండును.
18. రాజును తల్లియైన రాణిని చూచి ఇట్లనుముమీ శిరోభూషణములును తలమీదనున్న మీ సుందరకిరీటమును పడిపోయెను; క్రుంగి కూర్చుండుడి.
19. దక్షిణదేశ పట్టణములు మూయబడియున్నవి; వాటిని తెరువగలవాడెవడును లేడు; యూదావారందరు చెరపట్ట బడిరి; ఏమియు లేకుండ సమస్తము కొనిపోబడెను.
20. కన్నులెత్తి ఉత్తరమునుండి వచ్చుచున్నవారిని చూడుడి; నీకియ్యబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడ నున్నది?
21. నీవు నీకు స్నేహితులుగా చేసికొనినవారిని ఆయన నీమీద అధిపతులుగా నియ మించునప్పుడు నీవేమి చెప్పెదవు? ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నిన్ను పట్టును గదా?
22. నీవుఇవి నా కేల సంభవించెనని నీ మన స్సులో అనుకొనినయెడల నీవు చేసిన విస్తారమైన దోష ములనుబట్టి నీ బట్టచెంగులు తొలగిపోయెను, నీ మడిమెలు సిగ్గు నొందెను.
23. కూషుదేశస్ధుడు తన చర్మమును మార్చు కొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినయెడల కీడుచేయుటకు అలవాటుపడిన మీరును మేలుచేయ వల్లపడును.
24. కాబట్టి అడవిగాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను.
25. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నాచేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
26. కాబట్టి నీ అవమానము కనబడు నట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖముమీదికి ఎత్తు చున్నాను.
27. నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కామాతురతను నేనెరుగుదును; పొలములలో నున్న మెట్టలమీద నీ హేయ క్రియలు నాకు కనబడు చున్నవి; యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్ర పరచు కొననొల్లవు; ఇక నెంత కాలము ఈలాగు జరుగును?
Chapter 14
1. కరవుకాలమున జరిగినదానిగూర్చి యిర్మీయాకు ప్రత్యక్ష మైన యెహోవా వాక్కు.
2. యూదా దుఃఖించు చున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి, జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు, యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది.
3. వారిలో ప్రధానులు బీద వారిని నీళ్లకు పంపుచున్నారు, వారు చెరువులయొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు, వట్టి కుండలు తీసికొని వారు మరల వచ్చుచున్నారు, సిగ్గును అవమానము నొందినవారై తమ తలలు కప్పుకొనుచున్నారు.
4. దేశములో వర్షము కురువక పోయినందున నేల చీలియున్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు.
5. లేళ్లు పొలములో ఈని గడ్డిలేనందున పిల్లలను విడిచిపెట్టు చున్నవి.
6. అడవి గాడిదలును చెట్లులేని మెట్టలమీద నిలువబడి నక్కలవలె గాలి పీల్చుచున్నవి, మేత ఏమియు లేనందున వాటి కన్నులు క్షీణించు చున్నవి.
7. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపముచేసితివిు; మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి; నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము.
8. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీ వేల పరదేశివలెనున్నావు? ఏల రాత్రివేళను బసచేయుటకు గుడారమువేయు ప్రయాణస్థునివలె ఉన్నావు;
9. భ్రమసియున్నవానివలెను రక్షింపలేని శూరుని వలెను నీవేల ఉన్నావు? యెహోవా, నీవు మామధ్య నున్నావే; మేము నీ పేరుపెట్టబడినవారము; మమ్మును చెయ్యి విడువకుము.
10. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చు చున్నాడుఈ జనులు తమ కాళ్లకు అడ్డములేకుండ తిరుగులాడుటకు ఇచ్ఛగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు; ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాప కము చేసికొనును; వారి పాపములనుబట్టి వారిని శిక్షించును.
11. మరియు యెహోవా నాతో ఇట్లనెనువారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము.
12. వారు ఉపవాస మున్నప్పుడు నేను వారి మొఱ్ఱను వినను; వారు దహనబలియైనను నైవేద్యమైనను అర్పించు నప్పుడు నేను వాటిని అంగీకరింపను; ఖడ్గమువలనను క్షామమువలనను తెగులువలనను వారిని నాశము చేసెదను
13. అందుకు నేను అయ్యో, ప్రభువైన యెహోవామీరు ఖడ్గము చూడరు మీకు క్షామము కలుగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకిచ్చెదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారవి నేననగా
14. యెహోవా నాతో ఇట్లనెనుప్రవక్తలు నా నామమునుబట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు; నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయ మునపుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు.
15. కావున నేను వారిని పంపకపోయినను, నా నామమునుబట్టి ఖడ్గ మై నను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆ ప్రవక్తలు ఖడ్గమువలనను క్షామమువలనను లయమగుదురు.
16. వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయ బడెదరు; నేను వారి చెడుతనమును వారిమీదికి రప్పించె దను. వారినైనను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలనైనను పాతిపెట్టువాడెవడును లేక పోవును.
17. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగానా జనుల కన్యక గొప్ప ఉపద్రవమువలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొందియున్నది; దివారాత్రము మానక నా కన్నులనుండి కన్నీరు కారుచున్నది.
18. పొలము లోనికి నేను పోగా ఖడ్గముచేత హతులైనవారు కనబడు దురు, పట్టణములో ప్రవేశింపగా క్షామపీడితులు అచ్చట నుందురు; ప్రవక్తలేమి యాజకులేమి తామెరుగని దేశము నకు పోవలెనని ప్రయాణమైయున్నారు.
19. నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సీయోను నీకు అసహ్యమాయెనా? మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేల మమ్మును కొట్టితివి? మేము సమాధానముకొరకు కని పెట్టుచున్నాము గాని మేలేదియు కనబడుటలేదు; చికిత్స కలుగు కాలముకొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలియున్నది.
20. యెహోవా, మా దుర్మార్గతను మా పిత రుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము; నీకు విరో ధముగా పాపము చేసియున్నాము.
21. నీ నామమునుబట్టి మమ్మును త్రోసివేయకుము, ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము, మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనుము, దాని భ్రష్ఠపరచకుమీ.
22. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననియ్యగలదా? మా దేవుడవైన యెహోవా, నీవే గదా దాని చేయుచున్నావు? నీవే యీ క్రియలన్నియు చేయు చున్నావు; నీకొరకే మేము కనిపెట్టుచున్నాము.
Chapter 15
1. అప్పుడు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను మోషేయు సమూయేలును నాయెదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నాసన్నిధి నుండకుండ వారిని వెళ్లగొట్టుము.
2. మే మెక్కడికి పోదుమని వారు నిన్నడిగినయెడల నీవు వారితో నిట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుచావునకు నియమింపబడినవారు చావునకును, ఖడ్గమునకు నియమింప బడినవారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడినవారు చెర కును పోవలెను.
3. యెహోవా వాక్కు ఇదేచంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశపక్షులు భూమృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించియున్నాను.
4. యూదారాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలనుబట్టి భూమిమీదనున్న సకల రాజ్యములలోనికి యిటు అటు చెదరగొట్టబడునట్లు వారిని అప్పగించుచున్నాను.
5. యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీయందు జాలిపడువాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవవిడిచి నీయొద్దకు వచ్చును?
6. యెహోవా వాక్కు ఇదేనీవు నన్ను విసర్జించి యున్నావు వెనుకతీసియున్నావు గనుక నిన్ను నశింప జేయునట్లు నేను నీ మీదికి నాచేతిని చాచియున్నాను; సంతాపపడి పడి నేను విసికియున్నాను.
7. దేశద్వారములో నేను వారిని చేటతో తూర్పారపట్టుచున్నాను, నా జనులు తమ మార్గములను విడిచి నాయొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయు చున్నాను.
8. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుకకంటె విస్తారముగా ఉందురు; మధ్యాహ్నకాలమున ¸°వనుల తల్లిమీదికి దోచుకొనువారిని నేను రప్పింతును; పరితాప మును భయములను ఆకస్మాత్తుగా వారిమీదికి రాజేతును.
9. ఏడుగురిని కనిన స్త్రీ క్షీణించుచున్నది; ఆమె ప్రాణము విడిచియున్నది; పగటివేళనే ఆమెకు ప్రొద్దు గ్రుంకి యున్నది. ఆమె సిగ్గుపడి అవమానము నొందియున్నది; వారిలో శేషించిన వారిని తమ శత్రువులయెదుట కత్తి పాలు చేసెదను; ఇదే యెహోవా వాక్కు.
10. అయ్యో నాకు శ్రమ; నా తల్లీ, జగడమాడువాని గాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేల నన్ను కంటివి? వడ్డికి నేను బదులియ్యలేదు, వారు నాకు బదు లిచ్చినవారు కారు అయినను వారందరు నన్ను శపించు చున్నారు.
11. అందుకు యెహోవానిశ్చయముగా నీకు మేలుచేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చెను.
12. ఇనుమునైనను ఉత్తరమునుండి వచ్చు యినుము నైనను కంచునైనను ఎవడైన విరువగలడా?
13. నా జనులారా మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయములేకుండ నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను.
14. నీవెరుగని దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును, నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహించును.
15. యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది; నన్ను జ్ఞాపకము చేసికొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించువారికి నాకొరకై ప్రతిదండన చేయుము, నీవు దీర్ఘశాంతి కలిగినవాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలిసి కొనుము.
16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యముల కధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయము నకు ఆనందమును కలుగజేయుచున్నవి.
17. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు నేను ఉల్ల సింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి యున్నావు గనుక, నీ హస్తమునుబట్టి నేను ఏకాకినై కూర్చుంటిని.
18. నా బాధ యేల యెడతెగనిదాయెను? నా గాయము ఏల ఘోరమైనదాయెను? అది స్వస్థత నొందకపోనేల? నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వవుదువా? నిలువని జలములవవుదువా?
19. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెనునీవు నాతట్టు తిరిగినయెడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో యేవి ఘనములో నీవు గురుతుపట్టినయెడల నీవు నా నోటివలె ఉందువు; వారు నీతట్టునకు తిరుగవలెను గాని నీవు వారి తట్టునకు తిరుగకూడదు
20. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని యిత్తడి ప్రాకారముగా నేను నియమించె దను; నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీమీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
21. దుష్టుల చేతిలోనుండి నిన్ను విడి పించెదను, బలాత్కారుల చేతిలోనుండి నిన్ను విమో చించెదను.
Chapter 16
1. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
2. ఈస్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసికొన కూడదు.
3. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు, కుమార్తెలనుగూర్చియు, వారిని కనిన తల్లులనుగూర్చియు, ఈ దేశములో వారిని కనిన తండ్రులను గూర్చియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
4. వారు ఘోరమైన మరణము నొందెదరు; వారినిగూర్చి రోదనము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమిమీద పెంట వలె పడియుండెదరు, వారు ఖడ్గముచేతను క్షామముచేతను నశించెదరు; వారి శవములు ఆకాశపక్షులకును భూజంతు వులకును ఆహారముగా ఉండును.
5. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనియ్యకయు వారియెడల నా కృపావాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనముచేయు ఇంటిలోనికి నీవు పోకుము, వారినిగూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరినిని ఓదార్చుటకు వెళ్లకుము; ఇదే యెహోవా వాక్కు
6. ఘనులేమి అల్పులేమి యీ దేశమందున్నవారు చనిపోయి పాతిపెట్టబడరు, వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందురు, ఎవరును తమ్మును తాము కోసికొన కుందురు, వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడి చేసికొనకుందురు.
7. చచ్చినవారినిగూర్చి జనులను ఓదార్చు టకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు; ఒకని తండ్రి యైనను తల్లియైనను చనిపోయెనని యెవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనియ్యకుందురు.
8. వారియొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందు శాలలో ప్రవేశింపకూడదు.
9. సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడుమీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని ఆనందధ్వనిని పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండ మాన్పిం చెదను.
10. నీవు ఈ మాటలన్నియు ఈ ప్రజలకు తెలియ జెప్పిన తరువాత వారుదేనిబట్టి యెహోవా మాకు ఈ ఘోరబాధ అంతయు నియమించెను? మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి? మాపాప మేమి? అని నిన్నడుగగా
11. నీవు వారితో ఇట్లనుముయెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుమీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటను బట్టియే గదా వారు నా ధర్మ శాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి.
12. ఆలకించుడి; మీరందరు నా మాట వినకుండ కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు; మీరు మీ పితరులకంటె విస్తారముగా చెడుతనము చేసి యున్నారు.
13. కాబట్టి నేను మీయందు ఏమాత్రమును దయయుంచక, యీ దేశమునుండి మీరైనను మీ పితరు లైనను ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్లగొట్టుచున్నాను; అక్కడ మీరు దివారాత్రము అన్యదేవతలను కొలుచుదురు.
14. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగానేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించెదను గనుక రాబోవు దినములలోఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని ఇకమీదట
15. అనకఉత్తరదేశములో నుండియు ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండియు ఇశ్రాయేలీ యులను రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుదురు.
16. ఇదే యెహోవా వాక్కు వారిని పట్టుకొనుటకు నేను చాల మంది జాలరులను పిలి పించెదను. తరువాత ప్రతి పర్వతముమీదనుండియు ప్రతి కొండమీద నుండియు మెట్టల సందులలోనుండియు వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను.
17. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి యుంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగైయుండదు.
18. వారు తమ హేయదేవతల కళేబరములచేత నా దేశమును అపవిత్ర పరచియున్నారు, తమ హేయక్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు గనుక నేను మొదట వారి దోషమును బట్టియు వారి పాపమును బట్టియు రెండంత లుగా వారికి ప్రతికారము చేసెదను.
19. యెహోవా, నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతములనుండి జనములు నీ యొద్దకు వచ్చిమా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్‌ప్రయో జనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పు దురు.
20. నరులు తమకు దేవతలను కల్పించుకొందురా? అయినను అవి దైవములు కావు.
21. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలిసికొనునట్లు నేను ఈ సారి వారికి అనుభవము కలుగజేతును, నా బలమును నా శౌర్య మును ఎంతటివో వారికి తెలియజేతును.
Chapter 17
1. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి... పచ్చని చెట్టుక్రిందనున్న దేవతాస్థంభములను జ్ఞాపకము చేసికొనుచుండగా
2. యూదా పాపము ఇనుపగంట ముతో వ్రాయబడియున్నది; అది వజ్రపు మొనతో లిఖింపబడియున్నది; అది వారి హృదయ ములనెడి పలకల మీదను చెక్కబడియున్నది. మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడియున్నది.
3. పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాప మునుబట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటిని నీ బలిపీఠములను దోపుడుసొమ్ముగా నేనప్పగించుచున్నాను.
4. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక, నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీవెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడ వగుదువు.
5. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు.
6. వాడు ఎడారిలోని అరుహావృక్షము వలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును.
7. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.
8. వాడు జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు.
9. హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?
10. ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయ మును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీ క్షించువాడను.
11. న్యాయవిరోధముగా ఆస్తి సంపాదించు కొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట్టవలె నున్నాడు; సగము ప్రాయములో వాడు దానిని విడువ వలసి వచ్చును; అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును.
12. ఉన్నతస్థలముననుండు మహిమగల సింహాసనము మొదటినుండి మా పరిశుద్ధాలయ స్థానము.
13. ఇశ్రాయేలు నకు ఆశ్రయమా, యెహోవా, నిన్ను విసర్జించి వారందరు సిగ్గునొందుదురు. నాయెడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించియున్నారు గనుక వారు ఇసుకమీద పేరు వ్రాయబడినవారుగా ఉందురు.
14. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతనొందుదును, నన్ను రక్షించుము నేను రక్షింపబడు దును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతు డవు.
15. వారుయెహోవా వాక్కు ఎక్కడనున్నది? దాని రానిమ్మని యనుచున్నారు.
16. నేను నిన్ను అనుసరించు కాపరినైయుండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలెనని నేను కోరలేదు, నీకే తెలిసియున్నది. నా నోటనుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది.
17. ఆప త్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకుము.
18. నన్ను సిగ్గుపడనియ్యక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము నన్ను దిగులుపడనియ్యక వారిని దిగులు పడనిమ్ము, వారిమీదికి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయుము.
19. యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడునీవు వెళ్లి యూదారాజులు వచ్చుచు పోవుచునుండు జనుల గుమ్మము నను యెరూషలేము గుమ్మములన్నిటను నిలిచి జనులలో దీని ప్రకటన చేయుము
20. యూదా రాజులారా, యూదావారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి.
21. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ విషయములో జాగ్రత్త పడుడి, విశ్రాంతిదినమున ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మములలో గుండ ఏ బరువును తీసికొని రాకుడి.
22. విశ్రాంతిదినమున మీ యిండ్లలోనుండి యే బరువును మోసికొని పోకుడి, యే పనియు చేయకుడి, నేను మీ పితరుల కాజ్ఞాపించి నట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠితదినముగా ఎంచుకొనుడి.
23. అయితే వారు వినకపోయిరి, చెవినిబెట్టక పోయిరి, విన కుండను బోధనొందకుండను మొండికి తిరిగిరి.
24. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెనుమీరు నామాట జాగ్రత్తగా విని, విశ్రాంతిదినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నెంచి, విశ్రాంతిదినమున ఈ పట్టణపు గుమ్మములలోగుండ ఏ బరువును తీసికొని పోకుం డిన యెడల
25. దావీదు సింహాసనమందు ఆసీనులై, రథముల మీదను గుఱ్ఱములమీదను ఎక్కి తిరుగుచుండు రాజులును అధిపతులును ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులును యూదావారును యెరూష లేము నివాసులును ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశిం తురు; మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును.
26. మరియు జనులు దహనబలులను బలులను నైవేద్యములను ధూపద్రవ్య ములను తీసికొని యూదా పట్టణములలోనుండియు, యెరూషలేము ప్రాంతములలోనుండియు, బెన్యామీను దేశములో నుండియు, మైదానపు దేశములోనుండియు, మన్యములోనుండియు, దక్షిణదేశములోనుండియు వచ్చెదరు; యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసికొని వచ్చెదరు.
27. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠితదినముగా నెంచి, ఆ దినమున బరువులు మోసి కొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు విననియెడల నేను దాని గుమ్మ ములలో అగ్ని రగులబెట్టెదను, అది యెరూషలేము నగరు లను కాల్చివేయును, దానిని ఆర్పుటకు ఎవరికిని సాధ్యము కాకపోవును.
Chapter 18

2. నీవు లేచి కుమ్మరి యింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును.
3. నేను కుమ్మరి యింటికి వెళ్లగా వాడు తన సారెమీద పని చేయుచుండెను.
4. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరల తీసికొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొక కుండ చేసెను.
5. అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
6. ఇశ్రాయేలువారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? యిదే యెహోవా వాక్కుజిగటమన్ను కుమ్మరిచేతిలొ ఉన్నట్టుగా ఇశ్రాయేలువారలారా, మీరు నా చేతిలో ఉన్నారు.
7. దాని పెల్లగింతుననియు, విరుగగొట్టుదు ననియు, నశింపజేయుదుననియు ఏదోయొక జనమును గూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా
8. ఏ జనమునుగూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనముచేయుట మానినయెడల నేను వారికి చేయ నుద్దేశించిన కీడునుగూర్చి సంతాపపడుదును.
9. మరియు కట్టెదననియు, నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా
10. ఆ జనము నా మాట వినకుండ నా దృష్టికి కీడుచేసినయెడల దానికి చేయదలచిన మేలునుగూర్చి నేను సంతాపపడుదును.
11. కాబట్టి నీవు వెళ్లి యూదావారితోను యెరూషలేము నివాసులతోను ఇట్లనుముయెహోవా సెలవిచ్చినమాట ఏదనగామీమీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచనచేయుచున్నాను, మీరందరు మీ మీ దుష్టమార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొనుడి.
12. అందుకు వారునీ మాట నిష్ ప్రయోజనము; మేము మా ఆలోచనల చొప్పున నడుచు కొందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని యందురు.
13. కావున యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అన్యజనులను అడిగి తెలిసికొనుడి; ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైన వినెనా? ఇశ్రాయేలు కన్యక బహు ఘోరమైన కార్యము చేసియున్నది.
14. లెబానోను పొలము లోని బండమీద హిమముండుట మానునా? దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారకమానునా?
15. అయితే నా ప్రజలు నన్ను మరిచియున్నారు, మాయకు ధూపము వేయుచున్నారు, మెరకచేయబడని దారిలో తాము నడువవలెనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్రిల్ల చేసికొనుచున్నారు.
16. వారు ఎల్లప్పుడును అపహాస్యాస్పదముగానుండుటకై తమ దేశమును పాడుగా చేసికొనియున్నారు, దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును.
17. తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువులయెదుట నిలువ కుండ వారిని నేను చెదరగొట్టెదను; వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును.
18. అప్పుడు జనులుయిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రము విని పించక మానడు, జ్ఞాని యోచనలేకుండ నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటలలో దేనిని విన కుండ మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పు కొనుచుండిరి.
19. యెహోవా, నా మొఱ్ఱ నాలకించుము, నాతో వాదించువారి మాటను వినుము.
20. వారు నా ప్రాణము తీయవలెనని గుంట త్రవ్వియున్నారు; చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? వారికి మేలు కలుగవలెనని వారిమీదనుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారిపక్షముగా మాటలాడిన సంగతి జ్ఞాపకము చేసికొనుము.
21. వారి కుమారులను క్షామమునకు అప్ప గింపుము, ఖడ్గబలమునకు వారిని అప్పగింపుము, వారి భార్యలు పిల్లలు లేనివారై విధవ రాండ్రగుదురు గాక, వారి పురుషులు మరణహతులగుదురు గాక, వారి ¸°వ నులు యుద్ధములో ఖడ్గముచేత హతులగుదురు గాక.
22. నన్ను పట్టుకొనుటకు వారు గొయ్యి త్రవ్విరి, నా కాళ్లకు ఉరులనొగ్గిరి; వారిమీదికి నీవు ఆకస్మికముగా దండును రప్పించుటవలన వారి యిండ్లలోనుండి కేకలు వినబడును గాక.
23. యెహోవా, నాకు మరణము రావలెనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసేయున్నది, వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగనియ్యకుము, నీ సన్నిధినుండి వారి పాపమును తుడిచివేయకుము; వారు నీ సన్నిధిని తొట్రిల్లుదురు గాక, నీకు కోపము పుట్టు కాలమున వారికి తగినపని చేయుము.
Chapter 19
1. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
2. నీవు వెళ్లి కుమ్మరి చేయు మంటి కూజాను కొని, జనుల పెద్ద లలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచు కొనిపోయి, హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగా నున్న బెన్‌హిన్నోము లోయలోనికిపోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము.
3. నీ విట్లనుముయూదారాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి; సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడుఆలకించుడి, దాని సమాచారము వినువా రందరికి చెవులు గింగురుమనునంత కీడును నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవుచున్నాను.
4. ఏలయనగా వారు నన్ను విసర్జించి యీ స్థలములో అపచారము చేసి యున్నారు, వారైనను వారి తండ్రులైనను యూదా రాజు లైనను ఎరుగని అన్యదేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తముచేత ఈ స్థలమును నింపిరి
5. నేను విధింపనిదియు సెలవియ్యనిదియు నా మనస్సునకు తోచ నిదియునైన ఆచారము నాచరించిరి; తమ కుమారులను దహనబలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి.
6. ఇందునుబట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగారాబోవు దినములలో ఈ స్థలము హత్య లోయ అనబడును గాని తోఫెతు అనియైనను బెన్ హిన్నోము లోయ అనియైనను పేరు వాడబడదు.
7. తమ శత్రువుల యెదుట ఖడ్గముచేతను, తమ ప్రాణము లనుతీయ వెదకువారిచేతను వారిని కూలజేసి, ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కళే బరములను ఇచ్చి, ఈ స్థలములోనే యూదావారి ఆలోచనను యెరూషలేమువారి ఆలోచనను నేను వ్యర్థము చేసెదను.
8. ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్య పడి దానికి కలిగిన యిడుమలన్నిటిని చూచి అపహాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడు గాను అపహాస్యాస్పదముగాను నేను చేసెదను.
9. వారు తమ కూమారుల మాంసమును తమ కుమార్తెల మాంస మును తినునట్లు చేసెదను; తమ ప్రాణము తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బందికలిగించుటకై వేయు ముట్టడిని బట్టియు దానివలన కలిగిన యిబ్బందినిబట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును.
10. ఈ మాటలు చెప్పినతరువాత నీతోకూడ వచ్చిన మనుష్యులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగులగొట్టి వారితో ఈలాగనవలెను
11. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమరల బాగుచేయ నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగులగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగులగొట్ట బోవుచున్నాను; తోఫెతులో పాతిపెట్టుటకు స్థలములేక పోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు.
12. యెహోవా వాక్కు ఇదేఈ పట్టణమును తోఫెతువంటి స్థలముగా నేను చేయుదును, ఈ స్థలమునకును దాని నివాసులకును నేనాలాగున చేయుదును.
13. యెరూషలేము ఇండ్లును యూదారాజుల నగరులును ఆ తోఫెతు స్థలమువలెనే అపవిత్రములగును; ఏ యిండ్లమీద జనులు ఆకాశ సమూహమను దేవతలకు ధూపము వేయుదురో, లేక అన్యదేవతలకు పానార్పణములనర్పించుదురో ఆ యిండ్లన్నిటికి ఆలాగే జరుగును.
14. ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫెతులోనుండి యిర్మీయా వచ్చి యెహోవా మందిరపు ఆవరణములో నిలిచి జనులందరితో ఈలాగు చెప్పెను.
15. సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుఈ జనులు నా మాటలు వినకుండ మొండికి తిరిగియున్నారు గనుక ఈ పట్టణమునుగూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదికిని దానితో సంబంధించిన పట్టణములన్నిటిమీదికిని రప్పించుచున్నాను.
Chapter 20
1. యిర్మీయా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని
2. ప్రవక్తయైన యిర్మీయాను కొట్టి, యెహోవా మందిరమందున్న బెన్యామీనుమీది గుమ్మమునొద్దనుండు బొండలో అతనిని వేయించెను.
3. మరునాడు పషూరు యిర్మీయాను బొండలోనుండి విడి పింపగా యిర్మీయా అతనితో ఇట్లనెనుయెహోవా నీకు పషూరను పేరు పెట్టడు గాని మాగోర్మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టును.
4. యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడునీకును నీ స్నేహితులకందరికిని నీవే భయ కారణముగా నుండునట్లు చేయుచున్నాను; నీవు చూచు చుండగా వారు తమ శత్రువుల ఖడ్గముచేత కూలెదరు, మరియు యూదావారినందరిని బబులోను రాజుచేతికి అప్పగింతును, అతడు వారిని చెరపట్టి బబులోనునకు తీసి కొనిపోవును, ఖడ్గముచేత వారిని హతముచేయును.
5. ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభ మంతయు దాని అమూల్యవస్తువులన్నియు యూదా రాజుల నిధులన్నియు నేనప్పగింతును, వారి శత్రువుల చేతికే వాటి నప్పగింతును, శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసికొనిపోవుదురు.
6. పషూరూ, నీవును నీ యింట నివసించువారందరును చెరలోనికి పోవు దురు, నీవును నీవు ప్రవచనములచేత మోసపుచ్చిన నీ స్నేహితులందరును బబులోనునకు వచ్చెదరు, అక్కడనే చనిపోయెదరు అక్కడనే పాతిపెట్టబడెదరు.
7. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరే పణకు లోబడితిని; నీవు బలవంతముచేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్ల నవ్వులపాలైతిని, అందరు నన్ను ఎగతాళి చేయుదురు.
8. ఏలయనగా నేను పలుకునప్పుడెల్ల బలా త్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని యెలుగెత్తి చాటింపవలసి వచ్చెను; దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతు వాయెను.
9. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను, అని నేనను కొంటినా? అది నా హృద యములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు.
10. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారుదుర్మార్గు డని మీరు చాటించినయెడల మేమును చాటింతుమందురు; అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతనిమీద పగతీర్చుకొందమని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరు నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టు కొనియున్నారు.
11. అయితే పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడైయున్నాడు; నన్ను హింసించు వారు నన్ను గెలువక తొట్రిల్లుదురు; వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్న డును మరువబడని నిత్యావమానము పొందుదురు.
12. సైన్యములకధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశో ధించువాడవు నీవే; అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే; నా వ్యాజ్యెమును నీకే అప్పగించు చున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతును గాక
13. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలోనుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు.
14. నేను పుట్టినదినము శపింపబడును గాక; నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక;
15. నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తు డగును గాక;
16. నా తల్లి నాకు సమాధిగానుండి ఆమె ఎల్లప్పుడు గర్భవతిగానుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక
17. యెహోవా యేమాత్రమును సంతాపములేక నశింపజేసిన పట్టణములవలె ఆ మనుష్యుడు ఉండును గాక; ఉదయమున ఆర్త ధ్వనిని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినును గాక
18. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేల గర్భములోనుండి వెడలితిని?
Chapter 21
1. రాజైన సిద్కియా మల్కీయా కుమారుడైన పషూ రును యాజకుడగు మయశేయా కుమారుడైన జెఫన్యాను పిలిపించి
2. బబులోనురాజైన నెబుకద్రెజరు మనమీద యుద్ధముచేయుచున్నాడు; అతడు మనయొద్దనుండి వెళ్లి పోవునట్లు యెహోవా తన అద్భుతకార్యములన్నిటిని చూపి మనకు తోడైయుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు యిర్మీయాయొద్దకు వారిని పంపగా యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.
3. యిర్మీయా వారితో ఇట్లనెనుమీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి
4. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుబబులోను రాజుమీదను, మిమ్మును ముట్టడివేయు కల్దీయులమీదను, మీరుపయో గించుచున్న యుద్దాయుధములను ప్రాకారముల బయట నుండి తీసికొని యీ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదను.
5. కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగినవాడనై, బాహుబలముతోను, చాచిన చేతితోను నేనే మీతో యుద్ధము చేసెదను.
6. మనుష్యులనేమి పశువులనేమి యీ పట్టణపు నివాసులనందరిని హతము చేసెదను; గొప్ప తెగులుచేత వారు చచ్చెదరు.
7. అటు తరువాత నేను యూదాదేశపు రాజైన సిద్కియాను, అతని ఉద్యోగస్థులను, తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను, బబులోనురాజైన నెబుకద్రెజరుచేతికి, వారి ప్రాణములను తీయజూచువారి శత్రువులచేతికి అప్పగించెదను. అతడు వారియందు అనుగ్రహముంచకయు, వారిని కరుణింపకయు, వారి యెడల జాలిపడకయు వారిని కత్తివాత హతముచేయును.
8. ఈ ప్రజలతో నీవిట్లనుముయెహోవా సెలవిచ్చునదే మనగాజీవమార్గమును మరణమార్గ మును నేను మీ యెదుట పెట్టుచున్నాను.
9. ఈ పట్టణములో నిలుచువారు కత్తివలన గాని క్షామమువలనగాని తెగులువలనగాని చచ్చెదరు, మేలుచేయుటకుకాదు కీడుచేయుటకే నేను ఈ పట్టణ మునకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్లి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడువారు బ్రదుకు దురు; దోపుడుసొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును.
10. ఈ పట్టణము బబులోను రాజుచేతికి అప్పగింపబడును, అతడు అగ్నిచేత దాని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు.
11. యూదారాజు ఇంటివారలకు ఆజ్ఞ యిదేయెహో వా మాట వినుడి.
12. దావీదు వంశస్థులారా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి, ఆలాగు చేయనియెడల మీ దుష్టక్రియలనుబట్టి నా క్రోధము అగ్నివలె బయలువెడలి, యెవడును ఆర్పలేకుండ మిమ్మును దహించును.
13. యెహోవా వాక్కు ఇదేలోయలో నివసించుదానా, మైదానమందలి బండవంటిదానా, మా మీదికి రాగలవాడెవడు, మా నివాసస్థలములలో ప్రవేశించువాడెవడు? అనుకొనువార లారా,
14. మీ క్రియల ఫలములనుబట్టి మిమ్మును దండించె దను, నేను దాని అరణ్యములో అగ్ని రగుల బెట్టెదను, అది దాని చుట్టునున్న ప్రాంతములన్నిటిని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు.
Chapter 22
1. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునీవు యూదారాజు నగరుదిగిపోయి అక్కడ ఈ మాట ప్రక టింపుము
2. దావీదు సింహాసనముమీద కూర్చుండు యూదా రాజా, నీవును ఈ గుమ్మములద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్థులును నీ జనులును యెహోవా మాట వినుడని ప్రకటింపుము.
3. యెహోవా ఈలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు మీరు నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడి పించుడి, పరదేశులనైనను తండ్రిలేనివారినైనను విధవ రాండ్రనైనను బాధింపకుడి వారికి ఉపద్రవము కలుగజేయ కుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి.
4. మీరు నిశ్చయముగా ఈలాగున చేసినయెడల దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజులు రథములను గుఱ్ఱ ములను ఎక్కి తిరుగుచు, ఉద్యోగస్థుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగరు ద్వారములగుండ ప్రవేశింతురు.
5. మీరు ఈ మాటలు విననియెడల ఈ నగరుపాడై పోవును, నా తోడని ప్రమాణము చేయుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
6. యూదారాజు వంశస్థులనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునా యెన్ని కలో నీవు గిలాదువలెనున్నావు, లెబానోను శిఖరమువలె ఉన్నావు; అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును.
7. నీమీదికి వచ్చుటకై యొక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్టించుచున్నాను, వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్ఠమైనవాటిని నరికి అగ్నిలో పడవేతురు.
8. అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవుచు యెహోవా యెందునిమిత్తము ఈ గొప్పపట్టణమును ఈలాగు చేసెనని యొకని నొకడు అడుగగా
9. అచ్చటి వారువీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాక nరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఈలాగున చేసియున్నాడని చెప్పుదురు.
10. చనిపోయినవానిగూర్చి యేడవవద్దు, వానిగూర్చి అంగ లార్చవద్దు; వెళ్లిపోవుచున్నవానిగూర్చి బహు రోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు.
11. తన తండ్రియైన యోషీయాకు ప్రతిగా ఏలిన వాడై యీ స్థలములోనుండి వెళ్లిపోయిన యూదారాజైన యోషీయా కుమారుడగు షల్లూమునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అతడు ఇక్కడికి తిరిగి రాడు;
12. ఈ దేశము నిక చూడక వారు అతని తీసికొని పోయిన స్థలమునందే అతడు చచ్చును.
13. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ; న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు, జీతమియ్యక తన పొరుగువానిచేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ.
14. వాడు విశాలమైన మేడ గదులుగల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని, విస్తారమైన కిటికీలు చేసికొనుచు, దేవదారు పలకలను దానికి సరంబీవేయుచు, ఇంగిలీకముతో1 రంగువేయుచు నున్నాడే;
15. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహ మును కట్టించుకొనుటచేత రాజవగుదువా? నీ తండ్రి అన్న పానములు కలిగి నీతిన్యాయముల ననుసరించుచు క్షేమముగా ఉండలేదా?
16. అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రదికెను, ఆలాగున చేయుటే నన్ను తెలిసి కొనుట కాదా? యిదే యెహోవా వాక్కు.
17. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయ ముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపదాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలా త్కారము చేయుచున్నావు.
18. కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమను యూదారాజునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుజనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరీ, అని అతని గూర్చి అంగలార్చరు; అయ్యో నా యేలినవాడా, అయ్యో, శోభావంతుడా; అని అతనికొరకు అంగ లార్చరు.
19. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడురీతిగా పాతిపెట్టబడును.
20. నీ విటకాండ్రు నాశనమైరి. లెబానోనును ఎక్కి కేకలువేయుము; బాషానులో బిగ్గరగా అరువుము, అబా రీమునుండి కేకలువేయుము.
21. నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గానినేను విననని నీవంటివి; నామాట వినకపోవుటే నీ బాల్యమునుండి నీకు వాడుక.
22. నీ కాపరు లందరు గాలి పీల్చుదురు, నీ విటకాండ్రు చెరలోనికి పోవుదురు, నీ చెడుతనమంతటినిబట్టి నీవు అవమానమునొంది సిగ్గుపడుదువు.
23. లెబానోను నివాసినీ, దేవదారు వృక్ష ములలో గూడు కట్టుకొనినదానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదనవంటి కష్టము నీకు వచ్చునప్పుడు నీవు బహుగా కేకలువేయుదువు గదా!
24. యెహోవా సెల విచ్చునదేమనగాయూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడిచేతికి శిఖా ఉంగరముగా ఉండినను దానిమీదనుండియు నిన్ను ఊడదీసివేసెదనని నాతోడని ప్రమాణముచేయుచున్నాను.
25. నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో నీవెవరికి భయపడు చున్నావో వారి చేతికి, అనగా బబులోనురాజైన నెబు కద్రెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించు చున్నాను.
26. నిన్నును నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మ భూమికాని పరదేశములోనికి విసరివేసెదను, మీరు అక్కడనే చచ్చెదరు.
27. వారు తిరిగి రావలెనని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు.
28. కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసరివేయబడి, తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి?
29. దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట వినుము.
30. యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడుసంతానహీనుడనియు, తన దినములలో వర్ధిల్లనివాడనియు ఈ మనుష్యునిగూర్చి వ్రాయుడి; అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు; ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు.
Chapter 23
1. యెహోవా వాక్కు ఇదేనా మందలో చేరిన... గొఱ్ఱలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ.
2. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులనుగూర్చి యీలాగున సెలవిచ్చుచున్నాడు మీరు నా గొఱ్ఱలనుగూర్చి విచారణచేయక, నేను మేపుచున్న గొఱ్ఱలను చెదరగొట్టి పారదోలితిరి; ఇదిగో మీ దుష్‌క్రియలనుబట్టి మిమ్మును శిక్షింపబోవుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
3. మరియు నేను వాటిని తోలి వేసిన దేశములన్నిటిలోనుండి నా గొఱ్ఱల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను; అవి అభి వృద్ధిపొంది విస్తరించును.
4. నేను వాటి మీద కాపరులను నియమించెదను; ఇకమీదట అవి భయపడకుండను బెదరి పోకుండను వాటిలో ఒకటైనను తప్పిపోకుండను వీరు నా గొఱ్ఱలను మేపెదరు; ఇదే యెహోవా వాక్కు.
5. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడురాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.
6. అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.
7. కాబట్టి రాబోవు దినములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి రప్పించిన యెహోవా జీవము తోడని యిక ప్రమాణముచేయక
8. ఉత్తర దేశములో నుండియు, నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండియు వారిని రప్పించిన యెహోవానగు నాతోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు; మరియు వారు తమ దేశములో నివసింతురు.
9. ప్రవక్తలను గూర్చినది. యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది, నా యెముకలన్నియు కదలు చున్నవి, నేను మత్తిల్లినవానివలెను ద్రాక్షారసవశుడైన బలాఢ్యునివలెను ఉన్నాను.
10. దేశము వ్యభిచారులతో నిండియున్నది, జనుల నడవడి చెడ్డదాయెను, వారి శౌర్యము అన్యాయమున కుపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది; అడవిబీళ్లు ఎండిపోయెను.
11. ప్రవక్తలేమి యాజకులేమి అందరును అపవిత్రులు; నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను; ఇదే యెహోవా వాక్కు.
12. వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను గనుక గాఢాంధకార ములో నడుచువానికి జారుడు నేలవలె వారి మార్గ ముండును; దానిలో వారు తరుమబడి పడిపోయెదరు; ఇదే యెహోవా వాక్కు.
13. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని; వారు బయలు పేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి.
14. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్య వర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి.
15. కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈ ప్రవక్త లనుగూర్చి సెలవిచ్చునదేమనగాయెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతట వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదునీళ్లును నేను వారి కిచ్చు చున్నాను.
16. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమీకు ప్రచనములు ప్రకటించు ప్రవక్తలమాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు.
17. వారు నన్ను తృణీకరించు వారితోమీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు; ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితోమీకు కీడు రాదనియు చెప్పుచు, యెహోవా ఆజ్ఞనుబట్టి మాట లాడక తమకు తోచిన దర్శనమునుబట్టి పలుకుదురు.
18. యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసినవాడెవడు?
19. ఇదిగో యెహోవాయొక్క మహోగ్రతయను పెనుగాలి బయలువెళ్లుచున్నది; అది భీకరమైన పెనుగాలి అది దుష్టుల తలమీదికి పెళ్లున దిగును.
20. తన కార్యమును సఫలపరచువరకును తన హృదయా లోచనలను నెరవేర్చువరకును యెహోవా కోపము చల్లారదు; అంత్యదినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు.
21. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు.
22. వారు నా సభలో చేరిన వారైన యెడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియ జేతురు, దుష్‌క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచి పెట్టునట్లు వారిని త్రిప్పియుందురు; ఇదే యెహోవా వాక్కు.
23. నేను సమీపముననుండు దేవుడనుమాత్ర మేనా? దూరముననుండు దేవుడనుకానా?
24. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైనకలడా? నేను భూమ్యా కాశముల యందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.
25. కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను.
26. ఇక నెప్పటివరకు ఈలాగున జరుగుచుండును? తమ హృదయకాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీని నాలో చింపరా?
27. బయలును పూజింపవలెనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరు తమ పొరుగువారితో చెప్పు కలలచేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలెనని యోచించుచున్నారా?
28. కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను; నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమునుబట్టి నా మాట చెప్పవలెను; ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు.
29. నా మాట అగ్నివంటిదికాదా? బండను బద్దలుచేయు సుత్తెవంటిది కాదా?
30. కాబట్టి తమ జతవానియొద్దనుండి నా మాటలను దొంగి లించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.
31. స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవో క్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.
32. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు, అబద్ధములచేతను, మాయాప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించువారికి నేను విరో ధినై యున్నాను; ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు; ఇదే యెహోవా వాక్కు.
33. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్నడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుముమీరే ఆయనకు భారము; మిమ్మును ఎత్తి పారవేతును; ఇదే యెహోవా వాక్కు. మరియు
34. ప్రవక్తయే గాని యాజ కుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమను మాట ఎత్తువాడెవడైనను, వానిని వాని యింటివారిని నేను దండించెదను.
35. అయితే యెహోవా ప్రత్యుత్తరమేది? యెహోవా యేమని చెప్పుచున్నాడు? అని మీరు మీ పొరుగువారితోను సహోదరులతోను ప్రశంసించవలెను.
36. యెహోవా భారమను మాట మీరిక మీదట జ్ఞాపకము చేసికొనవద్దు; జీవముగల మన దేవుని మాటలను, సైన్యముల కధిపతియు దేవుడునగు యెహోవా మాటలను, మీరు అపార్థముచేసితిరి; కాగా ఎవనిమాట వానికే భారమగును.
37. యెహోవా నీకేమని ప్రత్యుత్తర మిచ్చుచున్నా డనియు, యెహోవా యేమి చెప్పుచున్నాడనియు మీరు ప్రవక్తను అడుగవలెను గాని యెహోవా భారమను మాట మీరెత్తిన యెడల
38. అందునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమీరు యెహోవా భారమను మాట యెత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యెహోవా భారమను మాట యెత్తుచునే యున్నారు.
39. కాగా నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను, మీకును మీ పితరులకును నేనిచ్చిన పట్టణమును నా సన్నిధినుండి పారవేయుచున్నాను.
40. ఎన్నడును మరువబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీమీదికి రప్పిం చెదను.
Chapter 24
1. బబులోనురాజైన నెబుకద్రెజరు యూదారాజైన యెహోయాకీము కుమారుడగు యెకోన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనునకు తీసికొని పోయిన తరు వాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన రెండు గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను.
2. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లవంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను; అవి తిన శక్యముకానంతగా జబ్బువి.
3. యెహోవాయిర్మీయా, నీకేమి కనబడుచున్నదని నన్నడు గగా నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను జబ్బువి మిక్కిలి జబ్బువిగాను, తిన శక్యముకానంత జబ్బువిగాను కనబడుచున్నవంటిని.
4. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైయీలాగు సెలవిచ్చెను
5. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగావారికి మేలుకలుగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదు లను, ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టు నట్లు లక్ష్యపెట్టుచున్నాను.
6. వారికి మేలు కలుగునట్లు నేను వారిమీద దృష్టియుంచుచు, ఈ దేశమునకు వారిని మరల తీసికొనివచ్చి, పడగొట్టక వారిని కట్టెదను, పెల్లగింపక వారిని నాటెదను.
7. వారు పూర్ణహృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారి కిచ్చెదను.
8. మరియు యూదారాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశములో శేషించిన వారిని ఐగుప్తు దేశమున నివసించువారిని, మిక్కిలి జబ్బువై నందున తినశక్యముకాని ఆ జబ్బు అంజూరపుపండ్లవలె ఉండజేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
9. మరియు వారు యిటు అటు చెదరగొట్టబడుటకై భూ రాజ్యములన్నిటిలోను, నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోను, వారిని భీతికరముగాను నిందాస్పదము గాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసెదను.
10. నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశములో ఉండకుండ వారు పాడైపోవువరకు నేను ఖడ్గమును క్షామమును తెగులును వారిలోకి పంపెదను.
Chapter 25
1. యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము నాలుగవ సంవత్సరమున, అనగా బబు లోనురాజైన నెబుకద్రెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరినిగూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.
2. ప్రవక్తయైన యిర్మీయా యూదా ప్రజలందరి తోను యెరూషలేము నివాసులందరితోను ఆ వాక్కును ప్రకటించెను.
3. ఆమోను కుమారుడును యూదారాజు నైన యోషీయా పదుమూడవ సంవత్సరము మొదలుకొని నేటివరకు ఈ యిరువది మూడు సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచువచ్చెను; నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి.
4. మీ చేతిపనులవలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగ జేయకుండునట్లును, అన్యదేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారముచేయు టయు మాని,
5. మీరందరు మీ చెడ్డమార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగినయెడల, యెహోవా మీకును మీ పితరులకును నిత్యనివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై,
6. యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకుల నందరిని మీయొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి.
7. అయితేమీకు బాధ కలుగుటకై మీ చేతుల పనులవలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపక పోతిరని యెహోవా సెలవిచ్చు చున్నాడు.
8. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమీరు నా మాటలను ఆలకింపక పోతిరి గనుక నేను ఉత్తరదేశములోనున్న సర్వజనములను, నా సేవకుడైన నెబుకద్రెజరను బబులోనురాజును పిలువ నంపించుచున్నాను;
9. ఈ దేశముమీదికిని దీని నివాసుల మీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మ యాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను.
10. సంతోషనాదమును ఉల్లాస శబ్దమును, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వర మును తిరుగటిరాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండ కుండ చేసెదను.
11. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనము గాను ఉండును; ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబు లోనురాజునకు దాసులుగా ఉందురు.
12. యెహోవా వాక్కు ఇదేడెబ్బది సంవత్సరములు గడచిన తరువాత వారి దోషములనుబట్టి నేను బబులోనురాజును ఆ జను లను కల్దీయుల దేశమును శిక్షింతును; ఆ దేశము ఎప్పుడు పాడుగనుండునట్లు నియమింతును.
13. నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నియు యిర్మీయా ఈ జనము లన్నిటినిగూర్చి ప్రకటింపగా, ఈ గ్రంథములో వ్రాయ బడినదంతయు ఆ దేశముమీదికి రప్పించెదను.
14. ఏల యనగా నేను వారి క్రియలనుబట్టియు వారి చేతి కార్య ములనుబట్టియు వారికి ప్రతికారముచేయునట్లు అనేక జనములును మహారాజులును వారిచేత సేవ చేయించు కొందురు.
15. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకీలాగు సెల విచ్చుచున్నాడునీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలోనుండి తీసికొని, నేను నిన్ను పంపుచున్న జనము లన్నిటికి దాని త్రాగింపుము.
16. వారు దాని త్రాగి సొక్కి సోలుచు నేను వారిమీదికి పంపుచున్న ఖడ్గమునుబట్టి వెఱ్ఱివాండ్రగుదురు.
17. అంతట యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసికొని, యెహోవా నన్ను పంపిన జనములన్నిటికి దాని త్రాగించితిని.
18. నేటివలెనే పాడు గాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదము గాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణము లకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగిం చితిని.
19. మరియు ఐగుప్తురాజైన ఫరోయును అతని దాసు లును అతని ప్రధానులును అతని జనులందరును
20. సమస్త మైన మిశ్రిత జనులును ఊజుదేశపు రాజులందరును ఫిలి ష్తీయుల దేశపు రాజులందరును అష్కెలోనును, గాజ యును, ఎక్రోనును అష్డోదు శేషపువారును
21. ఎదోమీయు లును మోయాబీయులును అమ్మోనీయులును
22. తూరు రాజులందరును సీదోను రాజులందరును సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులును
23. దదానీయులును తేమానీయు లును బూజీయులును గడ్డపుప్రక్కలను కత్తిరించుకొనువా రందరును
24. అరబిదేశపు రాజులందరును అరణ్యములో నివసించు మిశ్రితజనముల రాజులందరును
25. జిమీ రాజు లందరును ఏలాము రాజులందరును మాదీయుల రాజులంద రును
26. సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవా రేమి ఉత్తరదేశముల రాజులందరును భూమిమీదనున్న రాజ్యములన్నియు దానిలోనిది త్రాగుదురు; షేషకురాజు వారి తరువాత త్రాగును.
27. నీవు వారితో ఈలాగు చెప్పుముఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియు నైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునేను మీమీదికి పంపబోవు యుద్ధముచేత త్రాగి మత్తిల్లి కక్కు కొనినవారివలెనే యుండి మీరు మరల లేవకుండ పడు దురు.
28. మేము త్రాగమని వారు నీ చేతిలోనుండి ఆ పాత్రను తీసికొననొల్లని యెడల నీవు వారితో ఇట్లనుముమీరు అవశ్యముగా దాని త్రాగవలెనని సైన్యములకధి పతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
29. నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడుచేయ మొదలుపెట్టగా మీకు శిక్షలేకుండ పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరిమీదికి నేను ఖడ్గమును రప్పించు చున్నాను; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.
30. కాబట్టి నీవు ఈ మాటలన్నిటిని వారికి ప్రక టించి, ఈలాగు చెప్పవలెనుఉన్నత స్థలములోనుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయములో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు, తన మంద మేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు, ద్రాక్షగానుగను త్రొక్కువారివలె అరచుచు ఆయన భూలోక నివాసులకందరికి విరోధముగా ఆర్భటించు చున్నాడు.
31. భూమ్యంతమువరకు సందడి వినబడును, యెహోవా జనములతో వ్యాజ్యెమాడుచున్నాడు, శరీరు లందరితో ఆయన వ్యాజ్యెమాడుచున్నాడు, ఆయన దుష్టు లను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు; ఇదే యెహోవా వాక్కు.
32. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడుజనమునుండి జనమునకు కీడు వ్యాపించు చున్నది, భూదిగంతములనుండి గొప్ప తుపాను బయలు వెళ్లుచున్నది.
33. ఆ దినమున యెహోవాచేత హతులైన వారు ఈ దేశముయొక్క యీ దిశనుండి ఆ దిశవరకు కనబడుదురు. ఎవరును వారినిగూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు, పెంటవలె వారి శవములు నేలమీద పడియుండును.
34. మందకాపరులారా, గోలలెత్తుడి, మొఱ్ఱపెట్టుడి; మందలోని ప్రధానులారా, బూడిద చల్లుకొనుడి. మీరు మరణమునొందుటకై దిన ములు పూర్తియాయెను, నేను మిమ్మును చెదరగొట్టెదను, రమ్యమైన పాత్రవలె మీరు పడుదురు.
35. మందకాపరు లకు ఆశ్రయస్థలము లేకపోవును, మందలోని శ్రేష్ఠ మైన వాటికి రక్షణ దొరకకపోవును,
36. ఆలకించుడి, మంద కాపరుల మొఱ్ఱ వినబడుచున్నది, మందలోని ప్రధానుల గోలవినబడుచున్నది, యెహోవా వారి మేతభూమినిపాడు చేసియున్నాడు.
37. నెమ్మదిగల మేతస్థలములు యెహోవా కోపాగ్నిచేత పాడాయెను;
38. క్రూరమైన ఖడ్గముచేతను ఆయన కోపాగ్నిచేతను వారి దేశము పాడుకాగా సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను.
Chapter 26
1. యోషీయా కుమారుడును యూదారాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్దనుండి వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
2. యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి, నేను నీ కాజ్ఞాపించు మాట లన్నిటిని యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికి ప్రకటింపుము; వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు.
3. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలచిన కీడును చేయక నేను సంతాప పడునట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గము విడుచుదు రేమో.
4. నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చునదేమనగా
5. మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రము ననుసరించి నడుచు కొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులగు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి.
6. మీరీలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమున కును చేసెదను, ఈ పట్టణమును భూమిమీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసెదను.
7. యిర్మీయా యీ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులును ప్రవక్తలును జనులందరును వినిరి.
8. జనుల కందరికిని ప్రకటింపవలెనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అతడు పలికి చాలించిన తరు వాత యాజకులును ప్రవక్తలును జనులందరును అతని పట్టుకొనినీవు మరణశిక్ష నొందక తప్పదు.
9. యెహోవా నామమునుబట్టి ఈ మందిరము షిలోహువలె నగుననియు, ఈ పట్టణము నివాసిలేక పాడైపోవుననియు నీవేల ప్రక టించుచున్నావు అనుచు, ప్రజలందరు యెహోవా మంది రములో యిర్మీయాయొద్దకు కూడివచ్చిరి.
10. యూదా అధిపతులు ఆ సంగతులు విని రాజు నగరులో నుండి యెహోవా మందిరమునకు వచ్చి, యెహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమున కూర్చుండగా
11. యాజకులును ప్రవక్తలును అధిపతులతోను సమస్త ప్రజల తోను ఈలాగనిరిమీరు చెవులార వినియున్న ప్రకా రము, ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు; గనుక ఇతడు మరణమునకు పాత్రుడు.
12. అప్పుడు యిర్మీయా అధిపతులందరితోను జనులందరితోను ఈ మాట చెప్పెనుఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటిని ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు.
13. కాబట్టి యెహోవా మీకు చేసెదనని తాను చెప్పిన కీడునుగూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి.
14. ఇదిగో నేను మీ వశములోనున్నాను, మీ దృష్టికేది మంచిదో యేది యుక్తమైనదో అదే నాకు చేయుడి.
15. అయితే మీకు చెవులార ఈ మాటలన్నిటిని చెప్పుటకు నిజముగా యెహోవా మీయొద్దకు నన్ను పంపియున్నాడు గనుక, మీరు నన్ను చంపినయెడల మీరు మీమీదికిని ఈ పట్ట ణముమీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలిసికొనుడి.
16. కాగా అధిపతులును జనులందరును యాజకులతోను ప్రవక్తలతోను ఇట్లనిరిఈ మనుష్యుడు మన దేవుడైన యెహోవా నామమునుబట్టి మనకు ఈ సమాచారము ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు.
17. మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి.
18. యూదారాజైన హిజ్కియా దినములలో మోర ష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెనుసైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుచేనుదున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.
19. అట్లు పలికి నందున యూదారాజైన హిజ్కియాయైనను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా? యెహోవా వారికి చేసెదనని తాను చెప్పిన కీడును చేయక సంతాప పడునట్లు రాజు యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా? మనము ఈ కార్యము చేసినయెడల మనమీదికే గొప్ప కీడు తెచ్చు కొందుము అని చెప్పిరి.
20. మరియు కిర్యత్యారీము వాడైన షెమయా కుమారు డగు ఊరియాయను ఒకడు యెహోవా నామమునుబట్టి ప్రవచించుచుండెను. అతడు యిర్మీయా చెప్పిన మాటల రీతిని యీ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను.
21. రాజైన యెహోయాకీ మును అతని శూరులందరును ప్రధానులందరును అతని మాటలు వినినమీదట రాజు అతని చంపజూచుచుండగా, ఊరియా దాని తెలిసికొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను.
22. అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తు నకు పంపెను;
23. వారు ఐగుప్తులోనుండి ఊరియాను తీసి కొనివచ్చి రాజైన యెహోయాకీమునొద్ద చేర్చగా, ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్యజనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను.
24. ఈలాగు జరుగగా షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు తోడైయున్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింప లేదు.
Chapter 27
1. యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము ఏల నారంభించినప్పుడు యెహోవా యొద్దనుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
2. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చు చున్నాడు నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము.
3. వాటిని యెరూషలేమునకు యూదారాజైన సిద్కియాయొద్దకు వచ్చిన దూతలచేత ఎదోము రాజునొద్దకును మోయాబు రాజునొద్దకును అమ్మోనీయుల రాజునొద్దకును తూరు రాజునొద్దకును సీదోను రాజునొద్దకును పంపుము.
4. మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలెనని యీ ఆజ్ఞ వారితో చెప్పుముమీరు మీ యజమానులకు తెలియ జేయవలెనని సైన్యములకధిపతియైన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చునదేమనగా
5. అధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమిని భూమిమీదనున్న నరులను జంతువులను నేనే సృజించి, ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే యిచ్చుచున్నాను.
6. ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడగు బబులోను రాజైన నెబు కద్రెజరు వశము చేయుచున్నాను; అతని సేవించుటకై భూజంతువులనుకూడ అతని వశము చేయుచున్నాను.
7. అతని స్వదేశమునకు కాలము వచ్చువరకు సమస్తజనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైయుందురు, ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతనిచేత దాస్యము చేయించుకొందురు.
8. ఏ జనము ఏ రాజ్యము బబులోనురాజైన నెబుకద్రెజరు నకు దాస్యము చేయనొల్లక బబులోనురాజుయొక్క కాడిని తన మెడమీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనముచేయించు వరకు ఆ జనమును ఖడ్గముచేతను క్షామము చేతను తెగులుచేతను శిక్షించెదను; ఇదే యెహోవా వాక్కు.
9. కాబట్టి మీ ప్రవక్తలేమి సోదెగాండ్రేమి కలలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకునపుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి.
10. మీరు మీ భూమిని అనుభవింపకుండ మిమ్మును దూరముగా తోలివేయునట్లును, మిమ్మును నేను వెళ్లగొట్టునట్లును, మీరు నశించునట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు.
11. అయితే ఏ జనులు బబులోనురాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండ నిచ్చెదను. వారు తమ భూమిని సేద్య పరచుకొందురు, నేను వారికి నెమ్మది కలుగజేతును; ఇదే యెహోవా వాక్కు.
12. నేను ఆ మాటలనుబట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లంటినిబబులోనురాజుయొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని, అతనికిని అతని జనులకును దాసులైన యెడల మీరు బ్రదుకుదురు
13. బబులోనురాజునకు దాసులుకానొల్లని జనులవిషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను తెగులు చేతనైనను నీవును నీ ప్రజలును చావనేల?
14. కావునమీరు బబులోనురాజునకు దాసులుకాకుందురని మీతో చెప్పు ప్రవక్తలు అబద్దమే ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారి మాటల నంగీకరింపవద్దు, ఇదే యెహోవా వాక్కు.
15. నేను మిమ్మును తోలివేయునట్లును, మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలును నశించు నట్లును, వారు నా నామమునుబట్టి అబద్ధముగా ప్రవ చించుచున్నారు. మరియు యాజకులతోను ఈ ప్రజ లందరితోను నేను ఈ మాటలు చెప్పితిని
16. యెహోవా సెలవిచ్చునదేమనగాయెహోవా మందిరపు ఉపకరణ ములు ఇప్పుడే శీఘ్రముగా బబులోనునుండి మరల తేబడునని ప్రవచింపు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు, వారి మాటలకు చెవియొగ్గకుడి.
17. వారి మాట వినకుడి; బబులోను రాజునకు దాసులైనయెడల మీరు బ్రదుకుదురు; ఈ పట్టణము పాడైపోనేల?
18. వారు ప్రవక్తలైనయెడల, యెహోవా వాక్కు వారికి తోడైయుండినయెడల, యెహోవా మందిరములోను యూదారాజు మందిరములోను యెరూషలేములోను శేషించియుండు ఉపకరణములు బబులోనునకు కొనిపో బడకుండునట్లు వారు సైన్యములకధిపతియగు యెహోవాను బతిమాలుకొనుట మేలు.
19. బబులోను రాజైన నెబుకద్రె జరు యెరూషలేములోనుండి యెహోయాకీము కుమారు డైన యెకోన్యాను యూదా యెరూషలేముల ప్రధానుల నందరిని బబులోనునకు చెరగా తీసికొనిపోయినప్పుడు
20. అతడు విడిచిపెట్టిన స్తంభములనుగూర్చియు సముద్రమును గూర్చియు గడమంచెలనుగూర్చియు ఈ పట్టణములో మిగిలిన ఉపకరణములనుగూర్చియు సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.
21. యెహోవా మందిరములోను యూదారాజు నగరులోను యెరూష లేములోను శేషించిన ఉపకరణములనుగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు ననే సెలవిచ్చుచున్నాడు
22. అవి బబులోనునకు తేబడును, నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి యీ స్థలములో వాటిని మరల నుంచు కాలము వరకు అవి అక్కడ నుండవలెను; ఇదే యెహోవా వాక్కు.
Chapter 28
1. యూదారాజైన సిద్కియా యేలుబడి ఆరంభమున నాల్గవ సంవత్సరము అయిదవ నెలలో గిబియోనువాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్యా యాజకుల యెదుటను ప్రజలందరియెదుటను యెహోవా మందిర ములో నాతో ఈలాగనెను
2. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు నేను బబులోనురాజు కాడిని విరిచియున్నాను.
3. రెండు సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ స్థలములోనుండి బబులోనునకు తీసికొనిపోయిన యెహోవా మందిరపు ఉపకరణము లన్నిటిని ఇచ్చటికి మరల తెప్పించెదను.
4. బబులోను రాజు కాడిని విరుగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదారాజునైన యెకోన్యాను, బబులోనునకు చెరగొని పోయిన యూదులనందిరిని, యీ స్థలమునకు తిరిగి రప్పించె దను; ఇదే యెహోవా వాక్కు.
5. అప్పుడు ప్రవక్తయైన యిర్మీయా యాజకులయెదుటను యెహోవా మందిర ములో నిలుచుచున్న ప్రజలందరియెదుటను ప్రవక్తయైన హనన్యాతో ఇట్లనెను
6. ఆలాగున జరుగునుగాక, యెహోవా ఆలాగుననే చేయునుగాక, యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిని, చెరగొనిపోబడిన వారి నందరిని యెహోవా బబులోనులోనుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక.
7. అయినను నేను నీ చెవులలోను ఈ ప్రజలందరి చెవుల లోను చెప్పుచున్నమాటను చిత్తగించి వినుము.
8. నాకును నీకును ముందుగా నున్న ప్రవక్తలు, అనేకదేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగు ననియు, కీడు సంభవించు ననియు, తెగులుకలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచు వచ్చిరి.
9. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త యున్నాడే, అతని మాట నెరవేరినయెడల యెహోవా నిజముగా అతని పంపెనని యొప్పుకొనదగునని ప్రవక్తయైన యిర్మీయా చెప్పగా
10. ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడ మీదనుండి ఆ కాడిని తీసి దాని విరిచి
11. ప్రజలందరి యెదుట ఇట్లనెనుయెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడురెండు సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనముల మెడమీద నుండి తొలగించి దాని విరిచివేసెదను; అంతట ప్రవక్తయైన యిర్మీయా వెళ్లిపోయెను.
12. ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడ మీదనున్న కాడిని విరిచినతరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
13. నీవు పోయి హనన్యాతో ఇట్లనుముయెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునీవు కొయ్యకాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించవలెను.
14. ఇశ్రా యేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఈ జనులందరును బబు లోను రాజైన నెబుకద్రెజరునకు దాసులు కావలెనని వారి మెడమీద ఇనుపకాడి యుంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు, భూజంతువులను కూడ నేను అతనికి అప్పగించియున్నాను.
15. అంతట ప్రవక్తయైన యిర్మీయా ప్రవక్తయైన హనన్యాతో ఇట్లనెనుహనన్యా వినుము; యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు.
16. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుభూమిమీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను, యెహోవా మీద తిరుగుబాటుచేయుటకై నీవు జనులను ప్రేరేపించి తివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమౌదువు అని చెప్పెను.
17. ఆ సంవత్సరమే యేడవ నెలలో ప్రవక్తయైన హనన్యా మృతినొందెను.
Chapter 29
1. రాజైన యెకోన్యా తల్లియగు రాణియు, రాజ పరివారమును,
2. యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులును, శిల్పకారులును, కంసాలులును యెరూష లేమును విడిచి వెళ్లిన తరువాత ప్రవక్తయైన యిర్మీయా పత్రికలో లిఖించి, యూదారాజైన సిద్కియా బబు లోనులోనున్న బబులోను రాజైన నెబుక ద్రెజరునొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశాచేతను,
3. హిల్కీయా కుమారుడైన గెమర్యాచేతను, యెరూషలేములోనుండి చెర పట్టబడిపోయినవారి పెద్దలలో శేషించినవారికిని యాజ కులకును ప్రవక్తలకును యెరూషలేమునుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులకందరికిని పంపించిన మాటలు ఇవె
4. ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధి పతి యునగు యెహోవా తన ప్రేరేపణచేత బబులోనునకు చెరతీసికొని పోబడినవారికందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు
5. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివ సించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి,
6. పెండ్లిండ్లు చేసికొని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమియు మీకు తక్కువలేకుండ అభివృద్ధిపొందు టకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమా రులకు పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి.
7. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్ట ణముయొక్క క్షేమముకోరి దానికొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును.
8. ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధి పతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమీ మధ్యనున్న ప్రవక్తలచేతనై నను మంత్రజ్ఞులచేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి.
9. వారు నా నామ మునుబట్టి అబద్ధ ప్రవచనము లను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు; ఇదే యెహోవా వాక్కు.
10. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చు చున్నాడుబబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సర ములు గతించిన తరువాతనే మిమ్మునుగూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించు నట్లు నేను మిమ్మును దర్శింతును.
11. నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకర మైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.
12. మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును.
13. మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కను గొందురు,
14. నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించె దను; నేను మిమ్మును చెరపట్టి యే జనులలోనికి ఏ స్థలముల లోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.
15. బబులోనులో మీకు యెహోవా ప్రవక్త లను నియమించియున్నాడని మీరు చెప్పుకొంటిరే,
16. సరే, దావీదు సింహాసనమందు కూర్చునియున్న రాజును గూర్చియు, మీతోకూడ చెరలోనికిపోక యీ పట్టణ ములో నివసించు ప్రజలనుగూర్చియు, మీ సహో దరులనుగూర్చియు, యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడు
17. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునేను వారిమీదికి ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను; కుళ్లి కేవలము చెడిపోయి తినశక్యముకాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయునట్లు నేనువారిని అప్పగించుచున్నాను;
18. యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లనివారై, నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేతవారియొద్దకు పంపిన నా మాటలను ఆలకింపక పోయిరి.
19. గనుక నేను ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును; నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను విస్మయకారణముగాను అపహాస్యా స్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
20. నేను యెరూషలేములోనుండి బబులోనునకు చెరగొని పోయిన వారలారా, మీరందరు యెహోవా ఆజ్ఞను ఆల కించుడి.
21. నా నామమునుబట్టి మీకు అబద్ధప్రవచనములు ప్రక టించు కోలాయా కుమారుడైన అహాబును గూర్చియు, మయశేయా కుమారుడైన సిద్కియాను గూర్చియు, ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
22. ఆలకించుడి, వారు ఇశ్రాయేలీయులలో దుర్మార్గము జరిగించుచు, తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు, నేను వారి కాజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమునుబట్టి ప్రకటించుచువచ్చిరి, నేనే యీ సంగతిని తెలిసికొనిన వాడనై సాక్షిగానున్నాను. కాగా బబులోనురాజైన నెబుకద్రెజరుచేతికి వారిని అప్పగించుచున్నాను, మీరు చూచుచుండగా అతడు వారిని హతముచేయును;
23. చెర పట్టబడి బబులోనులోనున్న యూదావారందరును బబు లోనురాజు అగ్నిలో కాల్చిన సిద్కియావలెను అహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకొందురు; ఇదే యెహోవా వాక్కు.
24. నెహెలామీయుడైన షెమయాకు నీవీమాట తెలియ జేయుము
25. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
26. వెఱ్ఱి వారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొనువారిని నీవు సంకెళ్లచేత బంధించి బొండలో వేయించినట్లుగా, యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించెనని యెరూషలేములో నున్న ప్రజలకందరికిని యాజకుడగు మయశేయా కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరటనే పత్రిక లను పంపితివే.
27. అనాతోతీయుడైన యిర్మీయాను నీవేల గద్దింపకపోతివి?
28. అతడు తన్ను తాను మీకు ప్రవక్త నుగా చేసికొనెనుగదా అదియుగాకదీర్ఘకాలము మీరు కాపురముందురు, నివసించుటకై యిండ్లు కట్టించుకొనుడి, ఫలములు తినుటకై తోటలు నాటుడి, అని బబులోనులో నున్న మాకు అతడు వర్తమానము పంపియున్నాడు,
29. అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్త యైన యిర్మీయా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను
30. అంతట యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
31. చెరలోనున్న వారికందరికి నీవు పంపవలసిన వర్తమానమేమనగా యెహోవా నెహెలా మీయుడైన షెమయానుగూర్చి యీలాగు సెలవిచ్చు చున్నాడునేను అతని పంపకపోయినను షెమయా మీకు ప్రవచింపుచు అబద్ధపు మాటలను నమ్మునట్లు చేసెను గనుక యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.
32. నెహెలా మీయుడైన షెమయా యెహోవామీద తిరుగుబాటు చేయుదమని చాటించెను గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను; ఈ జనులలో కాపురముండువా డొకడును అతనికి మిగిలియుండడు, నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు; ఇదే యెహోవా వాక్కు.
Chapter 30
1. యెహోవాయొద్దనుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్ష మైన వాక్కు.
2. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
3. రాబోవు దినములలో నేను ఇశ్రాయేలువారును యూదావారునగు నా ప్రజ లను చెరలోనుండి విడిపించి, వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనునట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము.
4. యెహోవా ఇశ్రాయేలువారినిగూర్చియు యూదా వారినిగూర్చియు సెలవిచ్చినమాటలివి.
5. యెహోవా యిట్లనెనుసమాధానములేనికాలమున భీతిచేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాము.
6. మీరు విచా రించి తెలిసికొనుడి; పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవవేదనపడు స్త్రీలవలె పురుషులందరును నడుముమీద చేతులుంచుకొనుటయు, వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి?
7. అయ్యో, యెంత భయంకరమైన దినము! అట్టి దినము మరియొకటి రాదు; అది యాకోబు సంతతివారికి ఆపద తెచ్చుదినము; అయినను వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు.
8. సెన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడునీకున్న కాడి నీ మెడ నుండకుండ ఆ దిన మున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను; ఇకను అన్యులు యాకోబు సంతతివారిచేత దాస్యము చేయించు కొనరు గాని
9. వారు తమ దేవుడైన యెహోవా నగు నేను వారిమీద రాజుగా నియమించు దావీదును సేవించు దురు.
10. మరియు యెహోవా సెలవిచ్చునదే మనగానా సేవకుడవైన యాకోబూ, భయపడకుము; ఇశ్రాయేలూ, విస్మయమొందకుము,నేను దూరముననుండు నిన్నును, చెర లోనికి పోయిన దేశముననుండు నీ సంతానపువారిని రక్షించుచున్నాను; బెదరించువాడు లేకుండ యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును.
11. యెహోవా వాక్కు ఇదేనిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటిని నేను సమూలనాశనము చేసెదను గాని నిన్ను సమూల నాశనము చేయను, అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండనే నిన్ను మితముగా శిక్షించుదును.
12. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది;
13. నీ పాప ములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠినశిక్షచేసి నిన్ను గాయపరచియున్నాను; కాగా నీ పక్షమున వ్యాజ్యెమాడువాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు.
14. నీ స్నేహితులందరు నిన్ను మరచియున్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు.
15. నీ గాయముచేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు; నీ పాపములు విస్త రించినందున నీ దోషములనుబట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను.
16. నిన్ను మింగువారందరు మింగి వేయబడుదురు, నిన్ను బాధించువారందరు ఎవడును తప్ప కుండ చెరలోనికి పోవుదురు, నిన్ను దోచుకొనువారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించువారినందరిని దోపుడు సొమ్ముగా అప్పగించెదను.
17. వారుఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు.
18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుయాకోబు నివాసస్థలములను కరుణించి వాని గుడారము లను నేను చెరలోనుండి రప్పింతును; అప్పుడు పట్టణము దాని కొండమీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును.
19. వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమ పడువారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండ నేను వారిని విస్తరింపజేసెదను, అల్పులు కాకుండ నేను వారిని ఘనులుగా జేసెదను.
20. వారి కుమా రులు మునుపటివలెనుందురు, వారి సమాజము నా యెదుట స్థాపింపబడును, వారిని బాధపరచువారి నందరిని శిక్షించె దను.
21. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును, నా సమీప మునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొనువాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరదీసెదను; ఇదే యెహోవా వాక్కు.
22. అప్పుడు మీరు నాకు ప్రజలై యుందురు నేను మీకు దేవుడనై యుందును.
23. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టులమీద పెళ్లున దిగును.
24. తన కార్యము ముగించు వరకు తన హృదయాలోచనలను నెరవేర్చువరకు యెహోవా కోపాగ్ని చల్లారదు, అంత్యదినములలో మీరీ సంగతిని గ్రహింతురు.
Chapter 31
1. యెహోవా వాక్కు ఇదేఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలై యుందురు.
2. యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడుఖడ్గమును తప్పించుకొనినవారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్లుదుననుచున్నాడు.
3. చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్ల నెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.
4. ఇశ్రా యేలు కన్యకా, నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును; నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు.
5. నీవు షోమ్రోను కొండలమీద ద్రాక్షావల్లులను మరల నాటెదవు, నాటు వారు వాటి ఫలములను అనుభవించెదరు.
6. ఎఫ్రాయిము పర్వతములమీద కావలివారు కేకవేసిసీయోనునకు మన దేవుడైన యెహోవాయొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను.
7. యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడుయాకోబునుబట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమునుబట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి స్తుతిచేయుడియెహోవా, ఇశ్రా యేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమీ అని బతిమాలుడి.
8. ఉత్తరదేశములోనుండియు నేను వారిని రప్పించు చున్నాను, గ్రుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణుల నేమి ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతములనుండి అంద రిని సమకూర్చుచున్నాను, మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు
9. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా?
10. జనులారా, యెహోవా మాట వినుడి; దూరమైన ద్వీపములలోనివారికి దాని ప్రకటింపుడిఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొఱ్ఱలకాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి.
11. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించు చున్నాడు, వారికంటె బలవంతుడైన వాని చేతిలోనుండి వారిని విడిపించుచున్నాడు
12. వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవా చేయు ఉప కారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమును బట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు.
13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆద రించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును ¸°వనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు.
14. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకార ములను తెలిసికొని తృప్తినొందుదురు; ఇదే యెహోవా వాక్కు.
15. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆల కించుడి, రామాలో అంగలార్పును మహా రోదనధ్వనియు వినబడుచున్నవి; రాహేలు తన పిల్లలను గూర్చి యేడ్చు చున్నది; ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది.
16. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడుఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము; నీ క్రియసఫలమై, జనులు శత్రువుని దేశములోనుండి తిరిగి వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు.
17. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమి్మక యున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు.
18. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన యెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చు చుండగా నేను ఇప్పుడే వినుచున్నాను.
19. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని, నేను సంగతి తెలిసికొని తొడ చరుచుకొంటిని, నా బాల్య కాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడితిని.
20. ఎఫ్రాయిము నా కిష్టమైన కుమారుడా? నాకు ముద్దు బిడ్డా? నేనతనికి విరోధముగ మాటలాడునప్పుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును; ఇదే యెహోవా వాక్కు.
21. ఇశ్రాయేలు కుమారీ, సరిహద్దురాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము, నీవు వెళ్లిన రాజమార్గముతట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము; ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము.
22. నీవు ఎన్నాళ్లు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించు చున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును.
23. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు--చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదాదేశము లోను దాని పట్టణములలోను జనులునీతిక్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు.
24. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును,కృశించిన వారినందరిని నింపు దును.
25. కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదా వారందరును పట్టణస్థు లందరును వారి దేశములో కాపురముందురు.
26. అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోద మాయెను.
27. యెహోవా వాక్కు ఇదేఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి.
28. వారిని పెల్లగించుటకును విరుగగొట్టుటకును పడద్రోయుట కును నాశనము చేయుటకును హింసించుటకును నేనేలాగు కనిపెట్టి యుంటినో ఆలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును; ఇదే యెహోవా వాక్కు.
29. ఆ దినములలోతండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనను మాట వాడుకొనరు.
30. ప్రతి వాడు తన దోషముచేతనే మృతినొందును; ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్లే పులియును.
31. ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.
32. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.
33. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.
34. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.
35. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగ ములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యముల కధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.
36. ఆ నియమములు నా సన్నిధి నుండకుండ పోయినయెడల ఇశ్రాయేలు సంతతివారు నా సన్నిధిని ఎన్నడును జన ముగా ఉండకుండపోవును; ఇదే యెహోవా వాక్కు.
37. యెహోవా సెలవిచ్చునదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునా దులను పరిశోధించుటయు శక్యమైనయెడల, ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమునుబట్టి నేను వారినందరిని తోసి వేతును; యెహోవా వాక్కు ఇదే.
38. యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడురాబోవు దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూలగుమ్మమువరకు పట్టణము యెహోవా పేరట కట్టబడును.
39. కొలనూలు దాని కెదు రుగా గారేబుకొండవరకు పోవుచు గోయావరకు తిరిగి సాగును.
40. శవములును బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగువరకును గుఱ్ఱముల గవినివరకును తూర్పుదిశనున్న పొలములన్నియు యెహోవాకు ప్రతి ష్ఠితములగును. అది మరి ఎన్నడును పెల్లగింపబడదు, పడద్రోయబడదు.
Chapter 32
1. యూదారాజైన సిద్కియా యేలుబడి పదియవ... సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి పదు నెనిమి దవ సంవత్సరమున యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.
2. ఆ కాలమున బబులోనురాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగాయెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆలోచించుడి, ఈ పట్టణ మును బబులోనురాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును,
3. యూదారాజైన సిద్కియా కల్దీయుల చేతిలోనుండి తప్పించుకొనక బబులోనురాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును, సిద్కియా అతనితో ముఖాముఖిగా మాటలాడును, కన్నులార అతనిచూచును,
4. అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును, నేను అతని దర్శించువరకు అతడక్కడనే యుండును; ఇదే యెహోవా వాక్కు;
5. మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయము నొందరు, అను మాటలు నీవేల ప్రకటించుచున్నావని యిర్మీయాతో చెప్పి అతనిని చెరలో వేయించి యుండెను; కాగా ప్రవక్తయైన యిర్మీయా యూదా రాజు మందిరములోనున్న చెరసాల ప్రాకార ములో ఉంచబడియుండెను.
6. అంతట యిర్మీయా ఇట్లనెనుయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
7. నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీయొద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాని కొనుక్కొనుమని చెప్పును.
8. కావున నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హన మేలు యెహోవా మాటచొప్పున చెరసాల ప్రాకార ములోనున్న నాయొద్దకు వచ్చిబెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలిసికొని
9. నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు పొలమును కొని, పదియేడు తులముల వెండి తూచి ఆతనికిచ్చితిని.
10. నేను క్రయ పత్రము వ్రాసి ముద్రవేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి
11. క్రయపత్రమును, అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసికొంటిని.
12. అప్పుడు నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు ఎదు టను, ఆ క్రయపత్రములో చేవ్రాలు చేసిన సాక్షుల యెదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదు లందరియెదుటను, నేను మహ సేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల యెదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించి తిని.
13. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా
14. ఈ పత్రములను, అనగా ముద్రగల యీ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును, నీవు తీసికొని అవి బహు దినములుండు నట్లు మంటికుండలో వాటిని దాచిపెట్టుము.
15. ఇశ్రా యేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఇండ్లును పొలములును ద్రాక్షతోటలును ఇంక ఈ దేశములో కొనబడును.
16. నేరీయా కుమారుడైన బారూకుచేతికి ఆ క్రయ పత్రమును నేనప్పగించిన తరువాత యెహోవాకు ఈలా గున ప్రార్థన చేసితిని
17. యెహోవా, ప్రభువా సైన్య ములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధికబలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు.
18. నీవు వేవేలమందికి కృపచూపుచు, తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు.
19. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలనుబట్టియు వారి క్రియాఫలమును బట్టియు అందరికి ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులార చూచుచున్నావు.
20. నీవు ఐగుప్తుదేశములో చేసినట్టు నేటివరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుష్యుల మధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు.
21. సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహా బలముకలిగి, చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి, ఐగుప్తు దేశములోనుండి నీ ప్రజలను రప్పించి
22. మీ కిచ్చెదనని వారి పితరులకు ప్రమాణముచేసి, పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారి కిచ్చితివి.
23. వారు ప్రవేశించి దాని స్వతంత్రించుకొనిరి గాని నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయిరి. వారు చేయవలె నని నీవాజ్ఞాపించినవాటిలో దేనిని చేయకపోయిరి గనుక ఈ కీడంతయు వారిమీదికి రప్పించియున్నావు.
24. ముట్టడి దిబ్బలను చూడుము, పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి, ఖడ్గము క్షామము తెగులు వచ్చుటవలన దానిమీద యుద్ధముచేయుచుండు కల్దీయుల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును; నీవు సెలవిచ్చినది సంభవించెను, నీవే దాని చూచుచున్నావు గదా?
25. యెహోవా ప్రభువాధనమిచ్చి యీ పొలమును కొను క్కొని సాక్షులను పిలుచుకొనుమని నీవే నాతో సెల విచ్చితివి, అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింప బడుచున్నది.
26. అంతట యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
27. నేను యెహోవాను, సర్వశరీ రులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?
28. కావున యెహోవా ఈమాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీయుల చేతికిని బబు లోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అప్పగింపబోవు చున్నాను; అతడు దాని పట్టుకొనగా
29. ఈ పట్టణము మీద యుద్ధముచేయు కల్దీయులు వచ్చి, యీ పట్టణము నకు అగ్ని ముట్టించి, యే మిద్దెలమీద జనులు బయలునకు ధూపార్పణచేసి అన్యదేవతలకు పానార్పణములనర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలన్నిటిని కాల్చివేసె దరు.
30. ఏలయనగా ఇశ్రాయేలువారును యూదావారును తమ బాల్యము మొదలుకొని నాయెదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు, తమ చేతుల క్రియవలన వారు నాకు కోపమే పుట్టించువారు; ఇదే యెహోవా వాక్కు.
31. నా కోపము రేపుటకు ఇశ్రాయేలువారును యూదా వారును వారి రాజులును వారి ప్రధానులును వారి యాజకులును వారి ప్రవక్తలును యూదా జనులును యెరూషలేము నివాసులును చూపిన దుష్‌ప్రవర్తన అంత టినిబట్టి,
32. నా యెదుటనుండి వారి దుష్‌ప్రవర్తనను నేను నివారణచేయ ఉద్దేశించునట్లు, వారు ఈ పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇదివరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయెను.
33. నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధ నంగీకరింపక పోయిరి, వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి.
34. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అప విత్రపరచుటకు దానిలో హేయమైనవాటిని పెట్టిరి.
35. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్టింపవలెనని బెన్ హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠము లను కట్టించిరి, ఆలాగు చేయుటకు నేను వారి కాజ్ఞాపింప లేదు, యూదావారు పాపములో పడి, యెవరైన నిట్టి హేయక్రియలు చేయుదురన్నమాట నా కెన్నడును తోచలేదు.
36. కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణ మునుగూర్చి యీ మాట సెలవిచ్చుచున్నాడు అది ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను పీడింపబడినదై బబులోనురాజు చేతికి అప్పగింపబడునని మీరీ పట్టణమును గూర్చి చెప్పుచున్నారు గదా.
37. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకముచేతను మహా రౌద్రముచేతను నేను వారిని వెళ్లగొట్టిన దేశములన్నిటిలోనుండి వారిని సమకూర్చి యీ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసెదను.
38. వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును.
39. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గ మును దయచేయుదును.
40. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయు చున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయ ములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను.
41. వారికి మేలుచేయుటకు వారియందు ఆనందించుచున్నాను, నా పూర్ణహృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను.
42. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునేెెను ఈ ప్రజలమీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారినిగూర్చి చెప్పిన మేలంత టిని వారిమీదికి రప్పింపబోవుచున్నాను.
43. ఇది పాడై పోయెను, దానిలో నరులు లేరు, పశువులు లేవు, ఇది కల్దీయులచేతికి ఇయ్యబడియున్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును.
44. నేను వారిలో చెరపోయినవారిని రప్పింపబోవుచున్నాను గనుక బెన్యా మీను దేశములోను యెరూషలేము ప్రాంతములలోను యూదా పట్టణములలోను మన్యములోని పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను మనుష్యులు క్రయమిచ్చి పొలములు కొందురు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్రవేయుదురు, సాక్షులను పెట్టుదురు; ఇదే యెహోవా వాక్కు.
Chapter 33
1. మరియు యిర్మీయా చెరసాల ప్రాకారములలో ఇంక ఉంచబడియుండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
2. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించినవాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు
3. నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.
4. ముట్టడిదిబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణములోని యిండ్లన్నియు యూదారాజుల నగరులును శిథిలమై పోయెనుగదా. వాటినిగూర్చి ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా
5. కల్దీయులతో యుద్ధము చేసి, వారి చెడుతనమునుబట్టి ఈ పట్టణమునకు విముఖుడ నైన నా మహాకోపముచేత హతులై, తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తికలిగించుటకై వారు వచ్చుచుండగా
6. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించు చున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను.
7. చెరలో నుండిన యూదావారిని ఇశ్రాయేలువారిని నేను రప్పించు చున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించు చున్నాను.
8. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలువకుండ వారిని పవిత్రపరతును, వారు నాకు విరోధముగాచేసిన దోషములన్నిటిని తిరుగుబాటులన్నిటిని క్షమించెదను.
9. భూజనులందరియెదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్రకారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు, నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులువిని నేను వారికి కలుగజేయు సమస్తక్షేమమునుబట్టియు సమస్తమైన మేలును బట్టియు భయపడుచు దిగులు నొందుదురు.
10. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే, మనుష్యులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే,
11. సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వర మునుయెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతర ముండును, సైన్యములకధిపతియగు యెహోవాను స్తుతిం చుడి అని పలుకువారి స్వరమును మరల వినబడును; యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసికొని వచ్చువారి స్వరమును మరల వినబడును; మునుపటివలె ఉండుటకై చెరలోనున్న యీ దేశస్థులను నేను రప్పించు చున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు
12. సైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మనుష్యులైనను జంతువులైనను లేక పాడైయున్న యీ స్థలములోను దాని పట్టణములన్నిటిలోను గొఱ్ఱల మంద లను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు.
13. మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను బెన్యామీను దేశములోను యెరూష లేము ప్రాంత స్థలములలోను యూదా పట్టణములలోను మందలు లెక్క పెట్టువారిచేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
14. యెహోవా వాక్కు ఇదేఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులనుగూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి.
15. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును.
16. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షిత ముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతియని యెరూషలేమునకు పేరుపెట్టబడును.
17. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఇశ్రాయేలువారి సింహా సనముమీద కూర్చుండువాడొకడు దావీదునకుండక మానడు.
18. ఎడతెగక దహనబలులను అర్పించుటకును నైవేద్యముల నర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు.
19. మరియు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
20. యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగాదివారాత్రములు వాటి సమయము లలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయకలిగిన యెడల
21. నా సేవకుడైన దావీదు సింహాసనముమీద కూర్చుండి రాజ్యపరిపాలనచేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థ మగును; మరియు నా పరిచారకులైన లేవీయులగు యాజ కులతోను నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును.
22. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్యచేయు లేవీయులను లెక్కింప లేనంతగా నేను విస్తరింపజేయుదును.
23. మరియు యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్య క్షమై యీలాగు సెలవిచ్చెను.
24. తాను ఏర్పరచుకొనిన రెండు కుటుంబములను యెహోవా విసర్జించెననియు, నా ప్రజలు ఇకమీదట తమ యెదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది గదా.
25. యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడుపగటినిగూర్చియు రాత్రినిగూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని యెడల
26. భూమ్యా కాశములనుగూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతాన మును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయ ముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను.
Chapter 34
1. బబులోనురాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారముక్రిందనున్న భూరాజ్యములన్నియు జనములన్నియు కూడి యెరూషలేముమీదను దాని పురము లన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్దనుండి యిర్మీయాకు దర్శనమైన వాక్కు.
2. ఇశ్రా యేలు దేవుడగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చు చున్నాడునీవు వెళ్లి యూదారాజైన సిద్కియాతో ఈలాగు చెప్పుముయెహోవా సెలవిచ్చునదేమనగా నేను ఈ పట్టణమును బబులోను రాజుచేతికి అప్పగించు చున్నాను, అతడు మంటపెట్టి దాని కాల్చివేయును.
3. నీవు అతని చేతిలోనుండి తప్పించుకొనజాలక నిశ్చయ ముగా పట్టబడి అతనిచేతి కప్పగింపబడెదవు. బబులోను రాజును నీవు కన్నులార చూచెదవు, అతడు నీతో ముఖా ముఖిగా మాటలాడును, నీవు బబులోనునకు పోవుదువు.
4. యూదా రాజవైన సిద్కియా, యెహోవా మాట వినుము నిన్నుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు ఖడ్గమువలన మృతిబొందక నెమ్మదిగానే మృతి బొందెదవు.
5. నీకంటె ముందుగానుండిన పూర్వరాజులైన నీ పితరులకొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు -- అయ్యో నా యేలినవాడా, అని నిన్ను గూర్చి అంగలార్చుచు జనులు నీకొరకును ధూపద్రవ్యము కాల్చుదురు; ఆలాగు కావలెనని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
6. యూదా పట్టణములలో లాకీషును అజేకాయును ప్రాకారములుగల పట్టణములుగా మిగిలి యున్నవి,
7. బబులోనురాజు దండు యెరూషలేముమీదను మిగిలిన యూదా పట్టణములన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్తయైన యిర్మీయా యెరూషలేములో యూదా రాజైన సిద్కియాకు ఈ మాట లన్నిటిని ప్రక టించుచు వచ్చెను.
8. యూదులచేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హెబ్రీయులనుగాని హెబ్రీయు రాండ్రనుగాని అందరిని విడిపించునట్లు విడుదలచాటింప
9. వలెనని రాజైనసిద్కియా యెరూషలేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యెహోవాయొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు
10. ఆ నిబంధ ననుబట్టి అందరును తమకు దాస దాసీజనముగా నున్న వారిని విడిపించుదుమనియు, ఇకమీదట ఎవరును వారిచేత కొలువు చేయించుకొనమనియు, ఒప్పుకొని, ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరును ప్రజలందరును విధేయులై వారిని విడిపించిరి.
11. అయితే పిమ్మట వారు మనస్సు మార్చుకొని, తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాస దాసీజనులను మరల దాసులుగాను దాసీలుగాను లోపరచు కొనిరి.
12. కావున యెహోవాయొద్దనుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
13. ఇశ్రా యేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసి తిని.
14. నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు కొలువుచేసిన హెబ్రీయులగు మీ సహోదరులను ఏడు సంవత్సరములు తీరిన తరువాత మీరు విడిపింపవలెను; అయితే మీ పితరులు తమ చెవియొగ్గక నా మాట అంగీకరింపక పోయిరి.
15. మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకొని యొక్కొక్కడు తన పొరుగు వానికి విడుదల చాటింతమని చెప్పి, నా పేరు పెట్టబడిన యీ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి, నా దృష్టికి యుక్తమైనది చేసితిరి.
16. పిమ్మట మీరు మనస్సు మార్చుకొని నా నామమును అపవిత్రపరచితిరి వారి ఇచ్ఛానుసారముగా తిరుగునట్లు వారిని స్వతంత్రు లుగా పోనిచ్చిన తరువాత, అందరును తమ దాసదాసీలను మరల పట్టుకొని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోపరచుకొంటిరి
17. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఒక్కొక్కడు తన సహో దరులకును తన పొరుగువారికిని విడుదల ప్రకటింపవలెనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే; ఆలోచించుడి, విడుదల కావలెనని నేనే చాటించుచున్నాను, అది ఖడ్గ క్షామసంకటముల పాలగుటకైన విడుదలయే; భూరాజ్యము లన్నిటిలోను ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్ము నప్పగించుచున్నాను.
18. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాని నతిక్రమించువారిని, తాము రెండు భాగములుగా కోసి వాటిమధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను;
19. అనగా యూదా అధిపతులను యెరూషలేము అధిపతులను రాజ పరివారములోని వారిని యాజకులను దేశజనులనందరిని ఆ దూడయొక్క రెండు భాగముల మధ్య నడచినవారినంద రిని ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను.
20. వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయజూచువారి చేతి కిని వారి నప్పగించుచున్నాను, వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా నుండును.
21. యూదారాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువులచేతికిని వారి ప్రాణము తీయజూచువారిచేతికిని మీయొద్దనుండి వెళ్ళిపోయిన బబులోనురాజు దండు చేతికిని అప్పగించుచున్నాను.
22. యెహోవా వాక్కు ఇదేనేను ఆజ్ఞ ఇచ్చి యీ పట్టణమునకు వారిని మరల రప్పించు చున్నాను, వారు దానిమీద యుద్ధముచేసి దాని పట్టు కొని మంటపెట్టి దాని కాల్చివేసెదరు; మరియు యూదా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయు దును.
Chapter 35
1. యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్దనుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై
2. నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాటలాడి, యెహోవా మంది రములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి, త్రాగుటకు వారికి ద్రాక్షారసమిమ్మని సెలవియ్యగా
3. నేను, యిర్మీయా కుమారుడును యజన్యా మనుమడునైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారుల నందరిని, అనగా రేకాబీయుల కుటుంబికులనందరిని, తోడుకొని వచ్చితిని.
4. యెహోవా మందిరములో దైవ జనుడగు యిగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసికొని వచ్చితిని. అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయశేయా గదికి పైగా ఉండెను.
5. నేను రేకాబీయుల యెదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టిద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా
6. వారుమా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనా దాబుమీరైనను మీ సంతతివారైనను ఎప్పుడును ద్రాక్షా రసము త్రాగకూడదని మాకాజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము.
7. మరియు మీరు ఇల్లు కట్టు కొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్షతోట నాటవద్దు, అది మీకుండనేకూడదు; మీరు పరవాసముచేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నియు గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకాజ్ఞా పించెను.
8. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటనుబట్టి మేముగాని మా భార్యలుగాని మా కుమారులుగాని మా కుమార్తెలుగాని ద్రాక్షారసము త్రాగుటలేదు.
9. మా తండ్రియైన యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్తమునుబట్టి మేము విధేయులమగు నట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుటలేదు, ద్రాక్షా వనములుగాని పొలములుగాని సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు
10. గుడారములలోనే నివసించు చున్నాము.
11. అయితే బబులోనురాజైన నెబుకద్రెజరు ఈ దేశములో ప్రవేశింపగా కల్దీయుల దండునకును సిరి యనుల దండునకును భయపడి, మనము యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకొంటిమి గనుక మేము యెరూషలేములో కాపురమున్నామని చెప్పిరి.
12. అంతట యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్య క్షమై యిలాగు సెలవిచ్చెనుఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా
13. నీవు వెళ్లి యూదావారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుముయెహోవా వాక్కు ఇదేమీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలంకిపరా? యిదే యెహోవా వాక్కు.
14. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారుల కాజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి, నేటివరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు; అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాటలాడి నను మీరు నా మాట వినకున్నారు.
15. మరియు పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీయొద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకొనినయెడలను, అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండినయెడలను, నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటిం చితిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి
16. రేకాబు కుమారుడైన యెహోనా దాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని యీ ప్రజలు నా మాట వినకయున్నారు.
17. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడునేను వారితో మాటలాడితిని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరమియ్యకపోయిరి గనుక యూదావారిమీదికిని యెరూషలేము నివాసులందరి మీది కిని రప్పించెదనని నేను చెప్పిన కీడంతయు వారిమీదికి రప్పించుచున్నాను.
18. మరియు యిర్మీయా రేకాబీయులను చూచి యిట్లనెనుఇశ్రాయేలు దేవుడును సైన్యములకధి పతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమీరు మీ తండ్రియైన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటిని గైకొని అతడు మికాజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు.
19. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగానా సన్నిధిలో నిలుచు టకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడునుండక మానడు.
Chapter 36
1. యూదారాజైన యోషీయా కుమారుడగు యెహో యాకీము నాలుగవ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
2. నీవు పుస్తకపుచుట్ట తీసికొని నేను నీతో మాటలాడిన దినము మొదలుకొని, అనగా యోషీయా కాలము మొదలుకొని నేటివరకు ఇశ్రాయేలువారినిగూర్చియు యూదావారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటిని దానిలో వ్రాయుము.
3. నేను యూదా వారికి చేయనుద్దేశించు కీడంతటినిగూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించునట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో.
4. యిర్మీయా నేరీయా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నిటిని యిర్మీయా నోటిమాటలనుబట్టి ఆ పుస్తకములో వ్రాసెను.
5. యిర్మీయా బారూకునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనునేను యెహోవా మందిరములోనికి రాకుండ నిర్బంధింపబడితిని.
6. కాబట్టి నీవు వెళ్లి ఉపవాసదినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడునట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము, తమ పట్టణములనుండి వచ్చు యూదా జనులందరికిని వినబడు నట్లుగా వాటిని చదివి వినిపింపవలెను.
7. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒక వేళ వారు తమ చెడుమార్గము విడుతురేమో, నిజముగా ఈ ప్రజలమీదికి ఉగ్రతయు మహా కోపమును వచ్చునని యెహోవా ప్రకటించియున్నాడు.
8. ప్రవక్తయైన యిర్మీయా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరీయా కుమారుడైన బారూకు గ్రంథము చేతపట్టుకొని యెహోవా మాటలన్నిటిని యెహోవా మందిరములో చదివి వినిపించెను.
9. యూదారాజైన యోషీయా కుమారుడగు యెహో యాకీము ఏలుబడియందు అయిదవ సంవత్సరము తొమి్మదవ నెలను యెరూషలేములోనున్న ప్రజలందరును యూదా పట్టణములలోనుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరును యెహోవాపేరట ఉపవాసము చాటింపగా
10. బారూకు యెహోవా మందిరములో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో యెహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరు వినునట్లు యిర్మీయా చెప్పిన మాటలను గ్రంథములోనుండి చదివి వినిపించెను.
11. షాఫాను కుమారు డైన గెమర్యా కుమారుడగు మీకాయా ఆ గ్రంథములోని యెహోవా మాటలన్నిటిని విని
12. రాజనగరులోనున్న లేఖికుని గదిలోనికి వెళ్లగా ప్రధానులందరును లేఖికుడైన ఎలీషామా షెమాయా కుమారుడైన దెలాయ్యా అక్బోరు కుమారుడైన ఎల్నాతాను షాఫాను కుమారుడైన గెమర్యా హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధాను లందరును అక్కడ కూర్చుండి యుండిరి.
13. బారూకు ప్రజలందరికి వినబడునట్లు ఆ పుస్తకములోనుండి చదివి వినిపించిన మాటలన్నిటిని మీకాయా వారికి తెలియ జెప్పగా
14. ప్రధానులందరు కూషీకి ఇనుమనుమడును షెలె మ్యాకు మనుమడును నెతన్యాకు కుమారుడునైన యెహూ దిని బారూకు నొద్దకు పంపినీవు ప్రజల వినికిడిలో చది విన పుస్తకమును చేత పట్టుకొని రమ్మని ఆజ్ఞ నియ్యగా నేరీయా కుమారుడగు బారూకు ఆ గ్రంథమును చేత పట్టుకొని వచ్చెను.
15. అతడు రాగా వారునీవు కూర్చుండి మాకు వినిపింపుమనగా బారూకు దాని చదివి వినిపించెను.
16. వారు ఆ మాటలన్నిటిని విన్నప్పుడు భయపడి యొకరి నొకరు చూచుకొనిమేము నిశ్చయముగా ఈ మాట లన్నిటిని రాజునకు తెలియజెప్పెదమని బారూకుతో ననిరి.
17. మరియుఈ మాటలన్నిటిని అతడు చెప్పు చుండగా నీవు ఎట్లు వ్రాసితివి? అది మాకు తెలియజెప్పు మని వారడుగగా
18. బారూకు అతడు నోటనుండియే యీ మాటలన్నిటిని పలుకగా నేను పుస్తకములో వాటిని సిరాతో వ్రాసితినని వారితో ఉత్తరమిచ్చెను.
19. నీవును యిర్మీయాయును పోయి దాగియుండుడి, మీరున్నచోటు ఎవరికిని తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి
20. శాలలో నున్న రాజునొద్దకు తామే వెళ్లి ఆ మాటలన్నిటిని రాజు చెవులలో వినిపించిరి గాని ఆ పుస్తకపుచుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి.
21. ఆ గ్రంథమును తెచ్చు టకు రాజు యెహూదిని పంపగా అతడు లేఖికుడైన ఎలీ షామా గదిలోనుండి దాని తీసికొని వచ్చి రాజు వినికిడి లోను రాజనొద్దకు నిలిచియున్న అధిపతులందరి వినికిడి లోను దాని చదివెను.
22. తొమి్మదవ మాసమున రాజు శీత కాలపు నగరులో కూర్చుండియుండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను.
23. యెహూది మూడు నాలుగు పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో నున్న అగ్నిచేత అది బొత్తిగా కాలిపోయెను గాని
24. రాజైనను ఈ మాట లన్నిటిని వినిన యతని సేవకులలో ఎవరైనను భయపడ లేదు, తమ బట్టలు చింపుకొనలేదు.
25. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలాయ్యాయును గెమర్యా యును రాజుతో మనవిచేయగా అతడు వారి విజ్ఞాపనము వినకపోయెను.
26. లేఖికుడైన బారూకును ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకొనవలెనని రాజవంశస్థుడగు యెరహ్మె యేలునకును అజ్రీయేలు కుమారుడైన శెరాయాకును అబ్దె యేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను గాని యెహోవా వారిని దాచెను.
27. యిర్మీయా నోటిమాటనుబట్టి బారూకు వ్రాసిన గ్రంథ మును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
28. నీవు మరియొక గ్రంథము తీసికొని యూదారాజైన యెహో యాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నిటిని దానిలో వ్రాయుము.
29. మరియు యూదా రాజైన యెహోయాకీమునుగూర్చి నీవీమాట చెప్పవలెనుయెహోవా సెలవిచ్చునదేమనగాబబులోనురాజు నిశ్చ యముగా వచ్చి యీ దేశమును పాడుచేసి అందులో మనుష్యులైనను జంతువులైనను ఉండకుండ చేయునని ఇందులో నీవేల వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే;
30. అందుచేతను యూదారాజైన యెహో యాకీమునుగూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడుదావీదుయొక్క సింహాసనముమీద ఆసీనుడగుటకు అతనికి ఎవడును లేకపోవును, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలునగును.
31. నేను వారి దోషమునుబట్టి అతనిని అతని సంతతిని అతని సేవకు లను శిక్షించుచున్నాను. నేను వారినిగూర్చి చెప్పిన కీడంతయు వారిమీదికిని యెరూషలేము నివాసులమీదికిని యూదా జనులమీదికిని రప్పించుచున్నాను; అయినను వారు వినినవారుకారు.
32. యిర్మీయా యింకొక గ్రంథమును తీసికొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకుచేతికి అప్పగింపగా అతడు యిర్మీయా నోటిమాటలను బట్టి యూదారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటిని వ్రాసెను; మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను.
Chapter 37
1. బబులోనురాజైన నెబుకద్రెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యోషీయా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యముచేయుచుండెను.
2. అతడైనను అతని సేవకులైనను దేశప్రజలైనను యెహోవా ప్రవక్తయైన యిర్మీయాచేత సెలవిచ్చిన మాటలను లక్ష్యపెట్టలేదు.
3. రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహు కలును యాజకుడైన మయశేయా కుమారుడగు జెఫన్యాను ప్రవక్తయైన యిర్మీయాయొద్దకు పంపిదయచేసి మన దేవు డైన యెహోవాకు ప్రార్థన చేయుమని మనవిచేసెను.
4. అప్పటికి వారు యిర్మీయాను చెరసాలలో నుంచియుండ లేదు; అతడు ప్రజలమధ్య సంచరించుచుండెను.
5. ఫరో దండు ఐగుప్తులోనుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడివేయుచున్న కల్దీయులు సమాచారము విని యెరూష లేము దగ్గరనుండి బయలుదేరిరి.
6. అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
7. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగానాయొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదారాజుతో నీ వీలాగు చెప్పవలెనుమీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చు చున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్లును.
8. కల్దీయులు తిరిగి వచ్చి యీ పట్టణముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని అగ్ని చేత కాల్చి వేయుదురు.
9. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుకల్దీ యులు నిశ్చయముగా మాయొద్దనుండి వెళ్లెదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వారు వెళ్లనే వెళ్లరు.
10. మీతో యుద్ధముచేయు కల్దీయుల దండువారినందరిని మీరు హతముచేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలోనుండి వచ్చి యీ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు.
11. ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూష లేము ఎదుటనుండి వెళ్లిపోగా
12. యిర్మీయా బెన్యామీను దేశములో తనవారియొద్ద భాగము తీసికొనుటకై యెరూష లేమునుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా
13. ఇరీయా అను కావలివారి అధిపతి అక్కడ నుండెను. అతడు హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు. అతడు ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకొనినీవు కల్దీయులలో చేరబోవు చున్నావని చెప్పగా
14. యిర్మీయా అది అబద్దము, నేను కల్దీయులలో చేరబోవుటలేదనెను. అయితే అతడు యిర్మీయామాట నమ్మనందున ఇరీయా యిర్మీయాను పట్టు కొని అధిపతులయొద్దకు తీసికొని వచ్చెను.
15. అధిపతులు యిర్మీయామీద కోపపడి అతని కొట్టి, తాము బందీగృహ ముగా చేసియున్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించిరి.
16. యిర్మీయా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను; పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానము పంపి,
17. అతని తన యింటికి పిలిపించియెహోవాయొద్దనుండి ఏ మాటై నను వచ్చెనా అని యడుగగా యిర్మీయా--నీవు బబులోను రాజుచేతికి అప్పగింపబడెదవను మాటవచ్చెననెను.
18. మరియు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇట్లనెనునేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి?
19. బబులోను రాజు మీమీది కైనను ఈ దేశముమీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడనున్నారు?
20. రాజా, నా యేలిన వాడా, చిత్తగించి వినుము, చిత్తగించి నా మనవి నీ సన్ని ధికి రానిమ్ము, నేను అక్కడ చని పోకుండునట్లు లేఖికుడైన యెనాతాను ఇంటికి నన్ను మరల పంపకుము.
21. కాబట్టి రాజైన సిద్కియా సెలవియ్యగా బంటులు బందీగృహ శాలలో యిర్మీయాను వేసి, పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము ఒక రొట్టె అతనికిచ్చుచు వచ్చిరి; ఇట్లు జరుగగా యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.
Chapter 38
1. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఈ పట్టణములో నిలిచియున్నవారు ఖడ్గముచేతనైనను క్షామము చేతనైనను తెగులుచేతనైనను చత్తురు గాని కల్దీయులయొద్దకు బయలు వెళ్లువారు బ్రదుకుదురు, దోపుడుసొమ్ముదక్కించు కొనునట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రదుకు దురు.
2. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఈ పట్టణము నిశ్చయముగా బబులోనురాజు దండుచేతికి అప్ప గింపబడును, అతడు దాని పట్టుకొనును అని యిర్మీయా ప్రజల కందరికి ప్రకటింపగా
3. మత్తాను కుమారుడైన షెఫట్య యును పషూరు కుమారుడైన గెదల్యాయును షెలెమ్యా కుమారుడైన యూకలును మల్కీయా కుమారుడైన పషూ రును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసిన దేమనగాఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరు వాడేగాని క్షేమము కోరువాడుకాడు.
4. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుటవలన ఈ పట్టణ ములో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు; చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము.
5. అందుకు రాజైన సిద్కియా అతడు మీవశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా
6. వారు యిర్మీయాను పట్టుకొని కారా గృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతి లోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురదమాత్రమే యుండెను, ఆ బురదలో యిర్మీయా దిగబడెను.
7. రాజు బెన్యామీను ద్వారమున కూర్చునియుండగా రాజు ఇంటి లోని కూషీయుడగు ఎబెద్మెలెకను షండుడు,
8. వారు యిర్మీ యాను గోతిలో వేసిరను సంగతి విని, రాజు నగరులో నుండి బయలువెళ్లి రాజుతో ఈలాగు మనవి చేసెను
9. రాజా, నా యేలినవాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్తయెడల ఈ మనుష్యులు చేసినది యావత్తును అన్యాయము; అతడున్న చోటను అతడు అకలిచేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టె లేమియు లేవు.
10. అందుకు రాజునీవు ఇక్కడనుండి ముప్పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొనిపోయి, ప్రవక్త యైన యిర్మీయా చావకమునుపు ఆ గోతిలోనుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవియ్యగా
11. ఎబెద్మెలెకు ఆ మనుష్యులను వెంటబెట్టు కొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి,
12. అచ్చటనుండి పాతవైన చింకిబట్టలను చిరిగి చీరాకులైన గుడ్డపాతలను తీసికొని పోయి, ఆ గోతిలోనున్న యిర్మీయా పట్టుకొనునట్లుగా త్రాళ్లచేత వాటినిదింపిపాతవై చిరిగి చీరాకులైన యీ బట్టలను త్రాళ్లమీద నీ చంకలక్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పెను.
13. యిర్మీయా ఆలాగు చేయగా వారు యిర్మీయాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలోనుండి వెలుపలికి తీసిరి; అప్పుడు యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.
14. తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరములో నున్న మూడవ ద్వారములోనికి ప్రవక్తయైన యిర్మీయాను పిలువనంపించి అతనితో ఇట్లనెనునేను ఒకమాట నిన్నడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాని చెప్పుమనగా
15. యిర్మీయా నేను ఆ సంగతి నీకు తెలియజెప్పినయెడల నిశ్చయముగా నీవు నాకు మరణ శిక్ష విధింతువు, నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు.
16. కావున రాజైన సిద్కియాజీవాత్మను మన కను గ్రహించు యెహోవాతోడు నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయ జూచుచున్న యీ మనుష్యుల చేతికి నిన్ను అప్పగింపను అని యిర్మీయాతో రహ స్యముగా ప్రమాణము చేసెను.
17. అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇట్లనెనుదేవుడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడునీవు బబులోనురాజు అధిపతులయొద్దకు వెళ్లిన యెడల నీవు బ్రదికెదవు, ఈపట్టణము అగ్నిచేత కాల్చబడదు, నీవును నీ యింటివారును బ్రదుకుదురు.
18. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్లనియెడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును, వారు అగ్ని చేత దాని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలవు.
19. అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో ఇట్లనెనుకల్దీయుల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను; ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించినయెడల వారు నన్ను అపహ సించెదరు.
20. అందుకు యిర్మీయావారు నిన్నప్పగింపరు, నీవు బ్రదికి బాగుగానుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతినిగూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్త గించి ఆలకించుము.
21. నీవు ఒకవేళ బయలు వెళ్లక పోయినయెడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను.
22. యూదా రాజు నగరులో శేషించియున్న స్త్రీలందరు బబులోను అధిపతులయొద్దకు కొనిపోబడెదరు, ఆలాగు జరుగగా ఆ స్త్రీలు నిన్ను చూచినీ ప్రియస్నేహితులు నిన్ను మోస పుచ్చి నీ పైని విజయము పొందియున్నారు, నీ పాదములు బురదలో దిగబడియుండగా వారు వెనుకతీసిరని యందురు.
23. నీ భార్యలందరును నీ పిల్లలును కల్దీయులయొద్దకు కొనిపో బడుదురు, నీవు వారి చేతిలోనుండి తప్పించుకొనజాలక బబులోను రాజుచేత పట్టబడెదవు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు.
24. అందుకు సిద్కియా యిర్మీయాతో ఇట్లనెనునీవు మరణశిక్ష నొంద కుండునట్లు ఈ సంగతులను ఎవనికిని తెలియనియ్యకుము.
25. నేను నీతో మాటలాడిన సంగతి అధిపతులు వినినయెడల వారు నీయొద్దకు వచ్చిమేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగుచేయక మాకిప్పుడే తెలియజెప్పుమనగా
26. నీవుయోనాతాను ఇంటిలో నేను చనిపోకుండ అక్కడికి నన్ను తిరిగి వెళ్లనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసికొనబోతినని వారితో చెప్పుమని రాజు యిర్మీయాతో అనెను.
27. అంతట అధిపతులందరు యిర్మీయాయొద్దకు వచ్చి యడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకార ముగా వారికుత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయ నందున వారు అతనితో మాటలాడుట మానిరి.
28. యెరూష లేము పట్టబడువరకు యిర్మీయా బందీగృహశాలలో ఉండెను.
Chapter 39
1. యూదారాజైన సిద్కియా యేలుబడియందు తొమి్మదవ సంవత్సరము పదియవ నెలలో బబులోను రాజైన నెబుకద్రెజరు తన సమస్త సైన్యముతో యెరూష లేము మీదికివచ్చిదాని ముట్టడివేయగా
2. సిద్కియా యేలు బడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమి్మదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను.
3. యెరూషలేము పట్టబడగా అధిపతులందరు, నేర్గల్‌షరేజరు సవ్గుర్నెబో షండుల కధిపతియగు శర్సెకీము, జ్ఞానులకధిపతి యగు నేర్గల్‌షరేజరు మొదలైన బబులోనురాజు అధిపతు లందరు లోపలికి వచ్చి మధ్యగుమ్మములో కూర్చుండిరి.
4. యూదులరాజైన సిద్కియాయు అతని యోధులందరును వారినిచూచి పారిపోయి, రాజు తోటమార్గమున రెండు గోడల మధ్యనున్న గుమ్మపుమార్గమున పోయిరి గాని రాజు మైదానపు మార్గమున వెళ్లిపోయెను.
5. అయితే కల్దీయుల సేన వారిని తరిమి యెరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలిసికొని పట్టుకొని, రాజు అతనికి శిక్ష విధింపవలెనని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గర నున్న బబులోనురాజైన నెబుకద్రెజరునొద్దకు వారు సిద్కి యాను తీసికొనిపోయిరి
6. బబులోనురాజు రిబ్లా పట్టణ ములో సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను, మరియు బబులోనురాజు యూదా ప్రధాను లందరిని చంపించెను.
7. అంతట అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసికొనిపోవుటకై సంకెళ్లతో బంధించెను.
8. కల్దీయులు రాజనగరును ప్రజల యిండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకార ములను పడగొట్టిరి.
9. అప్పుడు రాజదేహ సంరక్షకుల కధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణములో నిలిచి యున్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరినవారిని, శేషించిన ప్రజలనందరిని బబులోనునకు కొనిపోయెను.
10. అయితే రాజదేహసంరక్షకుల కధిపతి యైన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదాదేశ ములో నుండనిచ్చి, వారికి ద్రాక్షతోటలను పొలములను నియమించెను.
11. మరియు యిర్మీయాను గూర్చి బబులోను రాజైన నెబుకద్రెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదానునకు
12. ఈ ఆజ్ఞ ఇచ్చెనునీవు ఇతనికి హాని చేయక దగ్గరనుంచుకొని పరామర్శించి, ఇతడు నీతో చెప్పునట్లు చేయవలెను.
13. కావున రాజదేహసంరక్షకులకు అధిపతియైన నెబూజరదానును షండులకు అధిపతియగు నెబూషజ్బానును జ్ఞానులకు అధిపతియగు నేర్గల్‌షరేజరును బబులోనురాజు ప్రధానులందరును దూతలను పంపి
14. బందీగృహశాలలోనుండి యిర్మీయాను తెప్పించి, అతనిని యింటికి తోడుకొనిపోవుటకు షాఫాను కుమారు డైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అతని నప్పగించిరి, అప్పుడతడు ప్రజలమధ్య నివాసముచేసెను.
15. యిర్మీయా బందీగృహశాలలోనుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
16. నీవు వెళ్లి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుముఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమేలు చేయుటకైకాక కీడుచేయు టకై నేను ఈ పట్టణమునుగూర్చి చెప్పిన మాటలు నెర వేర్చుచున్నాను; నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దిన మున నెరవేరును.
17. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుష్యులచేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
18. నీవు నన్ను నమ్ము కొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను, నీవు ఖడ్గముచేత పడవు, దోపుడుసొమ్ము దక్కించుకొను నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు; ఇదేయెహోవా వాక్కు.
Chapter 40
1. రాజదేహసంరక్షకులకధిపతియైన నెబూజరదాను యెరూషలేములోనుండియు యూదాలోనుండియు బబు లోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలోనుండి, సంకెళ్లచేత కట్టబడియున్న యిర్మీయాను తీసికొని రామాలో నుండి పంపివేయగా, యెహోవా యొద్దనుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు.
2. రాజదేహసంరక్షకుల కధిపతి యిర్మీయాను అవతలికి తీసికొపోయి అతనితో ఈలాగు మాటలాడెనుఈ స్థలమునకు నేను ఈ కీడు చేసెదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించెను గదా.
3. తాను చెప్పిన ప్రకారము యెహోవా దాని రప్పించి చేయించెను, మీరు యెహోవాకు విరోధముగా పాపముచేసి ఆయన మాటలు వినక పోతిరి గనుక మీకీగతి పట్టినది.
4. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించు చున్నాను, నాతోకూడ బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచినయెడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడెదను; అయితే బబులోనునకు నాతోకూడ వచ్చుట మంచిదికాదని నీకు తోచినయెడల రావద్దు, దేశమంతట నీకేమియు అడ్డములేదు, ఎక్కడికి వెళ్లుట నీ దృష్టికి అను కూలమో, యెక్కడికి వెళ్లుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్లుము.
5. ఇంకను అతడు తిరిగి వెళ్లక తడవు చేయగా రాజదేహసంరక్షకుల కధిపతి అతనితో ఈలాగు చెప్పెనుబబులోను రాజు షాఫాను కుమారుడైన అహీ కాము కుమారుడగు గెద ల్యాను యూదాపట్టణములమీద నియమించి యున్నాడు, అతని యొద్దకు వెళ్లుము; అతని యొద్ద నివసించి ప్రజలమధ్యను కాపురముండుము, లేదా యెక్కడికి వెళ్లుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్లుము. మరియు రాజదేహసంరక్షకుల కధిపతి అతనికి బత్తెమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా
6. యిర్మీయా మిస్పాలోనుండు అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వెళ్లి అతనితో కూడ దేశములో మిగిలిన ప్రజలమధ్య కాపురముండెను.
7. అయితే అచ్చటచ్చటనుండు సేనల యధిపతులందరును వారి పటాలపువారును, బబులోనురాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశముమీద అధికారిగా నియమించి, బబులోనునకు చెరగొని పోబడక నిలిచినవారిలో స్త్రీలను పురుషులను పిల్లలను, దేశములోని అతినీరసులైన దరిద్రులను అతనికి అప్పగించెనని వినిరి.
8. కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును కారేహ కుమారులైన యోహా నాను యోనాతానులును తన్హుమెతు కుమారుడైన శెరాయా యును నెటోపాతీయుడైన ఏపయి కుమారులును మాయ కాతీయుడైనవాని కుమారుడగు యెజన్యాయును వారి పటాలపువారును మిస్పాలో నుండిన గెదల్యాయొద్దకు వచ్చిరి.
9. అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యా ప్రమాణముచేసి వారితోను వారి పటాలపువారితోను ఈలాగు చెప్పెనుమీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి, దేశములో కాపురముండి బబులోనురాజును సేవించినయెడల మీకు మేలు కలుగును.
10. నేనైతేనో నాయొద్దకు వచ్చు కల్దీయుల యెదుట నిలుచు టకై మిస్పాలో కాపురముందును గాని మీరు ద్రాక్షారసమును వేసవికాల ఫలములను తైలమును సమకూర్చుకొని, మీ పాత్రలలో వాటిని పోసికొని మీరు స్వాధీనపరచుకొనిన పట్టణములలో కాపురముండుడి.
11. మోయాబులో నేమి అమ్మోనీయుల మధ్యనేమి ఎదోములో నేమి యేయే ప్రదేశములలోనేమి యున్న యూదులందరు బబు లోనురాజు యూదాలో జనశేషమును విడిచెననియు, షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను వారిమీద నియమించెననియు వినినప్పుడు
12. అందరును తాము తోలివేయబడిన స్థలములన్నిటిని విడిచి మిస్పాకు గెదల్యాయొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును వేసవికాలపు పండ్లను సమకూర్చుకొనిరి.
13. మరియు కారేహ కుమారుడైన యోహానానును, అచ్చ టచ్చటనున్న సేనల యధిపతులందరును మిస్పా లోనున్న గెదల్యాయొద్దకు వచ్చి
14. నిన్ను చంపుటకు అమ్మోనీయుల రాజైన బయలీను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపెనని నీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు.
15. కారేహ కుమారుడగు యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యముగా ఇట్లనెనునీయొద్దకు కూడివచ్చిన యూదు లందరు చెదరిపోవునట్లును, యూదా జనశేషము నశించు నట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేల?దయచేసి నన్ను వెళ్లనిమ్ము,ఎవనికి తెలియకుండ నేను వానిని చంపెదను.
16. అందుకు అహీకాము కుమారుడైన గెదల్యా కారేహ కుమారుడైన యోహానానుతోఇష్మా యేలునుగూర్చి నీవు అబద్ధమాడుచున్నావు, నీవాకార్యము చేయకూడదనెను.
Chapter 41
1. ఏడవ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజుయొక్క ప్రధాను లలో నొకడునగు ఇష్మాయేలనువాడును, అతనితో పది మంది మనుష్యులును, మిస్పాలోనున్న అహీకాము కుమారు డైన గెదల్యాయొద్దకు వచ్చి అక్కడ అతనితోకూడ మిస్పాలో భోజనముచేసిరి.
2. అప్పుడు నెతన్యా కుమారు డైన ఇష్మాయేలు అతనితో కూడనున్న ఆ పదిమంది మనుష్యులును లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గముచేత హతముచేసిరి; బబు లోనురాజు ఆ దేశముమీద అతని అధికారినిగా నియ మించినందున అతని చంపిరి.
3. మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదుల నందరిని, అక్కడ దొరికిన యోధులగు కల్దీయులను ఇష్మాయేలు చంపెను.
4. అతడు గెదల్యాను చంపిన రెండవనాడు అది ఎవరికిని తెలియబడక మునుపు
5. గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరచుకొనిన యెనుబదిమంది పురుషులు యెహోవా మందిరము నకు తీసికొని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకొని షెకెము నుండియు షిలోహు నుండియు షోమ్రోనునుండియు రాగా
6. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు, వారిని ఎదుర్కొనుటకు మిస్పాలోనుండి బయలు వెళ్లి వారిని కలిసికొని వారితో-- అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు రండనెను.
7. అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మా యేలును అతనితోకూడ ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి.
8. అయితే వారిలో పదిమంది మను ష్యులు ఇష్మాయేలుతోపొలములలో దాచబడిన గోధు మలు యవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు, మమ్మును చంపకుమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడ వారిని చంపక మానెను.
9. ఇష్మా యేలు గెదల్యాతోకూడ చంపిన మనుష్యుల శవములన్ని టిని పడవేసిన గోయి రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే; నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడినవారి శవములతో దాని నింపెను.
10. అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేష మంతటిని రాజ కుమార్తెలనందరిని అనగా రాజదేహసంరక్ష కుల కధిపతియైన నెబూజరదాను అహీకాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరిని, చెరతీసికొనిపోయెను. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెరతీసికొనిపోయి అమ్మోనీయులయొద్దకు చేరవలెనని ప్రయత్నపడుచుండగా
11. కారేహ కుమారుడైన యోహానానును అతనితోకూడనున్న సేనాధిపతులందరును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన వార్త విని
12. పురుషులనందరిని పిలుచుకొని, నెతన్యా కుమారుడైన ఇష్మా యేలుతో యుద్ధము చేయబోయి, గిబియోనులోనున్న మహా జలముల దగ్గర అతని కలిసికొనిరి.
13. ఇష్మాయేలుతో కూడనున్న ప్రజలందరు కారేహ కుమారుడైన యోహా నానును, అతనితో కూడనున్న సేనాధిపతులనందరిని చూచినప్పుడు వారు సంతోషించి
14. ఇష్మాయేలు మిస్పాలో నుండి చెరగొనిపోయిన ప్రజలందరు అతని విడిచి కారేహ కుమారుడైన యెహానానుతో కలిసిరి.
15. అయినను, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును ఎనమండుగురు మనుష్యులును యోహానాను చేతిలోనుండి తప్పించుకొని అమ్మోనీయుల యొద్దకు పారి పోయిరి.
16. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెద ల్యాను చంపిన తరువాత,
17. కారేహ కుమారుడైన యోహా నానును అతనితో కూడనున్న సేనల యధిపతులందరును మిస్పాదగ్గరనుండి ఇష్మాయేలు నొద్దనుండి జనశేషమంతటిని, అనగా గిబియోను దగ్గరనుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను, రాజపరివారమును మరల రప్పించిరి;
18. అయితే వారు బబులోనురాజు దేశముమీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మా యేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్లుదమనుకొని బేత్లెహేముదగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి.
Chapter 42
1. అంతలో సేనాధిపతులందరును కారేహ కుమారుడైన యోహానానును హోషేయా కుమారుడైన యెజన్యాయును, అల్పులేమి ఘనులేమి ప్రజలందరును ప్రవక్తయైన యిర్మీయా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు మనవి చేసిరి
2. మేము ఎంత కొంచెము మంది మిగిలియున్నామో నీవు చూచు చున్నావు గదా? చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి, శేషించియున్న మా యందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థనచేయుము.
3. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక.
4. కాగా ప్రవక్త యైన యిర్మీయా వారికుత్తరమిచ్చినదేమనగామీరు చేసిన మనవి నేనంగీకరించుచున్నాను, మీ మాటలనుబట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును, ఏమియు మీకు మరుగుచేయక యెహోవా మిమ్మునుగూర్చి సెల విచ్చునదంతయు మీకు తెలియజేతును.
5. అప్పుడు వారు యిర్మీయాతో ఇట్లనిరినిన్ను మా యొద్దకు పంపి, నీ దేవు డగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలనుబట్టి మరుమాట లేకుండ మేము జరిగించని యెడల యెహోవా మామీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండును గాక.
6. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట విను వారమై, అది మేలేగాని కీడేగాని మేము ఆయనయొద్దకు నిన్ను పంపువిషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుము.
7. పది దినములైన తరువాత యెహోవా వాక్కు యిర్మీ యాకు ప్రత్యక్షమాయెను గనుక
8. అతడు కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనల యదిఫతులనందరిని, అల్పులనేమి ఘనుల నేమి ప్రజలనందరిని పిలిపించి వారితో ఇట్లనెను
9. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి గదా? ఆయన సెలవిచ్చునదేమనగా
10. నేను మీకు చేసిన కీడునుగూర్చి సంతాపమొందియున్నాను, మీరు తొందరపడక యీ దేశములో కాపురమున్న యెడల, పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెల్లగింపక నాటెదను.
11. మీరు బబులోనురాజునకు భయపడు చున్నారే; అతనికి భయపడకుడి, అతని చేతిలోనుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడై యున్నాను, అతనికి భయపడకుడి,
12. మరియు అతడు మీయెడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపు నట్లు మీయెడల నేనతనికి జాలి పుట్టించెదను.
13. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట విననివారై యీ దేశమందు కాపురముండకమనము ఐగుప్తు దేశమునకు వెళ్లుదము,
14. అక్కడ యుద్ధము చూడకయు బూరధ్వని వినకయు ఆహారపు లేమిచేత ఆకలిగొనకయు నుందుము గనుక అక్కడనే కాపురముందమని మీరనుకొనిన యెడల
15. యూదావారిలో శేషించిన వారలారా, యెహోవా మాట ఆలకించుడి; ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఐగుప్తునకు వెళ్లవలెనని నిశ్చయించుకొని అక్కడనే కాపురముండు టకు మీరు వెళ్లినయెడల
16. మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మును తరిమి పట్టు కొనును; మీకు భయము కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మును తరిమి కలిసికొనును, అక్కడనే మీరు చత్తురు,
17. నేను వారిమీదికి రప్పించు కీడునుండి వారిలో శేషించువాడైనను తప్పించుకొనువాడైనను ఉండడు, ఐగుప్తులో నివసింపవలెనని అక్కడికి వెళ్ల నిశ్చయించుకొను మనుష్యులందరు ఖడ్గముచేతను క్షామముచేతను తెగులు చేతను నిశ్శేషముగా చత్తురు.
18. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునా కోప మును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదికి వచ్చినట్లు, మీరు ఐగుప్తునకు వెళ్లినయెడల నా ఉగ్రత మీమీదికిని వచ్చును, మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింప బడువారుగాను ఉందురు, ఈ స్థలమును మరి యెప్పుడును చూడరు.
19. యూదా శేషులారా, ఐగుప్తునకు వెళ్లకూడదని యెహోవా మీకాజ్ఞనిచ్చినట్టు నేడు నేను మీకు సాక్ష్య మిచ్చితినని మీరే నిశ్చయముగా తెలిసికొనుచున్నారు.
20. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థనచేసి మన దేవుడైన యెహోవా చెప్పునదంతయు మాకు తెలియ జెప్పినయెడల మేమాలాగు చేయుదుమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు.
21. నేడు నేను మీకు దాని తెలియజెప్పుచున్నాను గాని మీ దేవుడైన యెహోవా మీయొద్దకు నాచేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతిరి.
22. కాబట్టి కాపురముండవలెనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గముచేతను క్షామము చేతను తెగులుచేతను చత్తురని నిశ్చయముగా తెలిసికొనుడి.
Chapter 43
1. అతడు ప్రజలకందరికి ప్రకటింపవలెనని దేవుడైన... యెహోవా పంపిన ప్రకారము యిర్మీయా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటిని వారికి ప్రకటించి చాలింపగా
2. హోషేయా కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరును యిర్మీయాతో ఇట్లనిరినీవు అబద్ధము పలుకుచున్నావుఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్లకూడ దని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు.
3. మమ్మును చంపుటకును, బబులోనునకు చెర పట్టుకొని పోవుటకును, కల్దీయులచేతికి మమ్మును అప్పగింప వలెనని నేరీయా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు. (అని చెప్పిరి)
4. కాగా కారేహ కుమారుడైన యోహానానును సేనలయధిపతులందరును ప్రజ లందురును యూదాదేశములో కాపురముండవలెనన్న యెహోవా మాట వినకపోయిరి.
5. మరియు కారేహ కుమారుడైన యోహానానును సేనల యధిపతులందరును యెహోవా మాట విననివారై, యూదాదేశములో నివ సించుటకు తాము తరిమి వేయబడిన ఆయా ప్రదేశములనుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును,
6. అనగా రాజ దేహసంరక్షకులకధిపతియగు నెబూజరదాను షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అప్ప గించిన పురుషులను స్త్రీలను పిల్లలను రాజకుమార్తెలను ప్రవక్తయగు యిర్మీయాను నేరీయా కుమారుడగు బారూకును తోడుకొనిపోయి
7. ఐగుప్తుదేశములో ప్రవేశించిరి. వారు తహపనేసుకు రాగా
8. యెహోవా వాక్కు తహపనేసులో యిర్మీయాకు ప్రత్యక్షమై యిలాగు సెల విచ్చెను
9. నీవు పెద్ద రాళ్లను చేత పట్టుకొని, యూదా మనుష్యులు చూచుచుండగా తహపనేసులో నున్న ఫరో నగరు ద్వారముననున్న శిలావరణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకీమాట ప్రకటింపుము
10. ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగాఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను పిలువనంపించి తీసికొనివచ్చి, నేను పాతిపెట్టిన యీ రాళ్లమీద అతని సింహాసనము ఉంచెదను, అతడు రత్నకంబళిని వాటిమీదనే వేయిం చును.
11. అతడువచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగు లునకును, చెరకు నిర్ణయమైనవారిని చెరకును, ఖడ్గమునకు నిర్ణయమైనవారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తీ యులను హతముచేయును.
12. ఐగుప్తు దేవతల గుళ్లలో నేను అగ్ని రాజ బెట్టుచున్నాను, వాటిని నెబుకద్రెజరు కాల్చి వేయును, ఆ దేవతలను చెరగొనిపోవును, గొఱ్ఱలకాపరి తన వస్త్రమును చుట్టుకొనునట్లు అతడు ఐగుప్తుదేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడనుండి సాగి పోవును.
13. అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవతాపట్టణము లోని సూర్యప్రతిమలను విరుగగొట్టి ఐగుప్తు దేవతల గుళ్లను అగ్నిచేత కాల్చివేయును.
Chapter 44
1. మిగ్దోలులోగాని తహపనేసులోగాని నొపులోగాని పత్రోసులోగాని ఐగుప్తుదేశవాసముచేయుచున్న యూదులనందరినిగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా వాక్కు యిర్మీ యాకు ప్రత్య క్షమై యీలాగు సెలవిచ్చెను
2. నేను యెరూషలేము మీదికిని యూదా పట్టణములన్నిటి మీదికిని రప్పించిన కీడంతయు మీరు చూచుచునే యున్నారు.
3. మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్యదేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయుచు వచ్చుటవలన వాటి నివాసులు తాము చేసికొనిన దోషముచేత నాకు కోపము పుట్టించిరి గనుక నేడు నివాసులులేకుండ అవి పాడుపడి యున్నవి గదా.
4. మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీయొద్దకు పంపుచు, నాకసహ్యమైన యీ హేయకార్యమును మీరు చేయ కుండుడి అని నేను చెప్పుచువచ్చితిని గాని
5. వారు అల కింపక పోయిరి, అన్యదేవతలకు ధూపార్పణముచేయుట మానకపోయిరి, తమ దుర్మార్గతను విడువకపోయిరి చెవి యొగ్గకపోయిరి.
6. కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి, యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను రగులుకొనెను, గనుక నేడున్నట్లుగా అవి పాడై యెడారి ఆయెను.
7. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు అజ్ఞ ఇచ్చుచున్నాడుఏమియు శేషములేకుండ స్త్రీ పురుషు లును శిశువులును చంటి బిడ్డలును యూదా మధ్య నుండ కుండ నిర్మూలము చేయబడునట్లుగా మీరేల ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసికొనుచున్నారు?
8. మీకుమీరే సమూలనాశనము తెచ్చుకొనునట్లును, భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు దూషణపాలై తిరస్క రింపబడునట్లును, మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్యదేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేల యీలాగున చేయుచు మీ చేతిక్రియలచేత నాకు కోపము పుట్టించుచున్నారు?
9. వారు యూదాదేశములోను యెరూషలేము వీధుల లోను జరిగించిన క్రియలను అనగా మీ పితరులు చేసిన చెడుతనమును యూదా రాజులు చేసిన చెడుతనమును వారి భార్యలు చేసిన చెడుతనమును, మీమట్టుకు మీరు చేసిన చెడుతనమును మీ భార్యలు చేసిన చెడుతనమును మరచి పోతిరా?
10. నేటివరకు వారు దీనమనస్సు ధరింపకున్నారు, భయము నొందకున్నారు, నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రము నైనను కట్టడలనైనను అనుసరింపకయే యున్నారు.
11. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమీకు కీడు చేయునట్లు,
12. అనగా యూదావారినందరిని నిర్మూలము చేయునట్లు, నేను మీకు అభిముఖుడనగుదును; ఐగుప్తు దేశములో కాపురముందుమని అచ్చటికి వెళ్ల నిశ్చయించు కొను యూదాశేషులను నేను తోడుకొని పోవుదును, వారందరు ఐగుప్తు దేశములోనే నశించెదరు; అల్పులేమి ఘనులేమి వారందరు కూలుదురు, ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను నశింతురు, ఖడ్గముచేతనైనను క్షామము చేతనైనను వారు చత్తురు, శాపాస్పదమును భీతి పుట్టించు వారుగాను దూషణపాలుగాను తిరస్కారము నొందిన వారుగాను ఉందురు.
13. యెరూషలేము నివాసులను నేనే లాగు శిక్షించితినో ఆలాగే ఐగుప్తుదేశములో నివసించు వీరిని ఖడ్గముచేతగాని క్షామముచేతగాని తెగులుచేతగాని శిక్షించెదను.
14. కావున తాము మరలి వచ్చి యూదాదేశములో కాపురముండవలెనన్న మక్కువచేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్లు యూదా వారిలోని శేషము ఎవరును తప్పించుకొనరు, శేషమేమియు ఉండదు, పారి పోవువారు గాక మరి ఎవరును తిరిగిరారు.
15. అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేయుదురని యెరిగియున్న పురుషులందరును, అక్కడ నిలిచియున్న స్త్రీలును,
16. మహా సమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరును యిర్మీయాకు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చిరి యెహోవా నామమునుబట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేమంగీకరింపము,
17. మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చ బోవుచున్నాము; మేమును మా పితరులును మా రాజులును మా యధిపతు లును యూదా పట్టణములలోను యెరూషలేము వీధుల లోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము; ఏలయనగా మేము ఆలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే యుంటిమి, యే కీడును మాకు కలుగలేదు.
18. మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటినుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గముచేతను క్షామముచేతను క్షీణించుచున్నాము.
19. మేము ఆకాశ రాణికి ధూపము వేయగాను, ఆమెకు పానార్పణములు అర్పింపగాను, మా పురుషుల సెలవులేకుండ ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా? ఆమెకు పానార్పణములు పోయుచున్నామా? అని వారు చెప్పగా
20. యిర్మీయా ఆ స్త్రీ పురుషులందరితో, అనగా తనకు అట్లు ప్రత్యుత్తర మిచ్చిన ప్రజలందరితో ఇట్లనెను
21. యూదాపట్టణముల లోను యెరూషలేము వీధులలోను మీరును మీ పితరులును మీ రాజులును మీ యధిపతులును దేశప్రజలును ధూపము వేసిన సంగతి యెహోవా జ్ఞాపకముచేసికొనలేదా? అదే గదా ఆయన మనస్సునకు వచ్చెను.
22. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయకృత్యములను ఎంచి యికను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనము గాను ఆయన చేసెను.
23. యెహోవా మాట వినక, ఆయన ధర్మశాస్త్రమునుబట్టియు కట్టడలనుబట్టియు ఆయన తనకు సాక్ష్యార్థముగా ఇచ్చిన ఆజ్ఞనుబట్టియు నడువక, మీరు ధూపమువేయుచు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను.
24. మరియు యిర్మీయా ప్రజలనందరిని స్త్రీలనందరిని చూచి వారితో ఇట్లనెనుఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి.
25. ఇశ్రాయేలు దేవు డును, సైన్యములకధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఆకాశరాణికి ధూపము వేయుదు మనియు, ఆమెకు పానార్పణములు అర్పింతుమనియు, మేము మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను నిశ్చయముగా నెరవేర్చుదుమనియు మీరును మీ భార్యలును మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే; నిజముగానే మీ మ్రొక్కుబళ్లను మీరు మ్రొక్కుదురు, నిజముగానే మీ మ్రొక్కులను మీరు నెరవేర్తురు.
26. కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా, యెహోవామాటవినుడియెహోవా సెలవిచ్చునదేమనగా ప్రభువగు యెహోవా అను నేను నా జీవముతోడు ప్రమాణము చేయుచు, ఐగుప్తులో నివసించు యూదు లలో ఎవరును ఇకమీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామముతోడు నేను ప్రమాణము చేయు చున్నాను.
27. మేలు చేయుటకు కాక కీడుచేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను; వారు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను క్షీణించిపోవుచు, ఐగుప్తుదేశములోనున్న యూదావారందరు శేషములేకుండ చత్తురు.
28. ఖడ్గము తప్పించుకొనువారు కొద్దిమందియై ఐగుప్తుదేశములో నుండి యూదాదేశమునకు తిరిగి వచ్చెదరు, అప్పడు ఐగుప్తుదేశములో కాపురముండుటకు వెళ్లిన యూదా వారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో, నాదో తమదో అది తెలిసికొందురు.
29. మీకు కీడు సంభవించు నట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును, నేను ఈ స్థలమందు మిమ్మును శిక్షించు చున్నందుకును ఇది మీకు సూచనగా నుండును; ఇదే యెహోవా వాక్కు.
30. అతనికి శత్రువై అతని ప్రాణ మును తీయ జూచుచుండిన నెబుకద్రెజరను బబులోను రాజుచేతికి నేను యూదారాజైన సిద్కియాను అప్పగించి నట్లు ఐగుప్తురాజైన ఫరోహొఫ్రను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచువారి చేతికి అప్పగించెదను.
Chapter 45
1. యూదారాజును యోషీయా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున యిర్మీయా నోటిమాటనుబట్టి నేరీయా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్త యైన యిర్మీయా అతనితో చెప్పినది
2. బారూకూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు
3. కటకటా, నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు, మూలుగుచేత అలసి యున్నాను, నాకు నెమ్మది దొరకదాయెను అని నీవనుకొను చున్నావు.
4. నీవు అతనికి ఈ మాట తెలియజేయుమని యెహోవా సెలవిచ్చుచున్నాడునేను కట్టినదానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటినదానినే పెల్లగించు చున్నాను; సర్వభూమినిగూర్చియు ఈ మాట చెప్పు చున్నాను.
5. నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకు చున్నావా? వెదకవద్దు; నేను సర్వశరీరులమీదికి కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్లు స్థలములన్నిటిలో దోపుడుసొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చు చున్నాను; ఇదే యెహోవా వాక్కు.
Chapter 46
1. అన్యజనులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు... ప్రత్యక్షమైన యెహోవా వాక్కు
2. ఐగుప్తునుగూర్చిన మాట, అనగా యోషీయా కుమారు డును యూదారాజునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కెమీషులో యూఫ్రటీసునదిదగ్గర ఓడించిన ఫరోనెకో దండును గూర్చిన మాట.
3. డాలును కేడెమును స్థిరపరచుకొనుడి యుద్ధమునకు రండి
4. గుఱ్ఱములను కట్టుడి, రౌతులారా, కవచము తొడిగి ఎక్కుడి శిరస్త్రాణములను ధరించుకొనుడి ఈటెలకు పదును పెట్టుడి కవచములు వేసికొనుడి.
5. నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవుచున్నారు వెనుకతీయుచున్నారు వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు తిరిగిచూడక వేగిరముగా పారిపోవుచున్నారు ఎటుచూచిన భయమే; యెహోవా మాట యిదే.
6. త్వరగ పరుగెత్తువారు పారిపోజాలకున్నారు బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు ఉత్తరదిక్కున యూఫ్రటీసు నదీతీరమందు వారు తొట్రిల్లిపడుచున్నారు.
7. నైలునదీప్రవాహమువలె వచ్చు నితడెవడు? ఇతని జలములు నదులవలె ప్రవహించుచున్నవి
8. ఐగుప్తీయుల దండు నైలునదివలె ప్రవహించుచున్నది. దాని జలములు తొణకునట్లుగా అది వచ్చుచున్నది.నేనెక్కి భూమిని కప్పెదనుపట్టణమును దాని నివాసులను నాశనము చేసెదను.
9. గుఱ్ఱములారా, యెగురుడి; రథములారా, రేగుడి బలాఢ్యులారా, బయలుదేరుడిడాళ్లు పట్టుకొను కూషీయులును పూతీయులును విలుకాండ్రైన లూదీయులును బయలుదేరవలెను.
10. ఇది ప్రభువును సైన్యములకధిపతియునగు యెహో వాకు పగతీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండనచేయును ఖడ్గము కడుపార తినును, అది తనివితీర రక్తము త్రాగును. ఉత్తర దేశములో యూఫ్రటీసునదియొద్ద ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా బలి జరి గింప బోవుచున్నాడు.
11. ఐగుప్తుకుమారీ, కన్యకా, గిలాదునకు వెళ్లి గుగ్గిలము తెచ్చుకొనుము విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే నీకు చికిత్స కలుగదు
12. నీకు సిగ్గుకలిగిన సంగతి జనములకు వినబడెను నీ రోదనధ్వని దేశమందంతట వినబడుచున్నది బలాఢ్యులు బలాఢ్యులను తగిలి కూలుచున్నారు ఒకనిమీద ఒకడు పడి అందరు కూలుదురు.
13. బబులోనురాజైన నెబుకద్రెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతముచేయుటను గూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
14. ఐగుప్తులో తెలియజేయుడి మిగ్దోలులో ప్రకటింపుడి నొపులోను తహపనేసులోను ప్రకటనచేయుడి ఏమనగాఖడ్గము నీ చుట్టునున్న ప్రదేశములను మింగివేయుచున్నది మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి.
15. నీలో బలవంతులైన వారేల తుడుపు పెట్టబడు చున్నారు? యెహోవా వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలువకున్నారు.
16. ఆయన అనేకులను తొట్రిల్ల జేయుచున్నాడు వారొకనిమీద ఒకడు కూలుచు లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందము రండి మన స్వజనులయొద్దకు మన జన్మభూమికి వెళ్లుదము రండి అని వారు చెప్పుకొందురు.
17. ఐగుప్తురాజగు ఫరో యుక్తసమయము పోగొట్టుకొను వాడనియు వట్టిధ్వని మాత్రమేయని వారచ్చట చాటించిరి.
18. పర్వతములలో తాబోరు ఎట్టిదో సముద్రప్రాంతములలో కర్మెలు ఎట్టిదో నా జీవముతోడు అతడు అట్టివాడై వచ్చును రాజును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే.
19. ఐగుప్తు నివాసులారా, నొపు పాడైపోవును అది నిర్జనమై కాల్చబడును ప్రయాణమునకు కావలసినవాటిని సిద్ధపరచుకొనుడి.
20. ఐగుప్తు అందమైన పెయ్య ఉత్తరదిక్కుననుండి జోరీగ వచ్చుచున్నది వచ్చే యున్నది.
21. పరదేశులైన ఆమె కూలి సిఫాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు వారేగదా వెనుకతట్టు తిరిగిరి యొకడును నిలువకుండ పారిపోయిరి వారికి ఆపద్దినము వచ్చియున్నది శిక్షాదినము వారికాసన్నమాయెను.
22. శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు మ్రానులు నరుకువారివలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదికి వచ్చుచున్నారు ఆలకించుడి ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది యెహోవా వాక్కు ఇదే
23. లెక్కలేనివారై మిడతలకన్న విస్తరింతురు చొర శక్యముకాని ఆమె అరణ్యమును నరికివేయు దురు.
24. ఐగుప్తు కూమారి అవమానపరచబడును ఉత్తరదేశస్థులకు ఆమె అప్పగింపబడును
25. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నోలోనుండు ఆమోను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతని నాశ్రయించువారిని నేను దండించు చున్నాను.
26. వారి ప్రాణము తీయజూచు బబులోనురాజైన నెబు కద్రెజరుచేతికిని అతని సేవకులచేతికిని వారిని అప్పగించుచున్నాను ఆ తరువాత అది మునుపటివలెనే నివాసస్థలమగును ఇదే యెహోవా వాక్కు.
27. నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము ఇశ్రాయేలూ, జడియకుము దూరములోనుండి నిన్ను రక్షించుచున్నాను వారున్న చెరలోనుండి నీ సంతతివారిని రక్షించు చున్నాను ఎవరి భయమును లేకుండ యాకోబు తిరిగివచ్చును అతడు నిమ్మళించి నెమ్మదినొందును.
28. నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడై యున్నాను భయపడకుము నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితినో ఆ సమస్త దేశప్రజలను సమూల నాశనముచేసెదను అయితే నిన్ను సమూల నాశనముచేయను నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమునుబట్టి నిన్ను శిక్షించెదను ఇదే యెహోవా వాక్కు.
Chapter 47
1. ఫరో గాజాను కొట్టకమునుపు ఫిలిష్తీయులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు
2. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జలములు ఉత్తరదిక్కునుండి పొర్లి వరదలై మనుష్యులు మొఱ్ఱపెట్టునట్లుగాను దేశనివాసులందరు అంగలార్చునట్లు గాను, దేశముమీదను అందున్న సమస్తముమీదను పట్టణము మీదను దానిలో నివసించు వారిమీదను ప్రవహించును.
3. వారి బలమైన గుఱ్ఱముల డెక్కలు నేలతన్ను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు.
4. ఫిలిష్తీయులనందరిని లయపరచుట కును, తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలువకుండ అందరిని నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిష్తీయులను నాశనము చేయును,
5. గాజా బోడియాయెను, మైదానములో శేషించిన ఆష్కెలోను నాశనమాయెను. ఎన్నాళ్లవరకు నిన్ను నీవే గాయపరచుకొందువు?
6. యెహోవా ఖడ్గమా, యెంత వరకు విశ్రమింపక యుందువు? నీ వరలోనికి దూరి విశ్ర మించి ఊరకుండుము.
7. అష్కెలోనుమీదికిని సముద్ర తీరముమీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చి యున్నాడు గదా; నీవేలాగు విశ్రమించుదువు? అచ్చ టికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.
Chapter 48
1. మోయాబునుగూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది ఎత్తయిన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నదిఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు.
2. హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవు నట్లు దాని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయ నుద్దేశించుచున్నారు మద్మేనా, నీవును ఏమియు చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది.
3. ఆలకించుడి, హొరొనయీమునుండి రోదనధ్వని విన బడుచున్నది దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభవించు చున్నది.
4. మోయాబు రాజ్యము లయమై పోయెను దాని బిడ్డల రోదనధ్వని వినబడుచున్నది.
5. హొరొనయీము దిగుదలలో పరాజితుల రోదనధ్వని వినబడుచున్నది జనులు లూహీతు నెక్కుచు ఏడ్చుచున్నారు ఏడ్చుచు ఎక్కుచున్నారు.
6. పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకొనుడి అరణ్యములోని అరుహవృక్షమువలె ఉండుడి.
7. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి నీ నిధులను నమ్ము కొంటివి నీవును పట్టుకొనబడెదవు, కెమోషుదేవత చెరలోనికి పోవును ఒకడు తప్పకుండ వాని యాజకులును అధిపతులును చెరలోనికి పోవుదురు.
8. యెహోవా సెలవిచ్చునట్లు సంహారకుడు ప్రతి పట్టణముమీదికి వచ్చును ఏ పట్టణమును తప్పించుకొనజాలదు లోయకూడ నశించును మైదానము పాడైపోవును.
9. మోయాబునకు రెక్కలు పెట్టుడి అది వేగిరముగా బయలుదేరి పోవలెను. నివాసి యెవడును లేకుండ దాని పట్టణములు పాడగును.
10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తు డగును గాక రక్తము ఓడ్చకుండ ఖడ్డము దూయువాడు శాపగ్రస్తు డగును గాక.
11. మోయాబు తన బాల్యమునుండి నెమ్మది నొందెను ఈ కుండలోనుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండ అది మడ్డిమీద నిలిచెను అదెన్నడును చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నదిదాని వాసన ఎప్పటివలెనే నిలుచుచున్నది.
12. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు రాగల దినములలో నేను దానియొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాని కుమ్మరించి దాని పాత్రలను వెలితిచేసివారి జాడీలను పగులగొట్టెదరు.
13. ఇశ్రాయేలువారు తామాశ్రయించిన బేతేలునుబట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులును కెమోషునుబట్టి సిగ్గుపడుచున్నారు
14. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు?
15. మోయాబు పాడైపోవుచున్నది శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు వారి ¸°వనులలో శ్రేష్ఠులు వధకు పోవుచున్నారు సైన్యములకధిపతియగు యెహోవా అను పేరుగల రాజు సెలవిచ్చినమాట యిదే.
16. మోయాబునకు సమూలనాశనము సమీపించుచున్నది దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది.
17. దానిచుట్టునున్న మీరందరు దానినిగూర్చి అంగలార్చుడి దాని కీర్తినిగూర్చి విననివారలారా, అంగలార్చుడి బలమైన రాజదండము ప్రభావముగల రాజదండము విరిగిపోయెనే యని చెప్పుకొనుడి.
18. దేబోనులో ఆసీనురాలై యుండుదానా, మోయాబును పాడుచేసినవాడు నీ మీదికి వచ్చు చున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు.నీ గొప్పతనము విడిచి దిగిరమ్ముఎండినదేశములో కూర్చుండుము.
19. ఆరోయేరు నివాసీ, త్రోవలో నిలిచి కనిపెట్టుము పారిపోవుచున్న వారియొద్ద విచారించుము తప్పించుకొనిపోవుచున్నవారిని అడుగుము ఏమి జరిగినదో వారివలన తెలిసికొనుము.
20. మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది యున్నది గోలయెత్తి కేకలువేయుము మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి
21. మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడియున్నది హోలోనునకును యాహసునకును మేఫాతునకును దీబోనుకును
22. నెబోకును బేత్‌దిబ్లాతయీమునకును కిర్యతాయిమున కును బేత్గామూలునకును
23. బేత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు
24. మోయాబుదేశ పురములన్నిటికిని శిక్ష విధింపబడి యున్నది.
25. మోయాబు శృంగము నరికివేయబడియున్నది దాని బాహువు విరువబడియున్నది యెహోవా వాక్కు ఇదే.
26. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్పచేసికొనెను దాని మత్తిల్లజేయుడి మోయాబు తన వమనములో పొర్లుచున్నది అది అపహాస్యమునొందును.
27. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతనిగూర్చి పలుకునప్పుడెల్ల తల ఆడించుచు వచ్చితివి
28. మోయాబు నివాసులారా, పట్టణములు విడువుడి కొండపేటు సందులలో గూడు కట్టుకొను గువ్వలవలె కొండలో కాపురముండుడి.
29. మోయోబీయుల గర్వమునుగూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు వారి అతిశయమునుగూర్చియు గర్వమునుగూర్చియు
30. అహంకారమునుగూర్చియు పొగరునుగూర్చియు మాకు సమాచారము వచ్చెను వారి తామసమును వచించరాని వారి ప్రగల్భము లును నాకు తెలిసేయున్నవి చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు ఇదే యెహోవా వాక్కు
31. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చు చున్నాను మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను వారు కీర్హరెశు జనులు లేకపోయిరని మొఱ్ఱపెట్టు చున్నారు.
32. సిబ్మా ద్రాక్షవల్లీ, యాజెరునుగూర్చిన యేడ్పును మించునట్లు నేను నిన్నుగూర్చి యేడ్చుచున్నాను నీ తీగెలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను అవి యాజెరుసముద్రమువరకు వ్యాపించెను నీ వేసవికాల ఫలములమీదను ద్రాక్షగెలలమీదను పాడుచేయువాడు పడెను.
33. ఫలభరితమైన పొలములోనుండియు మోయాబు దేశములోనుండియు ఆనందమును సంతోషమును తొలగిపోయెను ద్రాక్షగానుగలలో ద్రాక్షారసమును లేకుండ చేయు చున్నాను జనులు సంతోషించుచు త్రొక్కరు సంతోషము నిస్సంతోషమాయెను.
34. నిమీములో నీళ్లు సహితము ఎండిపోయెను హెష్బోను మొదలుకొని ఏలాలేవరకును యాహసు వరకును సోయరు మొదలుకొని హొరొనయీమువరకును ఎగ్లాత్షాలిషావరకును జనులు కేకలువేయుచున్నారు.
35. ఉన్నతస్థలమున బలులు అర్పించువారిని దేవతలకు ధూపమువేయువారిని మోయాబులో లేకుండజేసెను ఇదే యెహోవా వాక్కు.
36. వారు సంపాదించినదానిలో శేషించినది నశించి పోయెను మోయాబునుగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె నాదము చేయుచున్నది కీర్హరెశువారినిగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె వాగు చున్నది.
37. నిశ్చయముగా ప్రతి తల బోడియాయెను ప్రతి గడ్డము గొరిగింపబడెను చేతులన్నిటిమీద నరుకులును నడుములమీద గోనెపట్టయు నున్నవి.
38. మోయాబు ఇంటి పైకప్పులన్నిటిమీదను దాని వీధులలోను అంగలార్పు వినబడుచున్నది ఒకడు పనికిమాలిన ఘటమును పగులగొట్టునట్లు నేను మోయాబును పగులగొట్టుచున్నాను ఇదే యెహోవా వాక్కు.
39. అంగలార్చుడి మోయాబు సమూలధ్వంసమాయెను మోయాబూ, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము. మోయాబు తన చుట్టునున్న వారికందరికి అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును.
40. యెహోవా సెలవిచ్చునదేమనగా పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది.
41. కోటలు పడగొట్టబడియున్నవి దుర్గములు పట్టబడి యున్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.
42. మోయాబు యెహోవాకంటె గొప్పవాడనని అతిశయ పడగా అది జనము కాకుండ నిర్మూలమాయెను.
43. మోయాబు నివాసీ, భయమును గుంటయు ఉరియు నీమీదికి వచ్చియున్నవి
44. ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవువారు గుంటలో పడుదురు గుంటలోనుండి తప్పించుకొనువారు ఉరిలో చిక్కు కొందురు మోయాబుమీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నానుఇదే యెహోవా వాక్కు.దేశ పరిత్యాగులగువారు బలహీనులై హెష్బోనునీడలో నిలిచియున్నారు.
45. హెష్బోనులోనుండి అగ్నియు సీహోను మధ్యనుండి జ్వాలలును బయలుదేరి
46. మోయాబు శిరస్సును, సందడిచేయువారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబూ, నీకు శ్రమ కెమోషుజనులు నశించియున్నారు నీ కుమారులు చెరపట్టబడిరి చెరపట్టబడినవారిలో నీ కుమార్తెలున్నారు.
47. అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించెదను ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబునుగూర్చిన శిక్షావిధి ముగిసెను.
Chapter 49
1. అమ్మోనీయులనుగూర్చి యెహోవా ఈలాగు సెల... విచ్చుచున్నాడుఇశ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయెనా? మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు?
2. కాగాయెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడురాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణమగు రబ్బా మీదికి వచ్చు యుద్ధము యొక్క ధ్వని వినబడజేసెదను; అది పాడుదిబ్బయగును, దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును, దాని వారసులకు ఇశ్రాయేలీయులు వారసులగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
3. హెష్బోనూ, అంగ లార్చుము, హాయి పాడాయెను, మల్కోమును అతని యాజకులును అతని యధిపతులును చెరలోనికి పోవు చున్నారు; రబ్బా నివాసినులారా, కేకలువేయుడి, గోనెపట్ట కట్టుకొనుడి, మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి.
4. విశ్వాసఘాతకురాలానా యొద్దకు ఎవడును రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసికొన్నదానా,
5. నీ లోయలో జలములు ప్రవహించు చున్నవని, నీవేల నీ లోయలనుగూర్చి యతిశయించు చున్నావు? ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
6. నేను నీ చుట్టునున్న వారందరివలన నీకు భయము పుట్టించు చున్నాను; మీరందరు శత్రువుని కెదురుగా తరుమబడు దురు, పారిపోవువారిని సమకూర్చు వాడొకడును లేక పోవును, అటుతరువాత చెరలోనున్న అమ్మోనీయులను నేను రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.
7. సైన్యములకధిపతియగు యెహోవా ఎదోమునుగూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు తేమానులో జ్ఞానమిక నేమియులేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయెనా? వారి జ్ఞానము వ్యర్థమాయెనా?
8. ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను; దదానీయు లారా, పారిపోవుడి వెనుకకు మళ్లుడి బహులోతున దాగు కొనుడి.
9. ద్రాక్షపండ్లు ఏరువారు నీయొద్దకు వచ్చిన యెడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చినయెడల తమకు చాలునంత దొరుకువరకు నష్టము చేయుదురు గదా?
10. నేను ఏశావును దిగంబరినిగా చేయు చున్నాను, అతడు దాగియుండకుండునట్లు నేనతని మరుగు స్థలమును బయలుపరచుచున్నాను, అతని సంతానమును అతని స్వజాతివారును అతని పొరుగువారును నాశన మగు చున్నారు, అతడును లేకపోవును.
11. అనాధులగు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను, నీ విధవ రాండ్రు నన్ను ఆశ్రయింపవలెను.
12. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు న్యాయముచేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగు చున్నారే, నీవుమాత్రము బొత్తిగా శిక్ష నొందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు.
13. బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారి గాను శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణము లన్నియు ఎన్నటెన్నటికి పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెల విచ్చుచున్నాడు.
14. యెహోవా యొద్దనుండి నాకు వర్త మానము వచ్చెను; జనముల యొద్దకు దూత పంపబడి యున్నాడు, కూడికొని ఆమెమీదికి రండి యుద్ధమునకు లేచి రండి.
15. జనములలో అల్పునిగాను మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను.
16. నీవు భీకరు డవు; కొండసందులలో నివసించువాడా, పర్వత శిఖర మును స్వాధీనపరచుకొనువాడా, నీ హృదయగర్వము నిన్ను మోసపుచ్చెను, నీవు పక్షిరాజువలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడనుండి నిన్ను క్రింద పడద్రోసెదను; ఇదే యెహోవా వాక్కు.
17. ఎదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని యిడుమలన్నియు చూచి వేళాకోళము చేయుదురు.
18. సొదొమయు గొమొఱ్ఱాయు వాటి సమీప పట్టణములును పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడును కాపురముండక పోయినట్లు ఏ మనుష్యుడును అక్కడ కాపురముండడు, ఏ నరుడును దానిలో బసచేయడు.
19. చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రు వులు యొర్దాను ప్రవాహములో నుండి సింహమువలె వచ్చుచున్నారు, నిమిషములోనే నేను వారిని దాని యొద్దనుండి తోలివేయుదును, నేనెవని నేర్పరతునో వానిని దానిమీద నియమించెదను; నన్ను పోలియున్న వాడై నాకు ఆక్షేపణ కలుగచేయువాడేడి? నన్ను ఎదిరింప గల కాపరియేడి?
20. ఎదోమునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసులనుగూర్చి ఆయన ఉద్దేశించినదాని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు, నిశ్చయముగా వారి నివాస స్థలము వారినిబట్టి ఆశ్చర్యపడును.
21. వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను; భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోషయు ఎఱ్ఱసముద్రము దనుక వినబడెను.
22. శత్రువు పక్షిరాజువలె లేచి యెగిరి బొస్రామీద పడవలె నని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు; ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.
23. దమస్కును గూర్చిన వాక్కు. హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గు పడు చున్నవి అవి పరవశములాయెను సముద్రముమీద విచారము కలదుదానికి నెమ్మదిలేదు.
24. దమస్కు బలహీనమాయెను. పారిపోవలెనని అది వెనుకతీయుచున్నది వణకు దానిని పట్టెను ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాసవేదనలు దానిని పట్టెను.
25. ప్రసిద్ధిగల పట్టణము బొత్తిగా విడువబడెను నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడువ బడెను.
26. ఆమె ¸°వనులు ఆమె వీధులలో కూలుదురు ఆ దినమున యోధులందరు మౌనులైయుందురు ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.
27. నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజబెట్టెదను అది బెన్హదదు నగరులను కాల్చివేయును.
28. బబులోనురాజైన నెబుకద్రెజరు కొట్టిన కేదారును గూర్చియు హాసోరు రాజ్యములనుగూర్చియు యెహోవా సెల విచ్చినమాట లేచి కేదారునకు వెళ్లుడి తూర్పుదేశస్థులను దోచు కొనుడి.
29. వారి గుడారములను గొఱ్ఱల మందలను శత్రువులు కొనిపోవుదురు తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టు కొందురు నఖముఖాల భయమని వారు దానిమీద చాటింతురు
30. హాసోరు నివాసులారా, బబులోనురాజైన నెబు కద్రెజరు మీమీదికి రావలెనని ఆలోచన చేయు చున్నాడు మీమీద పడవలెనను ఉద్దేశముతో ఉన్నాడు యెహోవా వాక్కు ఇదే పారిపోవుడి బహులోతున వెళ్లుడి అగాధస్థలములలో దాగుడి
31. మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనముమీద పడుడి.
32. వారి ఒంటెలు దోపుడుసొమ్ముగా ఉండును వారి పశువులమందలు కొల్లసొమ్ముగా ఉండును గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొనువారిని నఖముఖాల చెదరగొట్టుచున్నాను నలుదిక్కులనుండి ఉపద్రవమును వారిమీదికి రప్పించు చున్నాను ఇదే యెహోవా వాక్కు,
33. హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థల ముగా ఉండును అక్కడ ఏ మనుష్యుడును కాపురముండడు ఏ నరుడును దానిలో బసచేయడు.
34. యూదారాజైన సిద్కియా యేలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై ఏలామునుగూర్చి
35. ఈలాగు సెలవిచ్చెనుసైన్యములకధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగానేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచు చున్నాను.
36. నలుదిశలనుండి నాలుగు వాయువులను ఏలాముమీదికి రప్పించి, నలుదిక్కులనుండి వచ్చు వాయు వులవెంట వారిని చెదరగొట్టుదును, వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియు నుండదు.
37. మరియు వారి శత్రువులయెదుటను వారి ప్రాణము తీయజూచు వారియెదుటను ఏలామును భయపడ జేయుదును, నా కోపాగ్నిచేత కీడును వారి మీదికి నేను రప్పించుదును, వారిని నిర్మూలము చేయువరకు వారివెంట ఖడ్గము పంపు చున్నాను; ఇదే యెహోవా వాక్కు.
38. నా సింహాసన మును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనముచేయుదును; ఇదే యెహోవా వాక్కు.
39. అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరల రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.
Chapter 50
1. బబులోనునుగూర్చియు కల్దీయుల దేశమునుగూర్చియు ప్రవక్తయైన యిర్మీయాద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు
2. జనములలో ప్రకటించుడి సమాచారము తెలియ జేయుడి ధ్వజమునెత్తి మరుగుచేయక చాటించుడి బబులోను పట్టబడును బేలు అవమానము నొందును మెరోదకు నేల పడవేయబడును బబులోను విగ్రహములు అవమానము నొందును దాని బొమ్మలు బోర్లద్రోయబడును
3. ఉత్తరదిక్కునుండి దానిమీదికి ఒక జనము వచ్చు చున్నది ఏ నివాసియు లేకుండ అది దాని దేశమును పాడు చేయును మనుష్యులేమి పశువులేమి అందరును పారిపోవుదురు అందరును తర్లిపోవుదురు.
4. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలువారును యూదా వారును కూడి వచ్చెదరు ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవాయొద్ద విచారించుటకై వచ్చెదరు
5. ఎన్నటికిని మరువబడని నిత్యనిబంధన చేసికొని యెహోవాను కలిసికొందము రండని చెప్పుకొనుచు సీయోనుతట్టు అభిముఖులై ఆచ్చటికి వెళ్లు మార్గము ఏదని అడుగుచు వచ్చెదరు ఇదే యెహోవా వాక్కు.
6. నా ప్రజలు త్రోవతప్పిన గొఱ్ఱలుగా ఉన్నారు వారి కాపరులు కొండలమీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి జనులు కొండకొండకు వెళ్లుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి.
7. కనుగొనినవారందరు వారిని భక్షించుచు వచ్చిరి వారి శత్రువులుమేము అపరాధులము కాము వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునగు యెహోవామీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించెనని చెప్పుదురు.
8. బబులోనులోనుండి పారిపోవుడి కల్దీయులదేశములోనుండి బయలువెళ్లుడి మందలకు ముందు మేకపోతులు నడుచునట్లు ముందర నడువుడి.
9. ఉత్తరదేశమునుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను ఆ జనులు దానిమీదికి యుద్ధపంక్తులు తీర్చుచున్నారు వారి మధ్యనుండియే ఆమె పట్టబడును ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడుసొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును.
10. కల్దీయుల దేశము దోపుడుసొమ్మగును దాని దోచుకొను వారందరు సంతుష్టి నొందెదరు ఇదే యెహోవా వాక్కు.
11. నా స్వాస్థ్యమును దోచుకొనువారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడిచేయుచు పెయ్యవలె గంతులువేయుచు బలమైన గుఱ్ఱములవలె మీరు సకిలించుచున్నారే?
12. మీ తల్లి బహుగా సిగ్గుపడును మిమ్మును కన్నది తెల్ల బోవును ఇదిగో అది జనములన్నిటిలో అతినీచ జనమగును అది యెడారియు ఎండినభూమియు అడవియు నగును.
13. యెహోవా రౌద్రమునుబట్టి అది నిర్జనమగును అది కేవలము పాడైపోవును బబులోను మార్గమున పోవువారందరు ఆశ్చర్యపడి దాని తెగుళ్లన్నియు చూచి--ఆహా నీకీగతి పట్టి నదా? అందురు
14. ఆమె యెహోవాకు విరోధముగా పాపముచేసినది. విల్లు త్రొక్కువారలారా, మీరందరు బబులోనునకు విరోధముగా దాని చుట్టు యుద్ధపంక్తులు తీర్చుడి ఎడతెగక దానిమీద బాణములు వేయుడి
15. చుట్టు కూడి దానిని బట్టి కేకలువేయుడి అది లోబడ నొప్పుకొనుచున్నది దాని బురుజులు పడిపోవుచున్నవి దాని ప్రాకారములు విరుగగొట్టబడుచున్నవి ఇది యెహోవా చేయు ప్రతికారము.దానిమీద పగతీర్చుకొనుడి అది చేసినట్టే దానికి చేయుడి.
16. బబులోనులో నుండకుండ విత్తువారిని నిర్మూలము చేయుడి కోతకాలమున కొడవలి పట్టుకొనువారిని నిర్మూలము చేయుడి క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరు తమ ప్రజలయొద్దకు వెళ్లుచున్నారు తమ తమ దేశములకు పారిపోవుచున్నారు.
17. ఇశ్రాయేలువారు చెదిరిపోయిన గొఱ్ఱలు సింహములు వారిని తొలగగొట్టెను మొదట అష్షూరురాజు వారిని భక్షించెను కడపట బబులోను రాజైన యీ నెబుకద్రెజరు వారి యెముకలను నలుగగొట్టుచున్నాడు.
18. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోనురాజును అతని దేశమును దండించెదను.
19. ఇశ్రాయేలువారిని తమ మేతస్థలమునకు నేను తిరిగి రప్పించెదను వారు కర్మెలుమీదను బాషానుమీదను మేయుదురు ఎఫ్రాయిము కొండలమీదను గిలాదులోను మేయుచు సంతుష్టినొందును.
20. ఆ కాలమున ఆ నాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును. యూదా పాపములు వెదకిను అవి దొరుకవు శేషింపజేసినవారిని నేను క్షమించెదను ఇదే యెహోవా వాక్కు.
21. దండెత్తి మెరాతయీయుల దేశముమీదికి పొమ్ము పెకోదీయుల దేశముమీదికి పొమ్ము వారిని హతముచేయుము వారు శాపగ్రస్తులని ప్రకటించుము నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటినిబట్టి చేయుము.
22. ఆలకించుడి, దేశములో యుద్ధధ్వని వినబడుచున్నది అధిక నాశనధ్వని వినబడుచున్నది
23. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగ గొట్టబడెను అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను.
24. బబులోనూ, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టి యున్నాను తెలియకయే నీవు పట్టబడియున్నావు యెహోవాతో నీవు యుద్ధముచేయ బూనుకొంటివి నీవు చిక్కుపడి పట్టబడియున్నావు.
25. కల్దీయులదేశములో ప్రభువును సైన్యములకధిపతియు నగు యెహోవాకు పనియున్నది యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపముతీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చు చున్నాడు.
26. నలుదిక్కులనుండి వచ్చి దానిమీద పడుడి దాని ధాన్యపుకొట్లను విప్పుడి కసవు కుప్పలువేసినట్లు దానిని కుప్పలువేయుడి శేషమేమియు లేకుండ నాశనము చేయుడి
27. దాని యెడ్లన్నిటిని వధించుడి అవి వధకు పోవలెను అయ్యో, వారికి శ్రమ వారి దినము ఆసన్నమాయెను వారి దండనకాలము వచ్చెను.
28. ఆలకించుడి, పారిపోయి బబులోను దేశములోనుండి తప్పించుకొని వచ్చుచున్నవారి శబ్దము వినబడు చున్నది మన దేవుడగు యెహోవా చేయు ప్రతికార సమా చారమును తన ఆలయము విషయమై ఆయన చేయు ప్రతికార సమాచారమును సీయోనులో ప్రకటించుడి. వారు వచ్చుచున్నారు.
29. బబులోనునకు రండని విలుకాండ్రమ పిలువుడి విల్లు త్రొక్కువారలారా, మీరందరు దానిచుట్టు దిగుడి. అది యెహోవామీద గర్వపడినది ఇశ్రాయేలు పరిశుద్ధునిమీద గర్వపడినది దానిలో నొకడును తప్పించుకొనకూడదు దాని క్రియలనుబట్టి దానికి ప్రతికారము చేయుడి అది చేసిన పనియంతటినిబట్టి దానికి ప్రతికారము చేయుడి.
30. కావున ఆ దినమున దాని ¸°వనస్థులు దాని వీధులలో కూలుదురు దాని యోధులందరు తుడిచివేయబడుదురు ఇదే యెహోవా వాక్కు.
31. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై యున్నాను నీ దినము వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించుకాలము వచ్చుచున్నది
32. గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును అతని లేవనెత్తువాడెవడును లేకపోవును నేనతని పురములలో అగ్ని రాజబెట్టెదను అది అతని చుట్టుపట్టులన్నిటిని కాల్చివేయును.
33. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు ఒకడును తప్పకుండ ఇశ్రాయేలువారును యూదా వారును బాధింపబడిరి వారిని చెరపెట్టినవారందరు వారిని గట్టిగా పట్టుకొను చున్నారు వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు.
34. వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యెమును కడ ముట్టించును.
35. యెహోవా మాట యిదే కల్దీయులును బబులోను నివాసులును దాని అధిపతులును జ్ఞానులును కత్తిపాలగుదురు
36. ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగు దురు. బలాఢ్యులు నిర్మూలమగువరకు ఖడ్గము వారిమీద పడును
37. ఖడ్గము వారి గుఱ్ఱములమీద పడును వారి రథముల మీద పడును ఖడ్గము వారిమీదికి దిగుటచేత దానిలోనున్న పరదేశులు స్త్రీలవంటివారగుదురు అది దాని నిధులమీద పడగా అవి దోచుకొనబడును.
38. నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములుగల దేశము జనులు భీకరప్రతిమలనుబట్టి పిచ్చిచేష్టలు చేయుదురు.
39. అందుచేతను అడవిపిల్లులును నక్కలును అక్కడ నివ సించును నిప్పుకోళ్లును దానిలో నివాసముచేయును ఇకమీదట అది ఎన్నడును నివాసస్థలము కాకపోవును తరతరములు దానిలో ఎవరును కాపురముండరు.
40. యెహోవా వాక్కు ఇదే సొదొమను గొమొఱ్ఱాను వాటి సమీపపట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడును అక్కడ కాపురముండకపోవును ఏ నరుడును దానిలో బసచేయడు.
41. జనులు ఉత్తరదిక్కునుండి వచ్చుచున్నారు మహాజనమును అనేక రాజులును భూదిగంతములనుండి రేపబడెదరు.
42. వారు వింటిని ఈటెను పట్టుకొని వచ్చెదరు వారు క్రూరులు జాలిపడనివారు వారి స్వరము సముద్రఘోషవలె ఉన్నది వారు గుఱ్ఱములను ఎక్కువారు బబులోను కుమారీ, ఒకడు యుద్ధపంక్తులు తీర్చు రీతిగా వారందరు నీమీద పంక్తులు తీర్చుచున్నారు.
43. బబులోనురాజు వారి సమాచారము విని దుర్బలు డాయెను అతనికి బాధ కలిగెను ప్రసవ స్త్రీ వేదనవంటి వేదన అతనికి సంభవించెను.
44. చిరకాల నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు నిమిషములోనే నేను వారిని దానియొద్దనుండి తోలి వేయుదును నేనెవని ఏర్పరతునో వానిని దానిమీద నియమించెదనునన్ను పోలియున్నవాడై నన్ను ఆక్షేపణచేయువాడేడి?నన్ను ఎదిరింపగల కాపరి ఏడి?
45. బబులోనునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి కల్దీయుల దేశమునుగూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి నిశ్చయముగా మందలోని అల్పులైనవారిని వారు లాగు దురు నిశ్చయముగా వారినిబట్టి వారి నివాసస్థలము విస్మయ మొందును.
46. బబులోను పట్టబడుచున్నదను సమాచారము విని భూమి కంపించుచున్నది జనములలో అంగలార్పు వినబడుచున్నది.
Chapter 51
1. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను బబులోను మీదికిని దానిలో కాపు రముచేసి నాకు విరోధముగలేచిన వారిమీదికిని ప్రచండమైన వాయువును రప్పించెదను.
2. అన్యదేశస్థులను బబులోనునకు పంపుచున్నాను వారు ఆ దేశమును తూర్పారపట్టి దాని వట్టిదిగా చేయుదురు ఆపద్దినమున వారు నలుదిక్కులనుండి దానిమీదికి వచ్చెదరు.
3. విలుకానిమీదికి విలుకాడు విల్లు త్రొక్కవలెను కవచము వేసికొనువానిమీదికిని విల్లు త్రొక్కవలెను కల్దీయులదేశములో జనులు హతులై పడునట్లును దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును
4. ¸°వనులను కొట్టక మానకుడి దాని సర్వసైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి.
5. తమ దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఇశ్రాయేలువారిని యూదావారిని విసర్జింపలేదు గాని ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారిదేశము నిండి యున్నది.
6. మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులోనుండి పారిపోవుడి మీ ప్రాణములు రక్షించుకొనుడి ఇది యెహోవాకు ప్రతికారకాలము అది చేసిన క్రియలనుబట్టి ఆయన దానికి ప్రతికారము చేయుచున్నాడు.
7. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారుపాత్రయై యుండెను. దానిచేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి యున్నారు.
8. బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తునియ లాయెను దానిని చూచి అంగలార్చుడి అది స్వస్థతనొందునేమో దాని నొప్పికొరకు గుగ్గిలము తీసికొని రండి.
9. మనము బబులోనును స్వస్థపరచగోరితివిు అయితే అది స్వస్థత నొందలేదు దాని విడిచి పెట్టుడి. మన మన దేశములకు వెళ్లుదము రండి దాని శిక్ష ఆకాశమంత యెత్తుగా సాగుచున్నది అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది
10. యెహోవా మన న్యాయమును రుజువుపరచు చున్నాడు రండి సీయోనులో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము వివరించుదము.
11. బాణములు చికిలిచేయుడి కేడెములు పట్టుకొనుడి బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించు చున్నాడు మాదీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపు చున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన తన మందిరమునుగూర్చి ఆయన చేయు ప్రతిదండన.
12. బబులోను ప్రాకారములమీద పడుటకై ధ్వజము నిలువబెట్టుడి కావలి బలముచేయుడి కావలివారిని పెట్టుడి మాటు లను సిద్ధపరచుడి బబులోను నివాసులనుగూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానముచేసిన పని తాను జరిగింపబోవుచున్నాడు.
13. విస్తారజలములయొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధిగలదానా, నీ అంతము వచ్చినది అన్యాయలాభము నీకిక దొరకదు.
14. గొంగిళిపురుగులంత విస్తారముగా మనుష్యులతో నేను నిన్ను నింపినను శత్రువులు నీమీద కేకలు వేయు దురు
15. నా జీవముతోడని సైన్యముల కధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.
16. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాసులు ఆకాశమండల ములో పుట్టును. భూమ్యంతభాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క జేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలోనుండి గాలిని రావించును.
17. తెలివిలేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమొందును అతడు పోతపోసినది మాయారూపము దానిలో ప్రాణమేమియు లేదు.
18. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు విమర్శకాలమున అవి నశించిపోవును.
19. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటివాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.
20. నీవు నాకు గండ్రగొడ్డలివంటివాడవు యుద్ధాయుధమువంటివాడవు నీవలన నేను జనములను విరుగగొట్టుచున్నాను నీవలన రాజ్యములను విరుగగొట్టుచున్నాను.
21. నీవలన గుఱ్ఱములను రౌతులను విరుగగొట్టుచున్నాను. నీవలన రథములను వాటి నెక్కినవారిని విరుగగొట్టు చున్నాను.
22. నీవలన స్త్రీలను పురుషులను విరుగగొట్టుచున్నాను నీవలన ముసలివారిని బాలురను విరుగగొట్టుచున్నాను నీవలన ¸°వనులను కన్యకలను విరుగగొట్టుచున్నాను.
23. నీవలన గొఱ్ఱలకాపరులను వారి గొఱ్ఱలమందలను విరుగగొట్టుచున్నాను నీవలన దున్నువారిని వారి దుక్కి టెద్దులను విరుగ గొట్టుచున్నాను నీవలన ఏలికలను అధిపతులను విరుగగొట్టుచున్నాను.
24. బబులోనును కల్దీయుల దేశనివాసులును మీ కన్నులయెదుట సీయోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతికారము చేయుచున్నాను, ఇదే యెహోవా వాక్కు.
25. సర్వభూమిని నశింపజేయు నాశనపర్వతమా, నేను నీకు విరోధిని ఇదే యెహోవా వాక్కు. నేను నీమీదికి నా చేయి చాపి శిలలపైనుండి నిన్ను క్రిందికి దొరలించుదును చిచ్చుపెట్టిన కొండవలె ఉండజేయుదును.
26. మూలకుగాని పునాదికిగాని నీలోనుండి యెవరును రాళ్లు తీసికొనరు నీవు చిరకాలము పాడై యుందువు ఇదే యెహోవా వాక్కు.
27. దేశములో ధ్వజములనెత్తుడి జనములలో బాకానాదము చేయుడి దానిమీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి దానిమీద పడుటకై అరారాతు మిన్నీ అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి దానిమీదికి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియ మించుడి రోమముగల గొంగళిపురుగులంత విస్తారముగా గుఱ్ఱము లను దానిమీదికి రప్పించుడి.
28. దానిమీదికిపోవుటకై మాదీయుల రాజులను వారి అధిపతులను వారి యేలికలను అతడు ఏలుచుండు సర్వదేశమును జనులనందరిని ప్రతిష్ఠించుడి
29. భూమి కంపించుచున్నది నొప్పిచేత అది గిజగిజ లాడు చున్నది ఒక్క నివాసియు లేకుండ బబులోను దేశమును పాడుగా చేయవలెనని బబులోనునుగూర్చిన యెహోవా ఉద్దేశము స్థిర మాయెను.
30. బబులోను పరాక్రమవంతులు యుద్ధముచేయక మాను దురు వారు తమ కోటలలో నిలుచుచున్నారు వారి పరాక్రమము బలహీనత ఆయెను వారును స్త్రీలవంటివారైరి
31. వారి నివాసస్థలములు కాల్చబడుచున్నవి వారి అడ్డగడియలు విరిగిపోయెను అతని పట్టణమంతయు పట్టబడును కోనేటి దూలము లును జమ్మును అగ్నిచేత కాల్చబడును
32. దాని యోధులు దిగులుపడిరి అని బంట్రౌతు వెంబడి బంట్రౌతును దూతవెంబడి దూతయు పరుగెత్తుచు బబులోను రాజు నకు తెలియజేతురు. దాని రేవులు శత్రువశమాయెను.
33. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుబబు లోనుపురము చదరముచేయబడిన కళ్లమువలె ఆయెను ఇంక కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చును.
34. బబులోనురాజైన నెబుకద్రెజరు మమ్మును మింగివేసెను మమ్మును నుగ్గుచేసెను, మమ్మును వట్టికుండవలె ఉంచి యున్నాడు భుజంగము మింగునట్లు మమ్మును మింగెను మా శ్రేష్ఠపదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును పారవేసియున్నాడు.
35. నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోనుమీదికి ప్రతికారరూపముగా దిగును గాక యని సీయోను నివాసి యనుకొనును నా ఉసురు కల్దీయదేశ నివాసులకు తగులునుగాక అని యెరూషలేము అనుకొనును.
36. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆల కించుము, నీ వ్యాజ్యెమును నేను జరిగించుదును నీ నిమిత్తము నేనే పగతీర్చుకొందును దాని సముద్రమును నేనెండకట్టుదును దాని ఊటను ఇంకిపోజేయుదును.
37. బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును నక్కలకు నివాసస్థలమగును అది పాడై యెగతాళికి కారణముగా ఉండును.
38. వారు కూడి సింహములవలె బొబ్బరింతురు సింహముల పిల్లలవలె గుఱ్ఱుపెట్టుదురు.
39. వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్ర నొందునట్లు వారు దప్పిగొనగా వారికి మద్యము నిచ్చి వారిని మత్తిల్లజేసెదను ఇదే యెహోవా వాక్కు.
40. గొఱ్ఱపిల్లలు వధకు పోవునట్లును మేకపోతులును పాట్ఠేళ్లును వధకు పోవునట్లును వారిని వధకు రప్పించెదను.
41. షేషకు పట్టబడెను జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను బబులోను జనములకు విస్మయాస్పదమాయెను.
42. సముద్రము బబులోనుమీదికి వచ్చెను ఆమె దాని తరంగములధ్వనితో నిండుకొనెను.
43. దాని పట్టణములు పాడుగాను ఎండిన భూమిగాను అరణ్యముగాను నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను ఏ నరుడును దానిమీదుగా ప్రయాణము చేయడు.
44. బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను వాడు మింగినదానిని వానినోటనుండి కక్కించు చున్నాను ఇకమీదట జనములు వానియొద్దకు సమూహములుగా కూడి రావు బబులోను ప్రాకారము కూలును;
45. నా జనులారా, మీరు దానిలోనుండి బయటకు వెళ్లుడి యెహోవా కోపాగ్నినుండి తప్పించుకొనుడి మీ ప్రాణములను రక్షించుకొనుడి
46. ఏటేట వదంతి పుట్టుచువచ్చును దేశములో బలాత్కారము జరుగుచున్నది ఏలికమీద ఏలిక లేచుచున్నాడు దేశములో వినబడు వదంతికి భయపడకుడి మీ హృదయములలో దిగులు పుట్టనియ్యకుడి.
47. రాబోవు దినములలో నేను బబులోనుయొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును దాని దేశమంతయు అవమానము నొందును జనులు హతులై దాని మధ్యను కూలెదరు
48. దానిని పాడుచేయువారు ఉత్తరదిక్కునుండి దాని యొద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతినిగూర్చి సంతోషించును ఇదే యెహోవా వాక్కు
49. బబులోను ఇశ్రాయేలులో హతులైనవారిని కూలజేసి నట్లు సర్వభూమిలో బబులోను నిమిత్తము హతులైనవారు కూలుదురు
50. ఖడ్గమును తప్పించుకొనినవారలారా, ఆలస్యముచేయక వెళ్లుడి, దూరమునుండి మీరు యెహోవాను జ్ఞాపకముచేసికొనుడి యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానియ్యుడి.
51. మేము దూషణవాక్యము విని సిగ్గుపడియున్నాము అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధస్థలములలోనికి వచ్చియున్నారు మా ముఖములు తెల్లబోవుచున్నవి
52. ఇదే యెహోవా వాక్కు. రాబోవు దినములలో నేను బబులోనుయొక్క విగ్రహములను శిక్షింతును ఆమె దేశమందంతటను గాయపరచబడినవారు మూల్గు దురు.
53. బబులోను తన బలమైన ఉన్నతస్థలములను దుర్గములుగా చేసికొని ఆకాశమునకు ఎక్కినను పాడుచేయువారు నాయొద్దనుండి వచ్చి దానిమీద పడుదురు ఇదే యెహోవా వాక్కు.
54. ఆలకించుడి, బబులోనులోనుండి రోదనధ్వని వినబడు చున్నది కల్దీయులదేశములో మహా నాశనధ్వని వినబడుచున్నది.
55. యెహోవా బబులోనును పాడుచేయుచున్నాడు దాని మహాఘోషను అణచివేయుచున్నాడు వారి తరంగములు ప్రవాహజలములవలె ఘోషించు చున్నవి వారి ఆర్భాటము వినబడుచున్నది.
56. బబులోనుమీదికి పాడుచేయువాడు వచ్చుచున్నాడు దాని బలాఢ్యులు పట్టబడియున్నారు వారి విండ్లు విరిగిపోయినవి యెహోవా ప్రతికారము చేయు దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును.
57. దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సంస్థానాధి పతులను బలాఢ్యులను మత్తిల్లజేసెదను వారు చిరకాల నిద్రనొంది మేలుకొనకపోదురు ఇదే రాజు వాక్కు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.
58. సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెల విచ్చుచున్నాడు విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడ గొట్టబడును దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయ బడును జనములు వృథాగా ప్రయాసపడుచున్నారు అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు ప్రజలు చూచి అలయుచున్నారు
59. సిద్కియా యేలుబడియందు నాలుగవ సంవత్సరమున శెరాయా దండు భోజనసామగ్రికి అధికారియైయుండి సిద్కియాతోకూడ బబులోనునకు వెళ్లినప్పుడు నేరీయా కుమారుడును మహసేయా మనుమడునైన ఆ శెరాయాకు యిర్మీయా ఆజ్ఞాపించిన మాట.
60. యిర్మీయా బబులోను మీదికి వచ్చు అపాయములన్నిటిని, అనగా బబులోనును గూర్చి వ్రాయబడిన యీ మాటలన్నిటిని గ్రంథములొ వ్రాసెను.
61. కాగా యిర్మీయా శెరాయాతో ఇట్లనెను నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటిని చదివి వినిపించవలెను.
62. ఈలాగున నీవు ప్రకటింపవలెనుయెహోవా, మనుష్యులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపక పోవుదురనియు, అది నిత్యము పాడుగా నుండుననియు దానినిగూర్చి నీవు సెలవిచ్చి తివి.
63. ఈ గ్రంథమును చదివి చాలించినతరువాత నీవు దానికి రాయికట్టి యూఫ్రటీసునదిలో దాని వేసి
64. నేను దాని మీదికి రప్పింపబోవుచున్న అపాయములచేత బబులోను మరల పైకి రాలేక ఆలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. యిర్మీయాయొక్క మాటలు ఇంతటితో ముగిసెను.
Chapter 52
1. సిద్కియా యేలనారంభించినప్పుడు అతడు ఇరువది... యొక్క సంవత్సరములవాడు. అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను, అతని తల్లిపేరు హమూటలు; ఈమె లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె.
2. యెహోయాకీము నడిచిన చెడ్డనడత ప్రకార ముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డనడత నడిచెను.
3. యెహోవా కోపపడి తనయెదుట నుండకుండ వారిని తోలివేయునంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజుమీద తిరుగుబాటుచేయగా
4. అతని యేలుబడియందు తొమి్మదవ సంవత్సరము పదియవ నెల పదియవ దినమున బబులోనురాజైన నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేముమీదికి వచ్చి, దానికి ఎదురుగా దండు దిగి నప్పుడు పట్టణమునకు చుట్టు కోటలు కట్టిరి.
5. ఆలాగు జరుగగా సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవ త్సరమువరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను.
6. నాల్గవ నెల తొమి్మదవ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా నున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను.
7. పట్టణప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరు పారి పోయి రాజుతోటకు దాపైన రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములోనుండి బయలు వెళ్లిరి; కల్దీయులు పట్టణమును చుట్టుకొని యుండగా సైనికులు యొర్దానునది మార్గముగా తర్లిపోయిరి.
8. కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతని కలిసికొనగా అతని దండంతయు అతనియొద్దనుండి చెదరిపోయెను.
9. వారు రాజును పట్టు కొని హమాతు దేశమునందలి రిబ్లాపట్టణమున నున్న బబు లోను రాజునొద్దకు అతని తీసికొనిపోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్షవిధించెను.
10. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను; మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతుల నందరిని చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడ దీయించి
11. రెండు సంకెళ్లతో అతని బంధించి, బబులోను నకు అతని తీసికొనిపోయి, మరణమగువరకు చెరసాలలో అతనిపెట్టించెను.
12. అయిదవ నెల పదియవ దినమున, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఏలుబడియందు పందొమి్మదవ సంవత్సరమున బబులోనురాజు ఎదుట నిలుచు నెబూజర దానను రాజదేహసంరక్షకుల యధిపతి యెరూషలేమునకు వచ్చెను.
13. అతడు యెహోవా మందిరమును రాజునగరును యెరూషలేములోని గొప్పవారి యిండ్లనన్నిటిని కాల్చి వేసెను.
14. మరియు రాజదేహసంరక్షకుల యధిపతితోకూడ నుండిన కల్దీ యుల సేనాసంబంధులందరు యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటిని పడగొట్టిరి
15. మరియు రాజ దేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను ప్రజ లలో కడుబీదలైన కొందరిని, పట్టణములో శేషించిన కొదువ ప్రజలను, బబులోనురాజు పక్షము చేరినవారిని, గట్టి పనివారిలో శేషించినవారిని చెరగొని పోయెను.
16. అయితే రాజదేహసంరక్షకుల యధిపతియైన నెబూజర దాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేద్యము చేయుటకును కడుబీదలలో కొందరిని ఉండనిచ్చెను.
17. మరియు యెహోవా మందిరములోనుండిన ఇత్తడి స్తంభ ములను మందిరములోనుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబు లోనునకు గొనిపోయిరి.
18. అదియుగాక వారు బిందెలను కుండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటిని గొనిపోయిరి.
19. మరియు పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పాత్రలను, బంగారు వాటిని బంగారునకును వెండివాటిని వెండికిని చేర్చుకొని రాజదేహసంరక్షకుల యధిపతి గొనిపోయెను.
20. రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లక్రిందనుండిన పండ్రెండు ఇత్తడి వృషభములను గొనిపోయెను. వీటి కన్నిటికున్న ఇత్తడి యెత్తువేయుటకు అసాధ్యము.
21. వాటిలో ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల యెత్తుగలది, పండ్రెండు మూరల నూలు దాని చుట్టు తిరుగును, దాని దళసరి నాలుగు వ్రేళ్లు; అది గుల్లది.
22. దానిమీద ఇత్తడి పైపీట యుండెను; ఒక్క పైపీట అయి దేసి మూరల ఎత్తుగలది, పైపీటకు చుట్టు అల్లిన వల అల్లి కయు దానిమ్మ పండ్లును ఉండెను; అవి యన్నియు ఇత్త డివి. ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును ఆలాగుననే దానిమ్మ పండ్లుండెను.
23. ప్రక్కలయందు తొంబదియారు దానిమ్మపండ్లుండెను; చుట్టు ఉండిన వల అల్లికమీద దానిమ్మపండ్లన్నియు నూరు.
24. మరియు రాజదేహసంరక్ష కుల యధిపతి ప్రధానయాజకుడైన శెరాయాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టు కొనెను.
25. అతడు పట్టణములోనుండి యోధులమీద నియ మింపబడిన యొక ఉద్యోగస్ధుని, పట్టణములో దొరికిన రాజసన్నిధిలో నిలుచు ఏడుగురు మనుష్యులను, దేశ సైన్యాధిపతియగు వానియొక్క లేఖరిని, పట్టణపు మధ్యను దొరికిన అరువదిమంది దేశప్రజలను పట్టుకొనెను.
26. రాజ దేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను వీరిని పట్టు కొని రిబ్లాలో నుండిన బబులోనురాజు నొద్దకు తీసికొని వచ్చెను.
27. బబులోనురాజు హమాతుదేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశములో నుండి చెరగొనిపోయెను.
28. నెబుకద్రెజరు తన యేలుబడి యందు ఏడవ సంవత్సరమున మూడువేల ఇరువది ముగ్గురు యూదులను చెరగొనిపోయెను
29. నెబుకద్రెజరు ఏలుబడి యందు పదునెనిమిదవ సంవత్సరమున అతడు యెరూష లేమునుండి ఎనిమిదివందల ముప్పది యిద్దరిని చెరగొని పోయెను.
30. నెబుకద్రెజరు ఏలుబడియందు ఇరువది మూడవ సంవత్సరమున రాజ దేహసంరక్షకుల యధిపతియగు నెబూజరదాను యూదులలో ఏడువందల నలుబది యయిదుగురు మనుష్యులను చెరగొనిపోయెను; ఆ మను ష్యుల వెరసి నాలుగువేల ఆరువందలు.
31. యూదారాజైన యెహోయాకీను చెరపట్టబడిన ముప్పది యేడవ సంవత్సరమున పండ్రెండవ నెల యిరువదియైదవ దినమున బబులోనురాజైన ఎవీల్మెరోదకు తన యేలుబడి యందు మొదటి సంవత్సరమున యూదారాజైన యెహో యాకీనునకు దయచూపి, బందీగృహములోనుండి అతని తెప్పించి
32. అతనితో దయగా మాటలాడి అతనితోకూడ బబులోనులోనుండు రాజుల సింహాసనముకంటె ఎత్తయిన సింహాసనము అతనికి నియమించెను.
33. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించి కొని తన జీవితకాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనము చేయుచువచ్చెను.
34. మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నియు అనుదినము అతని పోషణకై బబులోనురాజుచేత భోజనపదార్థములు ఇయ్య బడుచుండెను.

Post a Comment